ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారంలో ఒకసారి అయినా ఆకుకూరలతో చేసిన వంటకాలను మెనూలో చేర్చుకుంటే అనేక రకాల రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు. ఆకుకూరల్లో తోటకూర, బచ్చలికూర, గోంగూర, చుక్కకూర ఇది మాత్రమే సాధారణంగా వినబడుతూ ఉంటాయి. కానీ అద్భుతమై పోషకాలతో నిండి వున్న మరో ఆకుకూర పొన్నగంటి కూర.
పొన్నగంటిలో బీ 6, సి, ఏ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇంకా రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, కాల్షియం కూడా మనకు అందుతాయి.
పొన్నగంటి కూరతో లాభాలు
రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. నిపుణుల ప్రకారం పురుషులకు ఎంతో మేలు చేస్తుంది. వారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. జీవక్రియలోని లోపాలను కూడా సరిచేస్తుంది.
కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది
బరువును నియంత్రిస్తుంది. గుండెకు, మెదడుపనితీరును మెరుగుపరుస్తుంది.
ఇందులోని కాల్షియం ఎముకలకు చాలా మంచిది. ఆస్టియోపోరోసిస్ వంటివాటిని కూడా పొన్నగంటి కూర దూరం చేస్తుంది
నరాల్లో నొప్పికి, వెన్ను నొప్పి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
తోటకూర వేపుడు లాగా చేసుకోవచ్చు. లేదంటే పప్పుతో కలిపి చేసుకోవచ్చు.
శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతుంది
గౌట్ వ్యాధి, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి.
పెరట్లో పెంచుకోవడం ఇది కూడా చాలా సులభం. చిన్న చిన్నకుండీలలో ఈజీగా పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment