మా పాపకు తొమ్మిదేళ్లు. తరచూ జలుబు చేస్తోంది. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.
హోమియో కౌన్సెలింగ్
మా పాపకు తొమ్మిదేళ్లు. తరచూ జలుబు చేస్తోంది. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేసి అడినాయిడ్స్ వాచాయని, వాటిని శస్త్రచికిత్స చేసి తొలగించాలని చెప్పారు. మాకు ఆందోళనగా ఉంది. పాపకు శస్త్రచికిత్స అవసరం లేకుండా హోమియో మందులతో నయమయ్యే అవకాశం ఉందా? – నందిని, నిడదవోలు
మన శరీర రోగనిరోధక వ్యవస్థలో భాగమైన అడినాయిడ్స్ చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్స్ కలిగించే బ్యాక్టీరియాను నశింపజేసి వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఈ అడినాయిడ్స్ ఐదేళ్ల వయసు దాటాక కుంచించుకుపోవడం మొదలవుతాయి. యుక్తవయసునకు చేరేసరికి ఇవి పూర్తిగా అదృశ్యమైపోతాయి. బ్యాక్టీరియాను నశింపజేసే ప్రక్రియలో ఒక్కోసారి అవి వాపునకు గురై మళ్లీ మామూలుగా మారతాయి. కానీ కొన్ని సందర్భాల్లో అవి కూడా ఇన్ఫెక్షన్‌కు గురికావడం వల్ల, వాచిపోయి శ్వాసద్వారాలకు అడ్డుగా నిలిచి శ్వాస తీసుకోవడం ఇబ్బందిని కలగజేస్తాయి. అడినాయిడ్స్ గురైన సందర్భాల్లో టాన్సిల్స్ కూడా వాచేందుకు అవకాశం ఉంది.
అడినాయిడ్స్ ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడు కనిపించే లక్షణాలు
∙ముక్కు మూసుకుపోయినట్లుగా ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. దాంతో నోటి దుర్వాసన, పెదవులు పగలడం, నోరు ఎండిపోయినట్లుగా అనిపించడం, ముక్కు దిబ్బడ ఏర్పడవచ్చు.
∙నిద్రంచే సమయంలో ప్రశాంతంగా లేకపోవడం, గురక వంటివి కనిపించవచ్చు.
∙గొంతు భాగంలోని గ్రంథుల వాపు, చెవి సమస్యలను గమనించవచ్చు.
చికిత్స: హోమియో విధానంలో జెనెటిక్ కాన్‌స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స అందించడం ద్వారా అడినాయిడ్స్ సమస్యను పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడం వల్ల శస్త్రచికిత్స అవసరం లేకుండానే సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్