అందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకలు వేగంగా పెరుగుతుంటాయి. మనలో దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు ఎముకలు కాస్త బలంగా గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా పలచబడుతూ, పెళుసుగా మారుతూ ఉంటాయి. ఇలా ఎముకలు పలచబా రుతూ తేలిగ్గా విరిగేలా పెళుసుబారడాన్ని ‘ఆస్టియోపోరోసిస్’ అంటారు.
ఈ ముప్పు మహిళల్లో మరీ ఎక్కువ. మహిళలైనా, పురుషులైనా ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం ఈ కింది అక్షరాల సహాయంతో అవలంబించాల్సిన జాగ్రత్తలను గుర్తుపెట్టుకోవచ్చు. అవి...
♦ ‘సి’ ఫర్ క్యాల్షియమ్– ఎక్కువగా తీసుకోవాలి. అంటే క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాలు, ఆకుకూరల వంటివి.
♦ ‘డి’ ఫర్ విటమిన్ డి – శరీరానికి తగినంత అందేలా చూసుకోవాలి. ఇందుకోసం లేత ఎండలో నడక, వ్యాయామం మేలు.
♦ ‘ఈ’ ఫర్ ఎక్సర్‌సైజ్ – శరీరాన్ని తగినంత వ్యాయామాన్ని అందించాలి.
♦ ‘ఎఫ్’ ఫర్ ‘ఫాల్స్’ – ఫాల్ అంటే ఇంగ్లిష్‌లో పడిపోవడం. వయసు పెరిగినవారికి బాత్‌రూమ్‌ల వంటి చోట్ల, ఎక్కడానికి అంత అనువుగా లేని మెట్లు ఉండే చోట్ల పడిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. ఇలా పడిపోయే అవకాశాల్ని తగ్గించుకోవాలి. అంటే ఆయా ప్రదేశాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment