పిల్లలచేత ఆకుకూరలు తినిపించడం ప్రతి తల్లికీ సవాలే! కానీ పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే అన్నిరకాల పోషకాలు అవసరమేకదా! మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం పిల్లలు తమకు తాముగా ఆహారం తీసుకుంటే చేకూరే ప్రయోజనాలు అనేకం. ఈ నైపుణ్యాలు జీవిత ఇతర భాగాల్లోనూ ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించింది. అలాగే తినే విధానం కూడా వారి ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతుందట. పిల్లలు ఇష్టంగా ఆహారం తింటే చిన్నతనం నుంచే ఉబకాయానికి చెక్ పెట్టొచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లలు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవరచుకోవడానికి నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు మీకోసం..
ఆహారం బాగా నమలాలి
ఆహారం బాగా నమిలి తింటే వేగంగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. తద్వారా అవసరానికి మించి తినడాన్ని నిరోధించవచ్చు.
ఆరోగ్యకరమైన తిరుతిండ్లు
పిల్లలకు చిన్నతనం నుంచే ఆరోగ్యానికి మేలు చేసే చిరుతిండ్లు తినే అలవాటు చేయాలి. ఇది మంచి ఆహార అలవాట్లను నేర్పడానికేకాకుండా జంక్, ఫ్రైడ్ ఫుడ్ తినకుండా నివారించవచ్చు.
ఆహార ఎంపికలోనూ భాగస్తులను చేయాలి
కిరాణా దుకాణానికి వెళ్లినప్పుడు మీ పిల్లలను కూడా మీతోపాటు తీసుకెళ్లండి. ఆరోగ్యానికి మేలుచేసే వస్తువులను ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో వారికి నేర్పండి. ఈ విధమైన భాగస్వామ్యం వల్ల పిల్లలు ఆహారంపై ఆసక్తిని కనబరిచే అవకాశం ఉంటుంది.
పిల్లలు ఇష్టపడేలా వండాలి
ప్రతి రోజూ ఒకే విధమైన ఆహారం తింటే మీకేమనిపిస్తుంది? బోర్ కొడుతుంది కదా! అందుకే ఎప్పటికప్పుడు రుచికరంగా ఉండేలా ఫ్రూట్స్, వెజిటబుల్స్‌తో కొత్త వంటకాలు ప్రయోగం చేస్తూ ఉండాలి. అప్పుడే పిల్లలు ఆసక్తిగా, ఇష్టంగా తింటారని నిపుణులు సూచిస్తున్నారు.
పంచేద్రియాలు అనుభూతి చెందేలా
చూపు, వాసన, రుచి, స్పర్శ, వినికిడి.. ఈ పంచేంద్రియాలు అనుభూతి చెందేలా ఆహారం ఉండాలని ఎప్పుడూ నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ చిన్న చిన్న పరిణామాలే పిల్లలకి ఆహారం పట్ల ఆసక్తి పెరుగేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చదవండి: ఏడేళ్ల కొడుక్కి మామ్స్ మనీలెసన్! మీరూ ట్రై చేయండి..
Comments
Please login to add a commentAdd a comment