పాలిప్స్‌కు పరిష్కారం ఏమిటి? | What is the solution to polyps? | Sakshi
Sakshi News home page

పాలిప్స్‌కు పరిష్కారం ఏమిటి?

Published Tue, Jul 26 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

పాలిప్స్‌కు పరిష్కారం ఏమిటి?

పాలిప్స్‌కు పరిష్కారం ఏమిటి?

హోమియో కౌన్సెలింగ్

నా వయసు 42. నాకు కొంతకాలంగా ముక్కులో కండమాదిరిగా పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచు జలుబు చేయడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్‌గారిని సంప్రదిస్తే, శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని, అయినా మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉందని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందా? సలహా ఇవ్వగలరు. - ఎస్. పవన్ కుమార్, హైదరాబాద్
మీరు తెలిపిన వివరాలను బట్టి మీ సమస్య నేసల్ పాలిప్స్‌గా తెలుస్తోంది. ముక్కులో ఏర్పడే మృదువైన కండగలిగిన వాపును నేసల్ పాలిప్స్ అని అంటారు. ఇవి ముక్కు రెండు రంధ్రాలలో, సైనస్‌లలో ఏర్పడతాయి. ఏ వయస్సు వారైనా ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది. కానీ 40 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో, స్త్రీలలో కంటే పురుషులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.


సాధారణంగా ముక్కులోపలి భాగం, సైనస్‌లు (కపాల భాగంలో గాలితో నిండిన గదులు) ఒక విధమైన మృదువైన శ్లేష్మపు పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొర ఒక రకమైన పల్చని ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రవం ముక్కును సైనస్‌లను తేమగా ఉంచుతూ ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలో ప్రవేశించిన దుమ్మూ ధూళీ, ఇతర సూక్ష్మజీవులను చిన్న వెంట్రుకల లాంటి ఆకారాల సాయంతో గొంతులోకి, ముక్కులోకి చేరి తద్వారా బయటకు పంపేయడం జరుగుతుంది. ఇది సాధారణ ప్రక్రియ.


ఈ శ్లేష్మపు పొర దీర్ఘకాలికంగా శోధకు గురవడం వల్ల పాలిప్స్ ఏర్పడతాయి. ఇవి ఒకటి లేదా చిన్న చిన్న పరిమాణంలో గుంపులుగా ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన పాలిప్స్ క్రమంగా పెరిగి ముక్కు రంధ్రాలకు అడ్డుగా నిలుస్తాయి.

కారణాలు: తరచు ఇన్ఫెక్షన్స్‌కి గురికావడం, ఆస్త్మా, దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్లు, అలర్జిక్ రైనైటిస్, ఆస్ప్రిన్ వంటి మందులకు సున్నితత్వం కలిగి ఉండటం, వంశపారంపర్యత వంటివి.

 
లక్షణాలు: ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నోటిద్వారా శ్వాస తీసుకోవడం, రాత్రిళ్లు నిద్ర సరిగా పట్టకపోవడం, గురక, వాసన, రుచిని గుర్తించే శక్తి మందగించటం, తలనొప్పి, ముఖం లేదా నుదురు భాగంలో నొప్పిగా ఉండటం, కళ్లలో దురద వంటివి.

హోమియోకేర్ చికిత్స: అధునాతనమైన జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా అసమతుల్యతకు గురయిన రోగనిరోధక శక్తిని సరిచేయడం వల్ల నాజల్ పాలిప్స్ సమస్య పూర్తిగా న యం అవుతుంది. అన్ని ప్రతికూల పరిస్థితులలో సైతం ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించేలా హోమియోలో వైద్యచికిత్స లభిస్తుంది.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్  సీఎండి.
హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్

 

హైబీపీ సమస్యా... ఇలా అధిగమించవచ్చు!
బీపీ కౌన్సెలింగ్


నాకు ఇటీవల బీపీ ఉన్నట్లు తెలిసింది. ఎలా నియంత్రించుకోవచ్చు? - ఉమామహేశ్వరరావు, విజయవాడ
రక్తనాళాల్లో పీడనం ఉండాల్సిన దానికంటే ఎక్కువ కావడాన్ని హైపర్‌టెన్షన్ అంటారు. దీనివల్ల సాధారణ రక్తప్రసరణపై ప్రభావం పడుతుంది. రక్తపీడనాన్ని సిస్టోలిక్, డయాస్టోలిక్ ప్రెషర్స్ అని కొలుస్తారు. సాధారణంగా సిస్టోలిక్ ప్రెషర్ 100-140 మి.మీ/హెచ్‌జీ ఉంటుంది. అదే డయాస్టోలిక్ ప్రెషర్ 60-90 మి.మీ/హెచ్‌జీ ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైబీపీగా వ్యవహరిస్తారు.

కారణాలు:  సాధారణంగా హైపర్‌టెన్షన్‌కి జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. కుటుంబంలో బీపీ ఉంటే ఆ తర్వాతి తరానికీ వచ్చే అవకాశం ఎక్కువ. 20 - 60 శాతం హైపర్‌టెన్షన్ వంశపారంపర్యంగా వస్తాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి  వయసు పెరుగుతున్న కొద్దీ బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా స్త్రీలలో బీపీ తక్కువగా ఉంటుంది. మధ్య వయసుకు వచ్చేసరికి స్త్రీ, పురుషులిద్దరిలోనూ బీపీ సమానంగా ఉంటుంది. ఆ తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో బీపీ ఎక్కువగా ఉంటుంది  బరువు పెరిగితే హైపర్‌టెన్షన్ అవకాశమూ పెరుగుతుంది. పొత్తికడుపులో కొవ్వు ఎక్కువగా ఉన్న పురుషుల్లో 70 శాతం మంది, స్త్రీలలో 60 శాతం మంది అధిక రక్తపోటు బారిన పడుతున్నారు  రోజులో మూడు గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకునేవారిలో బీపీ వచ్చే అవకాశం తక్కువ  ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకున్నా హైపర్‌టెన్షన్ రావచ్చు  శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారిలో బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ  పొగతాగే అలవాటు బీపీని తీవ్రస్థాయిలో పెంచుతుంది  నడుము చుట్టుకొలత పురుషుల్లో 90 సెం.మీ కంటే ఎక్కువగానూ, స్త్రీలలో 80 సెం.మీ కంటే ఎక్కువగానూ ఉంటే బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ.


లక్షణాలు: బీపీ ఉన్నవారిలో సాధారణంగా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కానీ తలనొప్పి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో ఎక్కువ. నీరసంలాంటివి ఉండవచ్చు.

పర్యవసానాలు: గుండెజబ్బులకు ప్రధాన కారణం అధిక రక్తపోటే. హైపర్‌టెన్షన్ సమస్య దీర్ఘకాలంగా ఉంటే అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు కూడా దారితీస్తుంది. బీపీ లేనివాళ్ల కన్నా ఉన్నవాళ్లలో గుండెపోటు రావడానికి అవకాశం రెండింతలు ఎక్కువ. హార్ట్ ఫెయిల్యూర్ అవకాశం నాలుగింతలుంటుంది. పక్షవాతం వచ్చే అవకాశం ఏడింతలు ఉంటుంది.

రక్తపోటు నివారణ కోసం : హైపర్‌టెన్షన్ వల్ల వచ్చే సమస్యలు గురించి అవగాహన పెంచుకోవాలి. జీవనశైలిలో మార్పులు, వ్యాయామం, బరువు తగ్గడం, పొగతాగే అలవాటు మానేయడం, ఆల్కహాల్ తగ్గించడం, ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఆహార నియమాలు పాటించాలి.

మంచి ఆహారపు అలవాట్ల ద్వారా హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడాన్ని ‘డయటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అంటారు. దీని ప్రకారం ఆహారంలో తాజా కూరగాయాలు, పండ్లు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి. రోజుకి మూడు గ్రాముల కన్నా మించకుండా ఉప్పును చాలా పరిమితంగా తీసుకోవాలి.
డాక్టర్  అనుజ్ కపాడియా
సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,  హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement