Home Counseling
-
ఫైబ్రాయిడ్స్ మళ్లీ రాకుండా తగ్గించవచ్చా?
నా వయసు 44 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు: గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు మా అమ్మాయి వయసు 23 ఏళ్లు. హార్మోన్ లోపం వల్ల ఆమెకు నెలసరి సరిగా రావడం లేదు. ఆమె బరువు పెరుగుతోంది. హోమియోపతిలో సరైన చికిత్స చెప్పండి. మనిషి జీవించడానికి శ్వాస ఎంత ముఖ్యమో, ఆరోగ్యంగా ఉండటానికి హోర్మోన్లు అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండం ఏర్పడినప్పట్నుంచీ జీవితాంతం హార్మోన్లు తమ ప్రభావం కలిగి ఉంటాయి. మెదడులోని హైపోథెలామస్, పిట్యూటరీ గ్రంథులు శరీర కణాల క్రమబద్ధీకరణలో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ హార్మోన్లే శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితి, నిద్ర, దాహం, ఉద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఇవి రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి చాలా సూక్ష్మ మోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ శరీరంపై చాలా ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ మొదలుకొని, శరీరక, మానసిక ఎదుగుదల, మానసిక సమతౌల్యత వంటి అంశాలన్నింటికీ ఇవి తోడ్పడతాయి. హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతాన లేమి, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్ అసమతౌల్యత వల్ల వచ్చేవే. ఈ హార్మోన్ల సమతౌల్యత దెబ్బతిన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. థైరాయిడ్ హార్మోన్లయిన టీ3, టీ4... థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. వీటిలో అసమతౌల్యత ఏర్పడితే హైపోథైరాయిడిజమ్, హైపర్‌థైరాయిడిజమ్, గాయిటర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యత వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం, కీళ్లనొప్పులు కూడా వస్తాయి. నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమెలోని సమస్యను తెలుసుకోవాలి. అయితే మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే ఆమెకు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉండవచ్చని అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేస్తే ఆమెకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్ వంటి మంచిమందులే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఆమెను అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమెకు ఉన్న వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ నాకు ఇకనైనా సంతానం కలుగుతుందా? నా వయసు 33 ఏళ్లు. వివాహమై ఎనిమిదేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? దానికి కారణాలు ఏమిటి? హోమియోలో నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? ఇటీవల చాలా మందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు. స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు : ►జన్యుసంబంధిత లోపాలు ►థైరాయిడ్ సమస్యలు ►అండాశయంలో లోపాలు; నీటిబుడగలు ►గర్భాశయంలో సమస్యలు ►ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు ►డయాబెటిస్ ►గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు : ►హార్మోన్ సంబంధిత సమస్యలు ►థైరాయిడ్ ►పొగతాగడం ►శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం సంతానలేమిలో రకాలు : ►ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ ►సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ : అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. సెకండరీ ఇన్ఫెర్టిలిటీ: మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సంభవిస్తుంది. గుర్తించడం ఎలా : తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు. చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యను పరిష్కరించేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
పైల్స్ నయమవుతాయా?
నా వయసు 30 ఏళ్లు. నాకు గర్భధారణ సమయంలో పైల్స్ సమస్య మొదలైంది. ఎన్ని మందులు వాడినా తరచూ ఈ సమస్య వస్తూనే ఉంది. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నా సమస్య హోమియోతో నయమయ్యే అవకాశం ఉందా? దయచేసి సలహా ఇవ్వగలరు. గర్భధారణ సమయంలో కొన్ని హార్మోన్ల కారణంగా రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. దాంతో కొంతమంది మహిళల్లో పైల్స్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పైల్స్ సమస్యలో మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి, వాపు రావడం జరుగుతుంది. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కూడా అవుతాయి. కారణాలు : దీర్ఘకాలికంగా మలబద్దకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం, దీర్ఘకాలిక దగ్గు, గర్భధారణ సమయంలో కాలేయ సంబంధిత వ్యాధుల వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారణాలతో మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. వాటిలో రక్తం నిల్వ ఉండటం వల్ల మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తూ, రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం అవుతుంది. పైల్స్‌లో రకాలు ఉంటాయి. అవి... 1. ఇంటర్నల్ పైల్స్ 2. ఎక్స్టర్నల్ పైల్స్. మలద్వారం వద్ద ఏర్పడే సమస్యల్లో పైల్స్ మాత్రమే గాక ఫిషర్, ఫిస్టులా వంటి ఇతర సమస్యలను కూడా మనం గమనించవచ్చు. ఫిషర్స్ : మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఆ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల అది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన అనంతరం గానీ తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. రక్తస్రావం కూడా అవుతుంది. ఫిస్టులా : మలద్వారం వద్ద రెండు ఎపిథీలియల్ కణజాలాల మధ్య భాగంలో ఒక గొట్టం లాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. కానీ మలద్వారం వద్ద యానల్ ఫిషర్ ఏర్పడటం సర్వసాధారణం. మలద్వారం పక్కన ముందుగా చిన్న మొటిమలాగా ఏర్పడి నొప్పి, వాపుతో రెండు రోజులలో పగిలి చీమును వెలువరుస్తుంది. దీని తీవ్రతను బట్టి తరచూ తిరగబెడుతుంటుంది. సాధారణ జీవనానికి అడ్డంకిగా నిలుస్తూ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆపరేషన్ చేసినా, 90 శాతం మందిలో మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటుంది. చికిత్స : జెనెటిక్ కన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలను హోమియో వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చు. అంతేకాదు... మళ్లీ తిరగబెట్టకుండా సంపూర్ణమైన చికిత్స అందించవచ్చు. పేనుకొరుకుడుకు చికిత్స ఉందా? మా అమ్మాయి వయసు 27 ఏళ్లు. ఈమధ్య జుట్టులో ఒకేచోట వెంట్రుకలు రాలిపోతున్నాయి. అందరూ పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో పరిష్కారం చెప్పండి. పేనుకొరుకుడు సమస్యను వైద్యపరిభాషలో అలొపేషియా అంటారు. ఈ కండిషన్లో ఒక నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, నున్నగా మారుతుంది. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. అలాంటప్పుడు చాలాసార్లు తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగానీ ఇది రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య కనిపించదు. కారణాలు : ►మానసిక ఆందోళన ►థైరాయిడ్ సమస్య ►డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది ►వంశపారంపర్యంగా ∙కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు : ►తలపై మొత్తం జుట్టు ఊడిపోయి, బట్టతల లక్షణాలు కనిపిస్తాయి. ►తలపై అక్కడక్కడ గుండ్రంగా ప్యాచ్‌లలా జుట్టు ఊడిపోతుంది ►సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతితో ఈ ప్యాచ్‌లు ఉంటాయి. నిర్ధారణ : ఈ సమస్య నిర్దిష్టంగా ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్ పరీక్షలు, పిగ్మెంట్ ఇన్‌కాంటినెన్స్ వంటివే మరికొన్ని పరీక్షలు. చికిత్స : పేనుకొరుకుడు సమస్యకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు వ్యాధి కారణాలు, లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు. దీనికి హోమియోలో యాసిడ్ ఫ్లోర్, సల్ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలీనియమ్, సొరినమ్, తుజా వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మూత్రవిసర్జన సమయంలో మంట...తగ్గేదెలా? నా వయసు 36 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. డాక్టరుకు ఈ సమస్య చెప్పుకోడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి నా సమస్యకు హోమియోలో పరిష్కారం చెప్పండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్ :ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. లక్షణాలు :మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం వ్యాధినిర్ధారణ పరీక్షలు : యూరిన్ ఎగ్జామినేషన్, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ హోమియోపతి చికిత్స : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా, నిర్ణీతకాలం వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
అమ్మాయి ఎప్పుడూ నిరాశతోనే... చికిత్స చెప్పండి
మా అమ్మాయి వయసు 22 ఏళ్లు. ఆమె గత కొంతకాలంగా ఎప్పుడూ పరధ్యానంగానే ఉంటోంది. ఎవరితో సరిగా మాట్లాడదు. ఒకవేళ మాట్లాడినా ఆ మాటలెప్పుడూ నిరాశపూరితంగా ఉంటున్నాయి. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటోంది. ఆమె సమస్యకు ఏమైనా మందులున్నాయా? – డి. జయలక్ష్మి, భీమవరం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అమ్మాయి డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. డిప్రెషన్‌కు లోనైనవారు ఎప్పుడూ విచారం, నిస్సహాయత, అపరాధభావం, నిరాశలలో ఉంటారు. భావోద్వేగాలు మారుతుంటాయి. శారీరకంగానూ కొన్నిమార్పులు కనిపిస్తాయి. అకస్మాత్తుగా బరువు కోల్పోవడం లేదా పెరగడం, చికాకు పడుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు నిర్దిష్టంగా కొన్ని కాలాలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు పూర్తి డిప్రెషన్లోకి కూరుకుపోయేలోపే చికిత్స అందించడం మంచిది. హోమియో విధానంలో దీనికి మంచి చికిత్స ఉంది. డిప్రెషన్‌ను రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది వంశపారంపర్యంగా వచ్చేది. రెండోది న్యూరోటిక్ డిప్రెషన్. ఇవి... మన చుట్టూ ఉండే వాతావరణం, సంఘంలో అసమానతలు, ఉద్యోగం కోల్పోవడం, ఎవరైనా దగ్గరివాళ్లు దూరం కావడం లేదా చనిపోవడం, తీవ్రస్థాయి మానసిక వేదన... వంటి ఎన్నో అంశాల వల్ల రావచ్చు. వివిధ పరిశోధనల ద్వారా ఈ ఆధునిక కాలంలో దీన్ని డిప్రెసివ్ డిజార్డర్‌గా పేర్కొన్నారు. దీనిలో రకాలు : మేజర్ డిప్రెషన్ : ఇందులో డిప్రెషన్ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, పనిలో శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డిస్థిమిక్ డిజార్డర్ : రోగి తక్కువస్థాయి డిప్రెషన్లో దీర్ఘకాలం పాటు ఉంటాడు. అయితే కొన్నిసార్లు రోగి నార్మల్‌గా ఉన్నట్లుగా అనిపించి, తిరిగి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. ∙సైకియాట్రిక్ డిప్రెషన్ : డిప్రెషన్‌తో పాటు భ్రాంతులు కూడా కనిపిస్తుంటాయి. ∙పోస్ట్ నేటల్ డిప్రెషన్ : మహిళల్లో ప్రసవం తర్వాత దీని లక్షణాలు కనిపిస్తుంటాయి. సీజనల్ ఎఫెక్టివ్ డిప్రెషన్ : సూర్యరశ్మి తగ్గడం వల్ల కొంతమందిలో సీజనల్‌గా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తుంటుంది. బైపోలార్ డిజార్డర్ : ఈ డిప్రెషన్లో కొంతమంది పిచ్చిగా, కోపంగా, విపరీతమైన ప్రవర్తనను కనబరుస్తుంటారు. కొంత ఉద్రేకం తర్వాత నార్మల్ అయిపోతారు. హోమియో వైద్యవిధానంలో నేట్రమ్మూర్, ఆరమ్‌మెట్, సెపియా, ఆర్సినిక్ ఆల్బ్, సిమిసిఫ్యూగో వంటి మందులు డిప్రెషన్ తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మెడనొప్పి చేతుల వరకూ పాకుతోంది... పరిష్కారం చెప్పండి నా వయసు 52 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. అది చేతుల వరకూ పాకుతోంది. చేతులు... ముఖ్యంగా చేతివేళ్లు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియోతో నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? – ఎల్. జగన్నాథరావు, నెమ్మికల్ మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు : ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు : ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ∙నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. హోమియో చికిత్స : జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ బాబుకు ఆటిజమ్... అది తగ్గుతుందా? మా బాబుకు మూడేళ్లు. వయసుకు తగినట్లుగా ఎదుగుదలగానీ, వికాసం గానీ కనిపించలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆటిజమ్ అంటున్నారు. హోమియోలో చికిత్స సాధ్యమేనా? – ఆర్. సీతాలక్ష్మి, అనకాపల్లి ఆటిజమ్ అనే రుగ్మత ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీని తీవ్రతలో చాలా తేడాలతో పాటు, ఎన్నో లక్షణాలు, వాటిల్లో తేడాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటిజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడుతుండవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ’ అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ’ నలుగురిలో కలవడలేకపోవడం ’ ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ’ వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు నార్మల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
గౌట్ సమస్యకు పరిష్కారం ఉందా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 36 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. అక్కడ విపరీతమైన సలపరంతో నొప్పి ఉంది. డాక్టర్‌గారు గౌట్ అని చెప్పారు. మందులు వాడినా సమస్య తగ్గలేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఆర్. కోటయ్య, నరసరావుపేట గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు. కారణాలు: ∙సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు: ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ/జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ పొద్దున్నే మడమల్లో నొప్పి...తగ్గేదెలా? నా వయసు 34 ఏళ్లు. పొద్దున లేవగానే నడుస్తుంటే మడమలలో విపరీతమైన నొప్పి వస్తోంది. ఏదైనా సపోర్ట్ తీసుకొనే నడవాల్సి వస్తోంది. ఈ బాధ భరించలేకపోతున్నాను. హోమియో పరిష్కారం చెప్పండి. – మంజరి, సికింద్రాబాద్ అరికాలులో ఉండే ప్లాంటార్ ఫేషియా అనే లిగమెంటు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అది తన సాగే గుణాన్ని కోల్పోయి తాడులా మారుతుంది. నిజానికి ఇది ఫ్లాట్‌పాడ్‌లా ఉండి కాలికి షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. వయసు పెరిగి, ఇది సన్నగా మారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. దాంతో నడకతో కలిగే షాక్స్‌ను తట్టుకోలేక ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అవుతుంది. ఫలితంగా అరికాలిలో నొప్పి వస్తుంది. దాంతో పాటు మడమ నొప్పి, వాపు కూడా కనిపిస్తుంది. ఉదయం పూట మొట్టమొదట నిల్చున్నప్పుడు మడమలో నొప్పి కలుగుతుంది. ఇలా ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అయి వచ్చే నొప్పిని ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అంటారు. ఇది పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా నొప్పిని కలగజేస్తుంది. కారణాలు: ∙డయాబెటిస్ ∙ఊబకాయం, ఉండాల్సినదాని కంటే ఎక్కువగా బరువు ఉండటం ∙ఎక్కువ సేపు నిలబడటం, పనిచేయడం ∙తక్కువ సమయంలో చురుకుగా పనిచేయడం ∙ఎక్కువగా హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో) లక్షణాలు: ∙మడమలో పొడినట్లుగా నొప్పి ∙ప్రధానంగా ఉదయం లేవగానే కాలిని నేలకు ఆనించినప్పుడు నొప్పి కనిపించడం ∙కండరాల నొప్పులు చికిత్స: మడమనొప్పికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. మడమనొప్పికి హోమియోలో పల్సటిల్లా, రొడొడెండ్రాన్, కాల్కేరియా ఫ్లోర్, రస్టాక్స్, అమోనియమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి వాటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. మీరు వెంటనే అనుభవజ్ఞులైన డాక్టర్‌ను సంప్రదించి, మీ లక్షణాలన్నీ తెలిపి, తగిన మందులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్ బాధిస్తోంది! నా వయసు 68 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. హోమియోలో ఆపరేషన్ లేకుండా దీనికి చికిత్స ఉందా? – ఎమ్. రత్తయ్య, అనకాపల్లి మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు: ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
హోమియో కౌన్సెలింగ్స్
ప్రెగ్నెన్సీ టైమ్‌లో పైల్స్... తగ్గేదెలా? నా వయసు 27 ఏళ్లు. నాకు గర్భధారణ సమయంలో పైల్స్ సమస్య మొదలైంది. ఎన్ని మందులు వాడినా సమస్య తరచూ వస్తూనే ఉంది. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. దయచేసి నా సమస్య హోమియోతో నయమయ్యే అవకాశం ఉందా? సలహా ఇవ్వగలరు. – ఒక సోదరి, రాజమండ్రి గర్భధారణ సమయంలో కొన్ని హార్మోన్ల కారణంగా రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. దాంతో కొంతమంది మహిళల్లో పైల్స్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పైల్స్ సమస్యలో మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి, వాపు రావడం జరుగుతుంది. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కూడా అవుతాయి. కారణాలు: దీర్ఘకాలికంగా మలబద్దకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం, దీర్ఘకాలిక దగ్గు, గర్భధారణ సమయంలో కాలేయ సంబంధిత వ్యాధుల వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారణాలతో మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. వాటిలో రక్తం నిల్వ ఉండటం వల్ల మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గరి ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తూ, రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం అవుతుంది. పైల్స్‌లో రకాలు ఉంటాయి. అవి... 1. ఇంటర్నల్ పైల్స్ 2. ఎక్స్టర్నల్ పైల్స్. మలద్వారం వద్ద ఏర్పడే సమస్యల్లో పైల్స్ మాత్రమే గాక ఫిషర్, ఫిస్టులా వంటి ఇతర సమస్యలను కూడా మనం గమనించవచ్చు. ఫిషర్స్: మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఆ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల అది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన అనంతరం గానీ తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. రక్తస్రావం కూడా అవుతుంది. ఫిస్టులా: మలద్వారం వద్ద రెండు ఎపిథీలియల్ కణజాలాల మధ్య భాగంలో ఒక గొట్టం లాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. కానీ మలద్వారం వద్ద యానల్ ఫిషర్ ఏర్పడటం చాలా సాధారణం. మలద్వారం పక్కన చిన్న మొటిమలాగా ఏర్పడి నొప్పి, వాపుతో రెండు రోజులలో పగిలి చీమును వెలువరుస్తుంది. ఆపరేషన్ చేసినా 90 శాతం మందిలో మళ్లీ వస్తుంది. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలను హోమియో వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చు. మళ్లీ తిరగబెట్టకుండా సంపూర్ణమైన చికిత్స అందించవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నెలసరి సరిగా లేదు... చికిత్స చెప్పండి మా అమ్మాయి వయసు 23 ఏళ్లు. హార్మోన్ లోపం వల్ల ఆమెకు నెలసరి సరిగా రావడం లేదు. ఆమె బరువు పెరుగుతోంది. హోమియోపతిలో సరైన చికిత్స చెప్పండి. – ఎల్. సుమతీదేవి, ఖమ్మం మనిషి జీవించడానికి శ్వాస ఎంత ముఖ్యమో, ఆరోగ్యంగా ఉండటానికి హోర్మోన్లు అంతే ముఖ్యం. శిశువు పిండంగా ఉన్నప్పుడు మొదలుకొని, వారి జీవితాంతం హార్మోన్లు తమ ప్రభావం కలిగి ఉంటాయి. మెదడులోని హైపోథెలామస్, పిట్యూటరీ గ్రంథులు శరీర కణాల క్రమబద్ధీకరణలో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ హార్మోన్లే శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితి, నిద్ర, దాహం, ఉద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఇవి రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి చాలా సూక్ష్మమోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ శరీరంపై చాలా ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ మొదలుకొని, శరీరక, మానసిక ఎదుగుదల, మానసిక సమతౌల్యత వంటి అంశాలన్నింటికీ ఇవి తోడ్పడతాయి. హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతాన లేమి, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్ అసమతౌల్యత వల్ల వచ్చేవే. థైరాయిడ్ హార్మోన్లయిన టీ3, టీ4... థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. వీటిలో అసమతౌల్యత ఏర్పడితే హైపోథైరాయిడిజమ్, హైపర్‌థైరాయిడిజమ్, గాయిటర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యత వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసౌమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమె సమస్యను తెలుసుకోవాలి. మీరు చెబుతున్న లక్షణాల ప్రకారం థైరాయిడ్ సమస్య కావచ్చు. దీన్ని నిర్ధారణ చేస్తే ఆమెకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్ వంటి మంచి మందులే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఆమెను అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమెకు ఉన్న వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ చర్మంపై పొలుసుల్లాగా రాలుతున్నాయి..? నా వయసు 37 ఏళ్లు. ఐదు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతో మంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా? – డి. సుబ్బారావు, అనకాపల్లి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, అవి పొలుసులుగా ఊడిపోతోంది. సోరియాసిస్ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసువారికైనా రావచ్చు. లక్షణాలు: ♦ చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది ♦ కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి ♦ తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది. కారణాలు: వంశపారంపర్యం; అధిక ఒత్తిడి; ఆటోఇమ్యూన్ డిజార్డర్లు సోరియాసిస్‌కు ప్రధాన కారణాలు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగాలేకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవలి వ్యాధి ట్రెండ్: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. చికిత్స: ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్ సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో ప్రక్రియలో పూర్తిగా సాధ్యమవుతుంది. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
తడిపే అలవాటు తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ మా బాబు వయసు 13 ఏళ్లు. చిన్నప్పటి నుంచి రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటు ఉంది. ఈ సమస్య వల్ల బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించే అవకాశం ఉందా? - సునీత, కందుకూరు పెద్దపిల్లలు రాత్రుళ్లు నిద్రలో పక్క తడిపే అలవాటును వైద్య పరిభాషలో నాక్చర్నల్ ఎన్యురెసిస్ అంటారు. ఈ సమస్యతో బాధపడే పిల్లలు, వారి తల్లిదండ్రులు చాలా ఆదుర్దాతో ఉంటారు. సాధారణంగా పిల్లల్లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనపై అదుపు అన్నది రెండు నుంచి ఐదేళ్ల వయసులో వస్తుంటుంది. కానీ ఐదు శాతం మంది పిల్లల్లో పదేళ్ల వయసు తర్వాత కూడా మూత్రవిసర్జనపై అదుపు రాకపోవచ్చు. ఐదేళ్ల వయసు తర్వాత కూడా తరచూ పక్కతడిపే అలవాటు ఉండటాన్ని ప్రైమరీ ఎన్యురెసిస్ అంటారు. సాధారణంగా ఇది కొన్నాళ్లలోనే తగ్గిపోతుంది. ఎదుగుదల సమయంలో వచ్చే లోపం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. అయితే కొంతమంది పిల్లలు పక్కతడపడం మానివేశాక, మళ్లీ ఆర్నెల్ల తర్వాత సమస్య తిరగబెట్టవచ్చు. ఇంతకుముందు పక్కతపడపకుండా ప్రస్తుతం మళ్లీ పక్కతడపడం మొదలుపెట్టినట్లయితే దాన్ని ‘సెకండరీ ఎన్యురెసిస్’ అంటారు. కారణాలు : నాడీ వ్యవస్థ ఎదుగుదల లోపాలు, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు, మూత్రాశయం సమస్యలు, కొందరిలో వంశపారంపర్య కారణాల వల్ల ఈ సమస్య కనిపిస్తుండవచ్చు. ఇంకొంతమంది పిల్లల్లో కండరాలు ఎక్కువ సార్లు అనియంత్రితంగా సంకోచం చెందడం వంటి కారణాలతోనూ ఈ సమస్య కనిపించవచ్చు. టైప్–1 డయాబెటిస్, మలబద్దకం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడటం వల్ల, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమంది పిల్లల్లో మానసిక ఒత్తిడి, భయం వల్ల కూడా రాత్రివేళలో తమకు తెలియకుండానే మూత్రవిసర్జన జరిగిపోవచ్చు. పక్క తడిపే పిల్లలను తిట్టడం, వాళ్లకు శిక్షలు విధించడం వల్ల పిల్లలు మరింత కుంగిపోయి సమస్య మరింత జటిలం అవుతుంది. ఇలా పిల్లలను మందలించడం వల్ల ప్రయోజనం చేకూరదు సరికదా... కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే హోమియో చికిత్సతో పిల్లల్లో ఈ అలవాటు పూర్తిగా మాన్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
యానల్ ఫిషర్ అంటే...
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 68 ఏళ్లు. నేను మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పారు. ఆపరేషన్ అవసరమన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. హోమియోలో దీనికి చికిత్స ఉందా? – సంపత్‌కుమార్, నిడదవోలు మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు: ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం – అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. వ్యాధి నిర్ధారణ: సీబీపీ, ఈఎస్ఆర్, ఎమ్మారై, సీటీస్కాన్ చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. ఏ సైడ్ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేయడం హోమియో విధానం ప్రత్యేకత. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ ఆ గడ్డలు తగ్గుతాయి... హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 36 ఏళ్లు. నా ఒంటిపై మాటిమాటికీ బొబ్బల్లా వస్తున్నాయి. ఒక వారం రోజుల పాటు జ్వరం వస్తోంది. ఆ బొబ్బలు నొప్పి కలిగిస్తూ, ఆ తర్వాత గట్టిగా మారి, పగులుతున్నాయి. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? రమ్య, హైదరాబాద్ చర్మం కింద ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే చీముతో నిండిన బొబ్బలను ఆబ్సెస్ / బాయిల్స్ (గడ్డలు / దిమ్మెలు) అంటారు. కురుపులు / గడ్డలు అని కూడా పిలిచే ఈ ఆబ్సెస్ సాధారణంగా బ్యాక్టీరియా / పరాన్నజీవులు లేదా ఇంజెక్షన్ ద్వారా కూడా వస్తుంటాయి. పొగతాగే అలవాటు లేదా ఊబకాయం ఉన్నవారిలో ఇవి సర్వసాధారణం. చర్మం కింద ఉండే సన్నటి పొరలో వ్యాపిస్తాయి. ఇవి ఎగుడుదిగుడుగా ఉండి చీముతో నిండి ఎరుపు / పసుపు / తెలుపు రంగులో చిన్న బంతి లేదా బఠాణీ ఆకృతితో ఉంటాయి. చాలా నొప్పి కలిగిస్తుంటాయి. ఇవి రావడానికి కారణాలు: ∙రోగ నిరోధక శక్తి లోపించడం ∙అపరిశుభ్రమైన ఆహారం తినడం ∙సూక్ష్మజీవులు లేదా పరాన్న జీవుల ఇన్ఫెక్షన్ వల్ల ∙ఈ వ్యాధి సోకిన వారితో సన్నిహితంగా ఉండటం వల్ల లక్షణాలు: ∙చర్మంపై బొబ్బలు / గడ్డలు / గాయాలు ∙వికారం ∙చర్మం ఎరుపు రంగులోకి మారడం ∙గడ్డను తాకితే తీవ్రమైన నొప్పి ∙చీము స్రవించడం ∙వాపు చికిత్స: ఆబ్సెస్ / బాయిల్స్కి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను, శరీరతత్వాన్ని విశ్లేషించి వైద్యులు తగిన మందును సూచిస్తారు. ఈ సమస్యకు హోమియోలో కాల్కేరియా, హెపార్ సల్ఫ్, ఇక్తియోలమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ బిగుసుకునే కండరాలు.. తీవ్రమైన నొప్పి వాస్క్యులార్ కౌన్సెలింగ్ నా వయసు 39 ఏళ్లు. లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. రోజూ కాలేజీకి వెళ్లడం కోసం మూడు గంటల జర్నీ చేస్తుంటాను. గత నాలుగైదు వారాల నుంచి హఠాత్తుగా కాలి పిక్కల కండరాలు బిగుసుకుపోతున్నాయి. తీవ్రమైన నొప్పి వస్తోంది. ఒక్కోసారి క్లాస్‌లో ఇలా జరిగితే భరించలేని బాధతో కళ్లనుంచి నీళ్లు రాలుతుంటాయి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? పరిష్కారం చెప్పండి. - సరళకుమారి, హైదరాబాద్ మీరు ఎదుర్కొంటున్న సమస్యను ఇంగ్లిష్‌లో ‘మజిల్క్రాంప్స్’గా పేర్కొనవచ్చు. రోజూ గంటల తరబడి బస్సులో కూర్చోవడం, ఆపైన క్లాస్‌లో చాలా సేపు నిలబడటం వంటి అంశాలు మీ కండరాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. నిద్ర పోయే సమయంలో విశ్రాంతి చేకూరడం వల్ల కండరాలు కోలుకొని సాధారణ స్థితికి చేరుకుంటాయి. అయితే మీకు అవసరమైనంత నిద్ర లేకపోవడం, ఆహారంలో పోషకాలు లోపించడం వంటి పరిస్థితుల్లో కండరం కోలుకోవడం జరగదు. అప్పుడు కండరాల తీవ్రంగా అలసిపోయి మీ అనుభవంలోకి వస్తున్నట్లుగా బిగుసుకుపోతాయి. ఇలా జరిగినప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అకస్మాత్తుగా జరిగే ఈ కండరసంకోచం నొప్పి విపరీతంగా ఉంటూ రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. కండరాలు ఒక్కసారిగా గుంజుకుపోయినట్లుగా జరగడం ఎప్పుడైనా జరగవచ్చు గానీ చాలా సందర్భాల్లో నిద్రపోయినప్పుడు కండరాలు బిగుసుకుపోతే ఆ నొప్పితో వెంటనే మేల్కొంటారు. ఇలా కాలికండరాలు అకస్మాత్తుగా మన ప్రమేయం లేకుండా బిగుసుకుపోవడాన్ని ‘మజిల్ క్రాంప్స్’ / ‘చెర్లీ హార్స్’ అంటారు. మన వృత్తి, వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. మెలకువగా ఉన్నప్పుడు, నిద్రలో, వ్యాయామం చేస్తున్నప్పుడు.. ఎప్పుడైనా ఇలా జరగవచ్చు. బిగుసుకుపోయిన కండరాలు మామూలుకంటే గట్టివిగా ఉండటమే కాకుండా కొన్నిసార్లు వడితిరిగి కనిపిస్తాయి. విపరీతమైన అలసట, డీహైడ్రేషన్, కొన్ని మందులు వాడకం వంటి కారణాలతో మజిల్ క్రాంప్స్ రావచ్చు. కండరాలు తీవ్రంగా అలసిపోవడం, వ్యాయామానికి ముందు తగినంతగా స్ట్రెచ్ చేయకపోవడం, రక్తంలో ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, ఫాస్ఫేట్) పరిమాణం తగ్గిపోవడం ఇందుకు దారితీస్తాయి. ఒక్కోసారి పైన పేర్కొన్న వాటిలో ఒకటి కంటే ఎక్కువ అంశాలు మజిల్క్రాంప్స్కు దారితీస్తాయి. మంచి పోషకాహారం, కంటి నిండా నిద్ర, వ్యాయామం ప్రారంభించడానికి ముందు స్ట్రెచింగ్ వంటి జాగ్రత్తలతో మజిల్ క్రాంప్స్‌ను నివారించవచ్చు. అయినప్పటికీ మజిల్ క్రాంప్స్ వస్తుంటే వెంటనే డాక్టర్‌కు చూపించుకోవాలి. డాక్టర్ దేవేందర్ సింగ్, సీనియర్ వాస్క్యులార్ అండ్ ఎండోవాస్క్యులార్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
సెబోరిక్ డర్మటైటిస్ అంటే..?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 45 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్ డర్మటైటిస్ అని చెప్పారు. మందులు వాడినప్పుడు సమస్య తగ్గినట్లే అనిపిస్తోంది కానీ వెంటనే మళ్లీ తిరగబెడుతోంది. ఈ సమస్య అసలెందుకు వస్తోంది? హోమియో మందులతో పూర్తిగా నయమవుతుందా? సలహా ఇవ్వండి. – దయాకర్‌రావు, నల్గొండ సెబోరిక్ డర్మటైటిస్ అనేది తరచూ తిరగ బెడుతూ బాధపెడుతుండే వ్యాధి. చర్మంలో సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడం, దురద వంటి లక్షణాలు ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇది దీర్ఘకాలిక సమస్య. చాలా ఎక్కువ మందిని వేధించే సమస్య ఇది. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది. కారణాలు: ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది ∙రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ ∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ వాతావరణం, హార్మోన్ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు. లక్షణాలు: ∙సెబోరిక్ డర్మటైటిస్ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి. ∙చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది. ఈ వ్యాధి గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆధునిక జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని సరిచేయడం వల్ల సెబోరిక్ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్, సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ వానలో తడిస్తే... ఒంటిపై దద్దుర్లు! హోమియో కౌన్సెలింగ్స్ ఇటీవలి వర్షాల్లో చాలాసార్లు తడిసిపోయాను. ఆ తర్వాత చర్మం దురదగా ఉండి కురుపులు, దద్దుర్లు వస్తున్నాయి. ఒక్కోసారి ఆ కురుపులకు చీము కూడా పడుతోంది. దీనికి హోమియోలో చికిత్స ఉందా? – శ్రీనివాస్, నిజామాబాద్ వేసవి వెళ్లి వానాకాలం రాగానే వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులను చూస్తాం. ఒక్కోరోజు ఎండకాస్తుండగానే... వర్షం పడుతుంది. అలా వెంటవెంటనే వచ్చే వాతావరణ మార్పులకు, ఉష్ణోగ్రతల్లో తేడాలకు మన శరీరం తట్టుకోలేదు. పైగా వానలో తడవడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ కాలంలో బ్యాక్టీరియా, ఫంగస్, ఈస్ట్‌లు ఎక్కువగా ఇన్ఫెక్షన్లను కలగజేస్తాయి. ఇక దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ఇన్ఫెక్షన్లూ ఈ సీజన్లో ఎక్కువే. ఇలాంటి ఇన్ఫెక్షన్లను పిల్లలు, వృద్ధులు తట్టుకోలేరు. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకం. ఇక మీ సమస్య విషయానికి వస్తే వాతావరణంలోని రసాయనాలు వాన నీటితో కలిసి ఒంటిని తడిపేస్తే వాటి దుష్ప్రభావం వల్ల చర్మం పాడయ్యే అవకాశం ఉంది. తడి చర్మంపై ఇన్ఫెక్షన్లు రావడానికి, పాకడానికి అవకాశాలున్నాయి. ఈ వర్షాకాలంలో వెంట్రుకలు, కుదుళ్లు, చర్మం, గోళ్లు, ప్రైవేట్ పార్ట్స్... ఇలా అన్ని చోట్లా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. కాళ్ల వేళ్ల మధ్య, గజ్జల్లో ఈ ఇన్ఫెక్షన్లు ఈ తరహా ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. వానాకాలంలో చర్మం మీద ఎగ్జిమా అనే చర్మ సమస్య చాలా సాధారణం. పెద్దలతో పోలిస్తే పిల్లలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. ఇక పొలం పనులు చేసే రైతులు, కూలీల్లోనూ ఇది ఎక్కువ. అలాగే నీళ్లలో ఎక్కువగా పనిచేసేవారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలోనూ ఈ తరహా ఇన్ఫెక్షన్లు చాలా సాధారణం. అలాగే చమట ఎక్కువగా పట్టే శరీర తత్వం ఉన్నవారు అదేపనిగా చాలాసేపు బూట్లు వేసుకుంటే కూడా ఈ సమస్య వస్తుంది. వాతావరణ మార్పులు, పూల పుప్పొడి, తేమ వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. చర్మం శుభ్రంగా ఉంచుకోవడం, కొన్ని రకాల రసాయనాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో దీన్ని నివారించుకోవచ్చు. లక్షణాలు: ∙దురద, మంట ∙చర్మం పొట్టులా రాలడం, రంగుమారడం ∙పాదాలు చమటతో తడిసిపోవడం ∙చర్మంపై పగుళ్లు, నీటి పొక్కుల వంటివి కనిపించడం. వ్యాధి నిర్ధారణ : బయటకు కనిపించే లక్షణాలతో పాటు కొన్ని రక్తపరీక్షలు చికిత్స: వర్షాకాలం వచ్చే ఇన్ఫెక్షన్లకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వానాకాలం సమస్యలకు హోమియోలో రస్టాక్స్, ఆర్స్ ఆల్బ్, సెపియా, మెర్క్‌సాల్, కాల్కేరియా కార్బ్, వంటి మందులు వాడాల్సి ఉంటుంది. అయితే రోగి లక్షణాలు, ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్లు ఈ మందులను సూచిస్తుంటారు. వాటిని అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
అడినాయిడ్స్ వాపు ఎందుకు?
హోమియో కౌన్సెలింగ్ మా పాపకు తొమ్మిదేళ్లు. తరచూ జలుబు చేస్తోంది. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేసి అడినాయిడ్స్ వాచాయని, వాటిని శస్త్రచికిత్స చేసి తొలగించాలని చెప్పారు. మాకు ఆందోళనగా ఉంది. పాపకు శస్త్రచికిత్స అవసరం లేకుండా హోమియో మందులతో నయమయ్యే అవకాశం ఉందా? – నందిని, నిడదవోలు మన శరీర రోగనిరోధక వ్యవస్థలో భాగమైన అడినాయిడ్స్ చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్స్ కలిగించే బ్యాక్టీరియాను నశింపజేసి వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఈ అడినాయిడ్స్ ఐదేళ్ల వయసు దాటాక కుంచించుకుపోవడం మొదలవుతాయి. యుక్తవయసునకు చేరేసరికి ఇవి పూర్తిగా అదృశ్యమైపోతాయి. బ్యాక్టీరియాను నశింపజేసే ప్రక్రియలో ఒక్కోసారి అవి వాపునకు గురై మళ్లీ మామూలుగా మారతాయి. కానీ కొన్ని సందర్భాల్లో అవి కూడా ఇన్ఫెక్షన్కు గురికావడం వల్ల, వాచిపోయి శ్వాసద్వారాలకు అడ్డుగా నిలిచి శ్వాస తీసుకోవడం ఇబ్బందిని కలగజేస్తాయి. అడినాయిడ్స్ గురైన సందర్భాల్లో టాన్సిల్స్ కూడా వాచేందుకు అవకాశం ఉంది. అడినాయిడ్స్ ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు కనిపించే లక్షణాలు ∙ముక్కు మూసుకుపోయినట్లుగా ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. దాంతో నోటి దుర్వాసన, పెదవులు పగలడం, నోరు ఎండిపోయినట్లుగా అనిపించడం, ముక్కు దిబ్బడ ఏర్పడవచ్చు. ∙నిద్రంచే సమయంలో ప్రశాంతంగా లేకపోవడం, గురక వంటివి కనిపించవచ్చు. ∙గొంతు భాగంలోని గ్రంథుల వాపు, చెవి సమస్యలను గమనించవచ్చు. చికిత్స: హోమియో విధానంలో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స అందించడం ద్వారా అడినాయిడ్స్ సమస్యను పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడం వల్ల శస్త్రచికిత్స అవసరం లేకుండానే సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
వాన జబ్బులకు చికిత్స సాధ్యమే!
హోమియో కౌన్సెలింగ్ వాన జబ్బులకు చికిత్స సాధ్యమే! వర్షాకాలం వచ్చిందంటే మనసుకు బాగా ఉంటుంది. కానీ శారీరకంగా అనేక సమస్యలు వస్తున్నాయి. జలుబు, దగ్గు, ఆస్తమా వదలడం లేదు. బయటకు వెళ్లాలంటేనే ఆందోళనగా ఉంటుంది. వర్షాకాలం, చలికాలం ఈ బాధలు భరించాల్సిందేనా? – వేణు, ఒంగోలు వర్షాకాలం పచ్చదనాన్ని, చల్లటి వాతావరణాన్ని తెచ్చి వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే ఈ కాలం పలు రకాల వ్యాధులనూ ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా, ఇంటి కీటకాలు, ఫంగస్ పెరుగుదలకు వర్షాకాలం అనువుగా ఉంటుంది. ఈ సీజన్లో ఆస్తమా, అలర్జీ, బ్రాంకైటిస్, ఫ్లూ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అలర్జిక్ రైనైటిస్ : వరస తుమ్ములతో ముక్కు కారడం, కళ్లు–ముక్కు దురదగా ఉండటం కనిపిస్తుంది. అలర్జీ : సాధారణంగా జలుబు లక్షణాలు నిర్ణీత కాలానికి మించి కొనసాగుతూ ఉంటే దాన్ని అలర్జీగా పరిగణించవచ్చు. అయితే కొందరిలో పొగ, దుమ్ము, ధూళి, కాలుష్యాల వంటివి అలర్జీని ప్రేరేపిస్తాయి. అప్పుడు సాధారణ జలుబు సమయంలో కనిపించే లక్షణాలు కనిపిస్తాయి. ఆస్తమా : ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది ఊపిరితిత్తుల్లోని వాయునాళాల్లో వచ్చే సమస్య. ఇది తేమ వాతావరణంలో ఉండే పుప్పొడి వంటి అలర్జెన్ల కారణంగా వస్తుంది. ఇది వచ్చిన వారిలో పిల్లికూతలు, ఛాతీ పట్టేయడం, రాత్రిపూట దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు : పై సమస్యలు ఉన్నవారు చాలాకాలంగా లోపల దాచి ఉంచిన ఉన్ని దుస్తులు ధరించే ముందు కాసేపు ఎండలో ఉంచాలి. చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. కూల్‌డ్రింక్స్, చల్లటి పానీయాలు తీసుకోకూడదు. తమ సమస్యను ప్రేరేపించే అంశాల నుంచి దూరంగా ఉండాలి. చికిత్స : అలర్జిక్ రైనైటిస్, అలర్జీలు, ఆస్తమా వంటివి వచ్చిన వారికి ఎప్పటికీ తగ్గదని చాలామంది అనుకుంటుంటారు. అయితే అది నిజం కాదు. జీవనశైలిని మార్చుకొని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, హోమియోలో ఆర్సినిక్ ఆల్బ్, ఇపికాక్, నేట్రమ్సల్ఫ్, కాలీ కార్బ్, స్పంజియా వంటి మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడితే పైన పేర్కొన్న అన్ని సమస్యలనూ శాశ్వతంగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఇంత చిన్న వయసులో డయాబెటిసా? హోమియో కౌన్సెలింగ్ మా అబ్బాయికి 12 ఏళ్లు. టైప్–1 డయాబెటిస్ అంటున్నారు. ఇంత చిన్న వయసులో డయాబెటిస్ వస్తుందా? దీని గురించి వివరించి, మావాడు పాటించాల్సిన ఆహార నియమాలు వివరించండి.– సుకుమార్, రాజమండ్రి 15 ఏళ్ల లోపు వారిలో వచ్చే చక్కెరవ్యాధిని టైప్–1 డయాబెటిస్ అంటారు. టైప్–1 డయాబెటిస్ అంటే క్లోమగ్రంథి పనిచేయదు. వీరికి వైద్యం ఇన్సులిన్ మాత్రలతో ఆరంభించి, ఇంజెక్షన్లు ఇస్తుంటారు. ఆహారనియమాలు :పిల్లల్లో ఎలాంటి ఆహార నియమాలు వద్దు. ∙లావుగా ఉంటేనే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. జంక్‌ఫుడ్ తగ్గించుకోవాలి. ఇన్సులిన్ నిరోధకత రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచుతుంది కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించుకోవాలి. ∙5 – 15 ఏళ్ల వసువారికి ఎలాంటి ఆహారనియమాలు పెట్టకూడదు. వారి ఎదుగుదల కోసం వాళ్ల బరువుకు తగినట్లు ఎన్ని క్యాలరీలు అవసరమవుతాయో డైటీషియన్‌ను సంప్రదించి వారు చెప్పినట్లు పాటించాలి. త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలను వాడాలి. పిజ్జా, బర్గర్, ఐస్‌క్రీమ్స్, నూడుల్స్, బిస్కెట్లు వాడకూడదు. ∙ఆహారం విషయంలో ఆంక్షలు విధించడం, ఆహారాన్ని తగ్గించి, వ్యాయామాలను పెంచడం మంచిది కాదు. పిల్లల్లో అసలే తక్కువగా ఉండే రోగనిరోధకశక్తి... మరింతగా తగ్గిపోయి క్షయవ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తలివే... సాధారణ సమయంలో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు 140కి మించకుండా చూసుకోవాలి. మరీ బరువుంటే తప్ప బరువును తగ్గించే ప్రయత్నం చేయకూడదు. 5 నుంచి 15 ఏళ్ల వయసు చాలా కీలకం. పిల్లల వేళ్ల మధ్య, జననాంగాల వద్ద తేమ లేకుండా, ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చూసుకోవాలి. పిల్లలకు మధుమేహం వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి మధుమేహాన్ని అదుపులో పెట్టుకుంటే సాధారణ వ్యక్తుల కంటే కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. హోమియో వైద్యవిధానంలో చికిత్స : హోమియోలో టైప్–1కు అద్భుతమైన వైద్యచికిత్స ఉంది. ఇన్సులిన్‌తోపాటు హోమియో మందులు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఎదుగుదలలోపాన్ని, సోమరితనం, అతిమూత్రం లాంటి లక్షణాలను నయం చేయవచ్చు. ఇది పూర్తిగా సురక్షితం, దుష్పరిణామాలు ఉండవు. - డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ పైల్స్, ఫిస్టులా, ఫిషర్ సమస్యలు తగ్గుతాయి... హోమియో కౌన్సెలింగ్ నా వయసు 37. బాగా ముక్కి ముక్కి మలవిసర్జన చేయాల్సి వస్తోంది. అలాంటి సమయాల్లో మలద్వారం వద్ద ఇబ్బందిగా ఉంటోంది. – మోహన్‌రావు, కాకినాడ మీ ప్రశ్నలో మీరు పైల్స్, ఫిషర్ లేదా ఫిస్టులా సమస్యల్లో దేనితో బాధపడుతున్నారన్న స్పష్టత లేదు. అయితే ఈ మూడు సమస్యల్లోనూ మలబద్దకం వచ్చి, మలవిసర్జన సాఫీగా జరగదు. పైల్స్‌ను వాడుకలో మొలలు అంటారు. మలద్వారం వద్ద ఉండే సిరలు ఉబ్బడం వల్ల ఈ సమస్య వస్తుంది. పీచుపదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. తద్వారా కలిగే ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే సిరలు ఉబ్బుతాయి. పైల్స్ ఉన్నవారిలో నొప్పి, కొందరిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం, మలద్వారం వద్ద ఏదో అడ్డంకి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారిలో మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మలబద్దకం వల్ల మలం బయటకు రావడానికి అధికంగా ముక్కడం. యానల్ ఫిషర్లో ప్రధానమైన లక్షణం మలం బయటకు వచ్చేటప్పుడు నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇక యానల్ ఫిస్టులా అనేది మలద్వార భాగానికీ, చర్మానికీ మధ్యలో ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడటం. విసర్జన సమయంలో కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. ఆ కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి తొలిచేస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడుతుంది. మలద్వారం వద్దగల చర్మంపై ఇది ఒక చీముతో కూడిన గడ్డలాగా కనపడుతుంది. దీన్ని చీముగడ్డగా భావించి చికిత్స చేయడం వల్ల పైన చర్మం మీద ఉన్న గడ్డ నయమవుతుంది. కానీ లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉంటుంది. అందుకే ఈ సమస్య తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంది. యానల్ ఫిస్టులాలో కనపడే ప్రధాన లక్షణం మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దీనితో పాటు అక్కడ ఏర్పడ్డ రంధ్రం నుంచి చీముతో కూడిన రక్తం బయటకు వస్తుంటుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా... ఈ మూడు సమస్యలకూ హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయి. రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు ఇస్తారు. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
గౌట్స్ వంశపారంపర్యమా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 38. మా నాన్న గౌట్ వ్యాధితో బాధపడుతుండేవారు. ఇటీవల నేను రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అప్పుడు నా రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దాంతో నాకు కూడా గౌట్ వ్యాధి వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. ఇది వంశపారంపర్యమా? హోమియోతో నయమవుతుందా?– బి. నర్సింహారెడ్డి, నల్లగొండ మన రక్తంలో ఉండే యూరిక్ యాసిడ్ అనే రసాయనం ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కీళ్లలోకి చేరి, అక్కడ స్ఫటికంగా రూపొందుతుంది. ఆ స్ఫటికాలు ఎక్కువగా పేరుకుపోయినప్పుడు కీళ్లు వాచిపోయి కదలికలు కష్టంగా మారతాయి. దీన్నే గౌట్ లేదా గౌటీ ఆర్థరైటిస్ అంటారు. సాధారణంగా ఈ స్ఫటికాలు కాలి బొటన వేలి ప్రాంతంలో ఎక్కువగా ఏర్పడతాయి. దానివల్ల తీవ్రమైన నొప్పి, సలపరం, మంట, వాపు వస్తాయి. చిన్నపాటి కదలిక కూడా భరించలేనంత నొప్పిగా ఉంటుంది. ఇది పదే పదే వస్తుంటుంది. ఈ వ్యాధి కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కారణాలు: అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యం కూడా కొన్ని కారణాలు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం కూడా ఈ వ్యాధి రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. లక్షణాలు: ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. సరైన చికిత్స తీసుకోకపోతే కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తలు: గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స: హోమియోలోని అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్సీఎండ్డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
మాటిమాటికీ గర్భస్రావం... ఎందుకిలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లు అవుతోంది. మూడు సార్లు గర్భం దాల్చాను. ప్రతిసారీ మూడునెలలలోపు గర్భస్రావం అవుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్ని పరీక్షలు చేసి అంతా నార్మల్ అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. మళ్లీ గర్భం దాల్చినా అదేవిధంగా అవుతుందేమోనని ఆందోళనగా ఉంది. హోమియో చికిత్స ద్వారా నాకు గర్భం నిలుస్తుందా? – సరళ, హైదరాబాద్ స్త్రీలలో తరచూ గర్భస్రావం అవుతుంటే అది వారిని మానసికంగా దెబ్బతీసి, మరోసారి గర్భం వచ్చినప్పుడు అది నిలుస్తుందా లేదా అన్న ఆందోళనను కలగజేస్తుంది. గర్భం వచ్చిన తర్వాత రెండు లేదా అంతకు ఎక్కువసార్లు గర్భస్రావం జరిగితే దాన్ని ‘రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్’ లేదా ‘హ్యాబిచ్యువల్ అబార్షన్స్’ అంటారు. కారణాలు: చాలా సందర్భాల్లో క్రోమోజోములు లేదా జన్యువుల అసాధారణత్వం వల్ల లేదా అండం, శుక్రకణాల్లో వేటిలోనైనా అసాధారణత్వం ఉండటం వల్ల ఇలా తరచూ గర్భస్రావం జరిగే అవకాశాలుంటాయి. అలాగే... ∙గర్భాశయంలో అసాధారణత్వాలు అంటే ఉదాహరణకు రెండు గదులుగా ఉండటం లాంటివి ∙గర్భాశయంలో కణుతులు, పాలిప్స్ ∙సర్విక్స్ బలహీనంగా ఉండటం ∙యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ (ఏపీఎస్) వంటి వ్యాధులు ∙కొన్ని రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులు (ఉదాహరణకు సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్) ∙కొన్ని రకాల ఎండోక్రైన్ వ్యాధులు (ఉదాహరణకు డయాబెటిస్, థైరాయిడ్ సమస్య వంటివి) ∙కొన్ని రకాల సాధారణ, వైరల్ ఇన్ఫెక్షన్లు ∙పైన పేర్కొన్న వైద్యపరమైన సమస్యలతో పాటు మద్యం, పొగతాగడం వంటి అలవాట్ల వల్ల గర్భాస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే చాలా సందర్భాల్లో ఏ విధమైన కారణం లేకుండా కూడా గర్భస్రావం అయ్యే అవకాశాలున్నాయి. చికిత్స: హోమియో విధానంలో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా రోగి శారీరక, మానసిక తత్వాలను పరిగణనలోకి తీసుకొని అనుభవజ్ఞులైన వైద్యులు ఇచ్చే ఔషధాలతో గర్భస్రావం కాకుండా చూడవచ్చు. పేషెంట్ పరిస్థితిని వైద్యులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ వ్యక్తి సరిపడిన మందును అందించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం, హార్మోన్ల అవ్యవస్థత ఉంటే దాన్ని చక్కబరచడం, స్త్రీ–పురుషులలో లోపాలు ఉంటే వాటిని సరిచేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. తద్వారా మహిళల్లో గర్భం నిలిచేలా చూసి సంతానలేమి సమస్యను దూరంచేసి సంతానప్రాప్తి కలిగేలా చూడవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
ఆస్టియోపోరోసిస్‌కు చికిత్స ఉందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. ఇటీవల కండరాలు, ఎముకల నొప్పులు వస్తే డాక్టర్‌ను సంప్రదించాను. ఆస్టియోపోరోసిస్ ఉందని అన్నారు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – రమాదేవి, శ్రీకాకుళం ఎముకల సాంద్రత తగ్గడం వల్ల, ఎముకలో పగుళ్లు లేదా ఎముకలు విరిగే అవకాశాలను పెంచే వ్యాధి ఆస్టియోపోరోసిస్. మన శరీరంలో పాతకణాలు అంతరించి కొత్త కణాలు అంకురించడం అన్నది నిత్యం సాగే ప్రక్రియ. ఇది ఎముకల్లోనూ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఏ కారణంగానైనా తరిగిపోతున్న పాత ఎముకకు సరిసమానంగా కొత్త ఎముక ఏర్పడకపోతే ఎముకలు పెళుసుబారిపోయే ఆస్టియోపోరోసిస్ వ్యాధి మొదలువుతుంది. వీరిలో అతి చిన్న దెబ్బకు లేదా చిన్న బెణుకుకే ఎముకలు విరిగిపోవచ్చు లేదా ఎముకలు పగుళ్లు బారవచ్చు. సాధారణంగా ఈ పెళుసుదనం పగుళ్లు వెన్నెముక, పక్కటెముక, తుంటి ఎముక, మణికట్ల స్థానాల్లో ఏర్పడతాయి. అందుకే ఆ ఎముకలు విరిగే అవకాశం ఎక్కువ. కారణాలు: ∙అతిగా మద్యపానం చేయడం ∙దీర్ఘకాలికంగా మందులు వాడటం ∙నూనె, మసాలా పదార్థాలు వాడటం వల్ల ∙శారీరక శ్రమ లేకపోవడం వల్ల వయసు పైబడిన కారణంగా సన్నబడిపోవడం సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్పోజ్ కాకపోవడం లక్షణాలు: ∙ఎత్తు తగ్గి నడుము, ఇతర అవయవాలు ఒంగిపోతాయి ∙నడుమునొప్పి ∙అలసట ∙ఎముకల్లో నొప్పి, ఎముకలు త్వరగా విరిగిపోవడం ∙ఎముకల సాంద్రత తగ్గిపోవడం వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు ∙ఎక్స్–రే ∙డీఎక్స్ (డ్యూయల్ ఎనర్జీ ఎక్స్–రే అబ్జార్ష్షియోమెట్రీ చికిత్స: ఆస్టియోపోరోసిస్‌కి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను విశ్లేషించి తగిన మందులను వైద్యులు సూచిస్తారు. ఆస్టియోపోరోసిస్‌కి హోమియోలో కాల్కేరియా ఫాస్ఫోరికా, ఫాస్ఫరస్, సల్ఫర్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
యూరిక్ యాసిడ్ పెరిగితే...
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. కొద్దిరోజుల క్రితం ఉన్నట్టుండి కాలి బొటనవేలు వాచిపోయి, విపరీతమైన సలపరంతో కూడిన నొప్పి వచ్చింది. కాలిలో చిన్నపాటి కదలిక కూడా ఎంతో కష్టంగా అనిపించింది. వైద్యుడిని సంప్రదిస్తే గౌట్ అని చెప్పారు. మందులు వాడినప్పటికీ పూర్తిగా తగ్గలేదు. రక్తంలో ‘యూరిక్ యాసిడ్’ స్థాయులు అధికంగానే ఉన్నాయని రిపోర్టు వచ్చింది. నాకు పరిష్కారం లభించే అవకాశం ఉదా? – సత్యనారాయణ, భీమవరం మన శరీరంలో యధావిధిగా జరిగే ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందువల్ల గౌట్ వ్యాధి వస్తుంది. ఇది ఒక రకం కీళ్లవ్యాధి. ఈ వ్యాధి నుంచి బయటపడటానికి ఆహారంలో మార్పులు, వ్యాయామాలు చేసినప్పటికీ రక్తంలోని యూరిక్ యాసిడ్ పాళ్లు సాధారణ స్థితికి చేరుకోకపోతే... వ్యాధి మళ్లీ మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుకుంటుంది. ఇలా చేరిన యూరిక్ యాసిడ్ స్ఫటికాలుగా కీళ్లలోనూ, కీళ్ల చుట్టూ ఉండే కణజాలంలో చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితే ‘గౌట్’. కారణాలు : ∙రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా, విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (మాంసం, గుడ్లు, చేపలు) ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. ∙కొన్ని కిడ్నీ వ్యాధుల వల్ల కూడా గౌట్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. నివారణ / జాగ్రత్తలు : ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే లివర్, కిడ్నీ, ఎముక మూలుగు, పేగులను తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగులు తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానాలి. చికిత్స : హోమియో వైద్యవిధానంలో అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్