Green vegetables
-
పొన్నగంటి కూరతో అద్భుత ప్రయోజనాలు: మగవారిలో శక్తికి
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారంలో ఒకసారి అయినా ఆకుకూరలతో చేసిన వంటకాలను మెనూలో చేర్చుకుంటే అనేక రకాల రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు. ఆకుకూరల్లో తోటకూర, బచ్చలికూర, గోంగూర, చుక్కకూర ఇది మాత్రమే సాధారణంగా వినబడుతూ ఉంటాయి. కానీ అద్భుతమై పోషకాలతో నిండి వున్న మరో ఆకుకూర పొన్నగంటి కూర.పొన్నగంటిలో బీ 6, సి, ఏ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇంకా రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, కాల్షియం కూడా మనకు అందుతాయి. పొన్నగంటి కూరతో లాభాలురోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. నిపుణుల ప్రకారం పురుషులకు ఎంతో మేలు చేస్తుంది. వారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. జీవక్రియలోని లోపాలను కూడా సరిచేస్తుంది. కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందిబరువును నియంత్రిస్తుంది. గుండెకు, మెదడుపనితీరును మెరుగుపరుస్తుంది.ఇందులోని కాల్షియం ఎముకలకు చాలా మంచిది. ఆస్టియోపోరోసిస్ వంటివాటిని కూడా పొన్నగంటి కూర దూరం చేస్తుంది నరాల్లో నొప్పికి, వెన్ను నొప్పి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.తోటకూర వేపుడు లాగా చేసుకోవచ్చు. లేదంటే పప్పుతో కలిపి చేసుకోవచ్చు. శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతుందిగౌట్ వ్యాధి, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి.పెరట్లో పెంచుకోవడం ఇది కూడా చాలా సులభం. చిన్న చిన్నకుండీలలో ఈజీగా పెరుగుతుంది. -
మెడి టిప్
అందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకలు వేగంగా పెరుగుతుంటాయి. మనలో దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు ఎముకలు కాస్త బలంగా గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా పలచబడుతూ, పెళుసుగా మారుతూ ఉంటాయి. ఇలా ఎముకలు పలచబా రుతూ తేలిగ్గా విరిగేలా పెళుసుబారడాన్ని ‘ఆస్టియోపోరోసిస్’ అంటారు. ఈ ముప్పు మహిళల్లో మరీ ఎక్కువ. మహిళలైనా, పురుషులైనా ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం ఈ కింది అక్షరాల సహాయంతో అవలంబించాల్సిన జాగ్రత్తలను గుర్తుపెట్టుకోవచ్చు. అవి... ♦ ‘సి’ ఫర్ క్యాల్షియమ్– ఎక్కువగా తీసుకోవాలి. అంటే క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాలు, ఆకుకూరల వంటివి. ♦ ‘డి’ ఫర్ విటమిన్ డి – శరీరానికి తగినంత అందేలా చూసుకోవాలి. ఇందుకోసం లేత ఎండలో నడక, వ్యాయామం మేలు. ♦ ‘ఈ’ ఫర్ ఎక్సర్సైజ్ – శరీరాన్ని తగినంత వ్యాయామాన్ని అందించాలి. ♦ ‘ఎఫ్’ ఫర్ ‘ఫాల్స్’ – ఫాల్ అంటే ఇంగ్లిష్‌లో పడిపోవడం. వయసు పెరిగినవారికి బాత్రూమ్ల వంటి చోట్ల, ఎక్కడానికి అంత అనువుగా లేని మెట్లు ఉండే చోట్ల పడిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. ఇలా పడిపోయే అవకాశాల్ని తగ్గించుకోవాలి. అంటే ఆయా ప్రదేశాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. -
మీ పిల్లలు సరిగ్గా తినడం లేదా? ఈ 5 చిట్కాలు పాటిస్తే సరి!
పిల్లలచేత ఆకుకూరలు తినిపించడం ప్రతి తల్లికీ సవాలే! కానీ పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే అన్నిరకాల పోషకాలు అవసరమేకదా! మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం పిల్లలు తమకు తాముగా ఆహారం తీసుకుంటే చేకూరే ప్రయోజనాలు అనేకం. ఈ నైపుణ్యాలు జీవిత ఇతర భాగాల్లోనూ ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించింది. అలాగే తినే విధానం కూడా వారి ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతుందట. పిల్లలు ఇష్టంగా ఆహారం తింటే చిన్నతనం నుంచే ఉబకాయానికి చెక్ పెట్టొచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లలు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవరచుకోవడానికి నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు మీకోసం.. ఆహారం బాగా నమలాలి ఆహారం బాగా నమిలి తింటే వేగంగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. తద్వారా అవసరానికి మించి తినడాన్ని నిరోధించవచ్చు. ఆరోగ్యకరమైన తిరుతిండ్లు పిల్లలకు చిన్నతనం నుంచే ఆరోగ్యానికి మేలు చేసే చిరుతిండ్లు తినే అలవాటు చేయాలి. ఇది మంచి ఆహార అలవాట్లను నేర్పడానికేకాకుండా జంక్, ఫ్రైడ్ ఫుడ్ తినకుండా నివారించవచ్చు. ఆహార ఎంపికలోనూ భాగస్తులను చేయాలి కిరాణా దుకాణానికి వెళ్లినప్పుడు మీ పిల్లలను కూడా మీతోపాటు తీసుకెళ్లండి. ఆరోగ్యానికి మేలుచేసే వస్తువులను ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో వారికి నేర్పండి. ఈ విధమైన భాగస్వామ్యం వల్ల పిల్లలు ఆహారంపై ఆసక్తిని కనబరిచే అవకాశం ఉంటుంది. పిల్లలు ఇష్టపడేలా వండాలి ప్రతి రోజూ ఒకే విధమైన ఆహారం తింటే మీకేమనిపిస్తుంది? బోర్ కొడుతుంది కదా! అందుకే ఎప్పటికప్పుడు రుచికరంగా ఉండేలా ఫ్రూట్స్, వెజిటబుల్స్‌తో కొత్త వంటకాలు ప్రయోగం చేస్తూ ఉండాలి. అప్పుడే పిల్లలు ఆసక్తిగా, ఇష్టంగా తింటారని నిపుణులు సూచిస్తున్నారు. పంచేద్రియాలు అనుభూతి చెందేలా చూపు, వాసన, రుచి, స్పర్శ, వినికిడి.. ఈ పంచేంద్రియాలు అనుభూతి చెందేలా ఆహారం ఉండాలని ఎప్పుడూ నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ చిన్న చిన్న పరిణామాలే పిల్లలకి ఆహారం పట్ల ఆసక్తి పెరుగేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చదవండి: ఏడేళ్ల కొడుక్కి మామ్స్ మనీలెసన్! మీరూ ట్రై చేయండి.. -
ఒక ఇంటిపైన పచ్చధనం
కూరగాయలు, ఆకుకూరల సాగులో వాడే రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుష్ప్రభావం ఆరోగ్యంపై ఎంత ఎక్కువగా ఉంటున్నదీ తెలిసివస్తున్నకొద్దీ ఆర్గానిక్ ఆహారంపై ఆకర్షితులవుతున్న నగరవాసుల సంఖ్య పెరుగుతోంది. తమ ఇళ్లపైన ఖాళీల్లో కుండీలు, మడులు పెట్టుకొని, తమ తీరిక సమయాన్ని ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడానికి గృహిణులు మొగ్గు చూపుతూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నారు. గుంటూరు జెకేసీ కాలేజీరోడ్డులోని విజయపురి కాలనీకి చెందిన గృహిణి మున్నంగి హరిప్రియ ఈ కోవకు చెందిన వారే. శిక్షణ పొంది మరీ ఇంటిపంటలను విజయవంతంగా సాగు చేస్తూ మంచి దిగుబడులు పొందుతున్నారు. తాము తినటంతోపాటు ఇద్దరు కుమారు ల కుటుంబాలకూ సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను అందిస్తుండటం విశేషం. మూడు మడులు, మూడు వరలతోపాటు అనేక ప్లాస్టిక్ తొట్లలో రకరకాల మొక్కలు నాటారు. సేంద్రియ కూరగాయల సాగు సంతృప్తినివ్వడంతో పాటు, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆమె అనందం వ్యక్తం చేస్తున్నారు. నల్లమట్టిలో ఘనజీవామృతం, వర్మీ కంపోస్టు, ఇసుక, వేపపిండి, కొబ్బరి పొట్టు కలిపి మడులు, వరలు, ప్లాస్టిక్ తొట్లలో నింపి మొక్కలు విత్తినట్లు చెప్పారు. ఆవు పంచకం, పుల్ల మజ్జిగ, అల్లంవెల్లుల్లి ద్రావణం, బూడిద, పసుపు చల్లటం ద్వారా చీడపీడలను నివారిస్తున్నట్లు ఆమె వివరించారు. సొర, బీర, కాకర, అలసంద, పొట్ల వంటి పాదులతోపాటు.. టమోట, వంగ, బెండ, మిర్చి, తోటకూర, మెంతికూర, పాలకూర, బచ్చలి కూర పండించుకుంటున్నారు. కిచెన్ గార్డెన్లో సీతాకోకచిలుకలు, తేనెటీగలు తిరుగాడుతూ పరపరాగ సంపర్కం బాగా జరిగి మంచి దిగుబడులు రావాలంటే పూల మొక్కలను కూడా పెంచుకోవాలి. ఈ దృష్టితోనే హరిప్రియ గులాబి, మందార, పారిజాతం, సెంటుమల్లి, బోగన్‌విలా, గన్నేరు, నందివర్థనం, మల్లెలు, వంటి పూల మొక్కలను కూడా నాటారు. కూరగాయలు కొనే అవసరం లేకుండానే హాయిగా ఆరోగ్యదాయకమైన కూరలు తినగలుగుతున్నామన్నారు. తమ ఇద్దరు కుమారుల కుటుంబాలకు కూడా కూరగాయలు పంపుతున్నామని, పూలు కూడా కొనకుండా సరిపోతున్నాయన్నారు సంబరంగా. రోజుకు 2 గంటల పనితో సంతోషం! నాకు వ్యవసాయం అంటే మొదటి నుంచి మక్కువ. ప్రస్తుతంమార్కెట్‌లో అమ్ముతున్న కూరగాయల సాగులో రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడుతున్నారు. దీని ప్రభావం ఆరోగ్యంపై కనిపిస్తున్నది. సేంద్రియ ఇంటిపంటల సాగులో శిక్షణ పొందిన తరువాత రూఫ్‌పైనే రూ. 50 వేల ఖర్చుతో మడులు, వరలతో తోట తయారు చేసుకున్నాను. విత్తనాలు తెచ్చుకొని నారు పోసి మొక్కలు నాటుతున్నాను. పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో వీటిని పండిస్తున్నాను. వంటింటి వ్యర్థాలు, రాలిన ఆకులు, రెమ్మలతో నేనే వర్మీ కంపోస్టు తయారు చేసుకుంటున్నాను. గో పంచకం మా తమ్ముని దగ్గర నుంచి తెచ్చుకొంటున్నాను. తోటపనిలో రోజూ రెండు గంటలు పాదులు సరిచేసుకుంటూ, నీరు పెట్టుకుంటూ సంతోషంగా ఉన్నాను. తోట నాకు ఆరోగ్యంతోపాటు అనందాన్ని కూడా అందిస్తున్నది. నాకు తెలిసినంతలో ఇతరులకూ సలహాలు ఇస్తూ ఇంటిపంటల సాగును ప్రోత్సహిస్తున్నాను. – మున్నంగి హరిప్రియ (98493 46517), జెకేసీ కాలేజీ రోడ్డు, విజయపురి కాలనీ, గుంటూరు – ఓబులరెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి, అమరావతి బ్యూరో, గుంటూరు ఫొటోలు: గజ్జల రామగోపాలరెడ్డి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
ఎమ్మెల్యే ప్రకృతి సేద్యం
రసాయనిక అవశేషాల్లేకుండా ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసుకోవడానికి రోజువారీ పనుల వల్ల తీరిక దొరకటం లేదనుకుంటూ ఉంటారు. అయితే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇందుకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి నిదర్శంగా నిలుస్తూ ఇంటిపంటలను ఇష్టంగా సాగు చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ఉండే ఆమె ప్రకృతి వ్యవసాయ ప్రేమికురాలు కావడం విశేషం. స్వగ్రామం వండువలో ఇంటి పక్కనే ఉన్న 50 సెంట్ల స్థలాన్ని ఉద్యాన పంటల వనంలా మార్చారు. ఆకుకూరలు, పందిరి కూరగాయ పంటలు ఆనప, బీర, బెండ, గుమ్మడి కాయల దిగుబడి బాగుంది. ఒక్కో ఆనపకాయ 10 నుంచి 20 కిలోల బరువు పెరుగుతున్నాయి. కంది, చెరకు, పెండలం, కంద ఇలా అనేక పంటలను సాగు చేస్తున్నారు. వంటకు బయోగ్యాస్‌ను వినియోగిస్తున్నారు. పంటలకు సొంతంగా తయారు చేసుకున్న సేంద్రియ ఎరువును, జీవామృతాన్ని, కషాయాలను వాడుతూ మంచి దిగుబడి సాధిస్తుండటం విశేషం. పెరటి పంటల పనులను కళావతి ప్రతి రోజూ ఉదయం గంట సేపు స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. పెరటి తోటలో కలియ దిరుగుతూ సిబ్బందికి తగిన సూచనలిస్తారు. పురుగు గానీ, ఆకు ముడత కనపడినా వెంటనే వాటిని తీసేయడం ద్వారా చక్కని పంట దిగుబడులు పొందుతుండడం విశేషం. – సూరాబత్తుల గాంధీ, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా మహిళలు పెరటి తోటల సాగు చేపట్టాలి శ్రద్ధగా చేస్తే ప్రకృతి/సేంద్రియ సాగు అసాధ్యమేమీ కాదు. సేంద్రియ ఎరువుతో భూమిని సారవంతం చేస్తే పంటల సాగుకు అనుకూలంగా మారుతుంది. బాల్యం నుంచీ పంటల సాగు అంటే బాగా ఇష్టం. ఇంటి దగ్గర కొద్ది స్థలంలో సరదాగా చేపట్టిన సాగు 50 సెంట్లకు విస్తరించింది. మహిళలంతా పెరటి తోటల సాగు చేపట్లేలా స్ఫూర్తినివ్వాలన్నది నా కోరిక. సేంద్రియ ఎరువులతో ఇంటి వద్దనే ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లు సాగు చేసుకునేందుకు మహిళలు ముందుకు రావాలి. – విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా -
ఒక్క బ్యారెల్ = 60 కుండీలు!
వర్టికల్ టవర్ గార్డెన్‌ను మీరే తయారు చేసుకోవచ్చు.. వర్టికల్ టవర్ గార్డెన్ ఇంటిపంటల సాగుదారులకు చాలా ఉపయోగకరం. మేడ మీద లేదా బాల్కనీలో, ఇంటి పెరట్లో అతి తక్కువ స్థలంలో (కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట) ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో బారెల్లో 60 రకాల ఆకుకూరలు, కూరగాయలు, కషాయాల కోసం ఔషధ మొక్కలను పెంచుకోవచ్చు. బారెల్ మధ్యలో ఉండే పీవీసీ పైపులో వంటింటి వ్యర్థాలు వేస్తూ.. వర్మీ కంపోస్టును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ టవర్ గార్డెన్లను సేంద్రియ ఇంటిపంటలపై ఆసక్తి, ఓపిక ఉన్న వారు తమంతట తాము తయారు చేసుకోవచ్చు. అదెలాగో వర్టికల్ టవర్ గార్డెన్ నిపుణులు రవి చంద్రకుమార్ వివరిస్తున్నారు. మార్కెట్లో దొరికే 300 లీటర్ల లేదా 250 లీటర్ల హెచ్.డి.పి.ఇ. బారెల్ తీసుకోవాలి. బారెల్ పొడవు 36 అంగుళాలు. బారెల్‌కు చుట్టూతా 5 అంగుళాలకు ఒక చోట కత్తిరిస్తే (దీన్నే పాకెట్ అని పిలుస్తున్నాం).. 7 వరుసల్లో పాకెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అడ్డంగా ఒక్కొక్క పాకెట్ వెడల్పు 5 అంగుళాలు ఉండేలా కొలత స్కేల్‌తో మార్క్ చేసుకోవాలి. రెండు పాకెట్ల మధ్య 4 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. ఒక వరుసలో 8 పాకెట్లు వస్తాయి. 7 వరుసల్లో మొత్తం 56 పాకెట్లు వస్తాయి. బారెల్ పై భాగాన 4 మొక్కలు పెట్టవచ్చు. అన్నీ కలిపి 60 మొక్కలు పెట్టుకోవచ్చు. అంటే ఒక బారెల్ 60 కుండీలతో సమానం అన్నమాట! పాకెట్లు ఎక్కడ పెట్టుకోవాలో మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసిన చోట బారెల్ను డ్రిల్ మెషిన్‌తో కత్తిరించి చిల్లు పెట్టాలి, జిగ్సా రంపం పట్టడం కోసం. జిగ్సా తో వరుసల్లో మార్క్ చేసిన చోట్ల 5 అంగుళాల వెడల్పున కట్ చేయాలి. పాకెట్ మౌల్డింగ్ చేసే విధానం.. హీట్ గన్‌తో కట్ చేసిన ప్రదేశంలో హీట్ చేయాలి. తగిన హీట్ అయిన తరువాత ఆ ప్రదేశంలో చిత్రంలో చూపిన విధంగా సిమెంటు దిమ్మె అమర్చాలి. అలా అన్ని పాకెట్లను తయారు చేయాలి. బారెల్ అడుగు భాగంలో మధ్యన 4 అంగుళాల రంధ్రం చేయాలి. పక్కన అర అంగుళం రంధ్రం చేయాలి. అధిక నీరు బయటకు వెళ్లడానికి అక్కడ గ్రోమేట్ పెటి టేకాహ్ అమర్చాలి. మధ్యలో 4 అంగుళాల పీవీసీ గొట్టం అమర్చాలి. గొట్టం చుట్టూ చిల్లులు పెట్టాలి. గొట్టం అమర్చే విధానం.. ఆ గొట్టాన్ని క్రింది భాగాన 6 అంగుళాలు బయటకు ఉండేలా అమర్చి.. అక్కడ ఎంసీల్‌తో అతకాలి. పై భాగాన జీయే వైరుతో కట్టాలి. 4 అంగుళాల గొట్టానికి పైన, కింద మూతలు అమర్చాలి. ఈ బారెల్ను నిలబెట్టడానికి ఇనుప స్టాండ్‌ను తయారు చేసుకోవాలి. స్టాండ్ 18 అంగుళాల పొడవు, 18 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల ఎత్తు ఉండాలి. వర్టికల్ గార్డెన్లో కంపోస్టు తయారు చేసే విధానం– వర్మీ కంపోస్టు 30%, రంపపు పొట్టు 30%, పశువుల ఎరువు 30%, వేప గింజల చెక్క 10%.. ఇవన్నీ కలిపి బారెల్లో సరిపడినంత నింపుకోవాలి. బారెల్ మధ్యలో అమర్చిన గొట్టంలో వంటింటి వ్యర్థాలు వేయాలి. అందులో చక్కటి వర్మీకంపోస్టు తయారవుతుంది. స్టాండ్ మీద వర్టికల్ గార్డెన్‌ను అమర్చుకున్న తర్వాత.. అందులో కంపోస్టు మిశ్రమాన్ని నింపుకోవాలి. బారెల్ చుట్టూ ఉన్న అరలలో విత్తనాలు నాటుకోవాలి. ఒక్కో వర్టికల్ గార్డెన్ టవర్‌ను తయారు చేసుకోవడానికి (బారెల్, స్టాండ్, టవర్, కంపోస్టు, విత్తనాలు.. అన్నీ కలిపి) రూ. 5 వేలు ఖర్చవుతుంది. వర్టికల్ టవర్‌కు రోజుకు కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట పెట్టుకోవాలి. ఇందులో అన్ని రకాల ఆకుకూరలు, ఔషధ మొక్కలు చక్కగా పండించవచ్చని రవిచంద్ర కుమార్ (95812 42255) తెలిపారు. -
అటు సేంద్రియ పంటలు ఇటు ఇంటిపంటలు!
‘సాక్షి సాగుబడి’ పేజీలో ‘ఇంటిపంట’, ప్రకృతి వ్యవసాయ కథనాలతో స్ఫూర్తిపొందిన యలమంచి వంశీ అనే యువరైతు గత రెండేళ్లుగా రసాయనాలు వాడకుండా వరి, మిర్చి సాగుతోపాటు మిద్దె తోటను సాగు చేస్తూ కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. తమ కుటుంబానికే కాకుండా బంధుమిత్రులకూ రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన పంటలు అందిస్తూ ఇతరులకు స్ఫూరినిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలోని ఆంధ్రకేసరి కాలనీ నివాసి అయిన వంశీ.. తన తండ్రి హయాంలో 23 ఏళ్ల క్రితం నిర్మించిన నివాస భవనంపైన రెండేళ్ల క్రితం సిమెంటు బెడ్స్ నిర్మించి మిద్దె తోట పెంచుతూ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు తింటున్నారు. 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న టెర్రస్‌పైన 17 మడులను ఇటుకలతో నిర్మించి సిమెంటు ప్లాస్టింగ్ చేయించారు. టెర్రస్ మీద ఒక అడుగు ఎత్తున ఖాళీ ఉంచి మడులు నిర్మించారు. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పున మడి నిర్మించారు. అడుగు లోతున మట్టి, పశువుల ఎరువు, కొబ్బరి పొట్టు మిశ్రమాన్ని నింపి కూరగాయలు పండిస్తున్నారు. ప్రస్తుతం వంగ, బెండ, దొండ దిగుబడి వస్తోంది. క్యాబేజి, బీట్రూట్ కూడా ఉన్నాయి. ఆపిల్ బెర్ తదితర పండ్ల మొక్కలు కూడా వేశారు. పంచగవ్య, వేస్ట్‌డీకంపోజర్, జీవామృతం, కషాయాలతో వరి, మిర్చి సాగు చేస్తున్న వంశీ మిద్దె తోటను కూడా శ్రద్ధగా సాగు చేస్తున్నారు. మారుమూల పల్లెటూర్లో సేంద్రియ వ్యవసాయం చేయడంతోపాటు ఇంటిపైన కూరగాయలు పెంచడం పలువుర్ని ఆకర్షిస్తోంది. సేంద్రియ వరి బియ్యాన్ని, మిర్చి పొడిని హైదరాబాద్‌లోని ఆర్గానిక్ షాపులకు ఇస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులను రుచి చూసిన వారు మళ్లీ అడుగుతుండటంతో మరింత ఉత్సాహం కలుగుతోందని, ఈ ఏడాది ఎకరంలో మిర్చితోపాటు 9 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నానని వంశీ తెలిపారు. గ్రామాల్లో సైతం మిద్దె తోటలు నిర్మించుకుంటే ఎండాకాలం ఇల్లు చల్లగా ఉంటుంది. మిద్దెతోట కూరగాయలను తమ కుటుంబ సభ్యులు ఇష్టంగా తింటున్నారని వంశీ (99089 97969) తెలిపారు. -
హెల్త్ టిప్స్
పచ్చికూరలు ఉప్పునీరు పచ్చి కూరగాయలు, ఆకులను తినే ముందు వాటిని తప్పనిసరిగా ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటితో కడగాలి. వాటిని పండించేటప్పుడు చల్లిన క్రిమిసంహారక మందుల అవశేషాలు, పొలం నుంచి ఇంటికి వచ్చే వరకు అవి చేసే ప్రయాణంలో వాటినాశించిన రకరకాల క్రిమికీటకాలు, దుమ్ముధూళి చన్నీటితో కడిగితే పూర్తిగా పోవు. ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే పచ్చి కూరగాయలతో వచ్చే ఆరోగ్యం కంటే ముందు పురుగు మందుల ప్రభావంతో సైడ్ఎఫెక్ట్స్ వస్తాయి. ముఖం మీద బ్లాక్ హెడ్స్, మొటిమలు వస్తుంటే నూనెలో వేయించిన ఆహారాన్ని పూర్తిగా మానేయాలి. ఆహారంలో తాజా పండ్లు, పచ్చికూరగాయలతో చేసిన సలాడ్లు, మొలకెత్తిన గింజలు, మీగడ లేని పెరుగు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో చేర్చుకుంటే శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు పోయి అనవసరమైన కొవ్వు శరీరంలోకి చేరకుండా చర్మం తాజాగా ఉంటుంది. -
హెల్త్ టిప్స్
పచ్చి కూరగాయలు, ఆకులను తినే ముందు వాటిని తప్పని సరిగా ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటితో కడగాలి. వాటిని పండించేటప్పుడు చల్లిన క్రిమిసంహారక మందుల అవశేషాలు, పొలం నుంచి ఇంటికి వచ్చే వరకు అవి చేసే ప్రయాణంలో వాటినాశించిన క్రిమికీటకాలు, దుమ్ముధూళి... చన్నీటితో కడిగితే పూర్తిగా పోవు. శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం చేస్తే పచ్చి కూరగాయలతో వచ్చే ఆరోగ్యం కంటే ముందు పురుగు మందుల ప్రభావంతో సైడ్ఎఫెక్ట్స్ వస్తాయి.