ఆస్టియోపోరోసిస్‌కు చికిత్స ఉందా?
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 55 ఏళ్లు. ఇటీవల కండరాలు, ఎముకల నొప్పులు వస్తే డాక్టర్‌ను సంప్రదించాను. ఆస్టియోపోరోసిస్ ఉందని అన్నారు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – రమాదేవి, శ్రీకాకుళం
ఎముకల సాంద్రత తగ్గడం వల్ల, ఎముకలో పగుళ్లు లేదా ఎముకలు విరిగే అవకాశాలను పెంచే వ్యాధి ఆస్టియోపోరోసిస్. మన శరీరంలో పాతకణాలు అంతరించి కొత్త కణాలు అంకురించడం అన్నది నిత్యం సాగే ప్రక్రియ. ఇది ఎముకల్లోనూ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఏ కారణంగానైనా తరిగిపోతున్న పాత ఎముకకు సరిసమానంగా కొత్త ఎముక ఏర్పడకపోతే ఎముకలు పెళుసుబారిపోయే ఆస్టియోపోరోసిస్ వ్యాధి మొదలువుతుంది.
వీరిలో అతి చిన్న దెబ్బకు లేదా చిన్న బెణుకుకే ఎముకలు విరిగిపోవచ్చు లేదా ఎముకలు పగుళ్లు బారవచ్చు. సాధారణంగా ఈ పెళుసుదనం పగుళ్లు వెన్నెముక, పక్కటెముక, తుంటి ఎముక, మణికట్ల స్థానాల్లో ఏర్పడతాయి. అందుకే ఆ ఎముకలు విరిగే అవకాశం ఎక్కువ.
కారణాలు: ∙అతిగా మద్యపానం చేయడం ∙దీర్ఘకాలికంగా మందులు వాడటం ∙నూనె, మసాలా పదార్థాలు వాడటం వల్ల ∙శారీరక శ్రమ లేకపోవడం వల్ల వయసు పైబడిన కారణంగా సన్నబడిపోవడం సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కాకపోవడం
లక్షణాలు: ∙ఎత్తు తగ్గి నడుము, ఇతర అవయవాలు ఒంగిపోతాయి ∙నడుమునొప్పి ∙అలసట ∙ఎముకల్లో నొప్పి, ఎముకలు త్వరగా విరిగిపోవడం ∙ఎముకల సాంద్రత తగ్గిపోవడం
వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు ∙ఎక్స్–రే ∙డీఎక్స్ (డ్యూయల్ ఎనర్జీ ఎక్స్–రే అబ్జార్‌ష్షియోమెట్రీ
చికిత్స: ఆస్టియోపోరోసిస్‌కి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను విశ్లేషించి తగిన మందులను వైద్యులు సూచిస్తారు. ఆస్టియోపోరోసిస్‌కి హోమియోలో కాల్కేరియా ఫాస్‌ఫోరికా, ఫాస్ఫరస్, సల్ఫర్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్