యూరిక్‌ యాసిడ్‌ పెరిగితే... | Uric acid increases | Sakshi
Sakshi News home page

యూరిక్‌ యాసిడ్‌ పెరిగితే...

Published Sun, Apr 23 2017 11:39 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM

యూరిక్‌ యాసిడ్‌ పెరిగితే... - Sakshi

యూరిక్‌ యాసిడ్‌ పెరిగితే...

హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 49 ఏళ్లు. కొద్దిరోజుల క్రితం ఉన్నట్టుండి కాలి బొటనవేలు వాచిపోయి, విపరీతమైన సలపరంతో కూడిన నొప్పి వచ్చింది. కాలిలో చిన్నపాటి కదలిక కూడా ఎంతో కష్టంగా అనిపించింది. వైద్యుడిని సంప్రదిస్తే గౌట్‌ అని చెప్పారు. మందులు వాడినప్పటికీ పూర్తిగా తగ్గలేదు. రక్తంలో ‘యూరిక్‌ యాసిడ్‌’ స్థాయులు అధికంగానే ఉన్నాయని రిపోర్టు వచ్చింది. నాకు పరిష్కారం లభించే అవకాశం ఉదా?
– సత్యనారాయణ, భీమవరం

 మన శరీరంలో యధావిధిగా జరిగే ‘యూరిక్‌ యాసిడ్‌’ జీవక్రియలు సరిగా లేనందువల్ల గౌట్‌ వ్యాధి వస్తుంది. ఇది ఒక రకం కీళ్లవ్యాధి. ఈ వ్యాధి నుంచి బయటపడటానికి ఆహారంలో మార్పులు, వ్యాయామాలు చేసినప్పటికీ రక్తంలోని యూరిక్‌ యాసిడ్‌ పాళ్లు సాధారణ స్థితికి చేరుకోకపోతే... వ్యాధి మళ్లీ మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది.

మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్స్‌ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుకుంటుంది. ఇలా చేరిన యూరిక్‌ యాసిడ్‌ స్ఫటికాలుగా కీళ్లలోనూ, కీళ్ల చుట్టూ ఉండే కణజాలంలో చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితే ‘గౌట్‌’.

కారణాలు : ∙రక్తంలోని యూరిక్‌ యాసిడ్‌ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి పెరిగినా, విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం (మాంసం, గుడ్లు, చేపలు) ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. ∙కొన్ని కిడ్నీ వ్యాధుల వల్ల కూడా గౌట్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

నివారణ / జాగ్రత్తలు : ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్‌ వంటివి తీసుకోకూడదు. అలాగే లివర్, కిడ్నీ, ఎముక మూలుగు, పేగులను తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగులు తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానాలి.

చికిత్స : హోమియో వైద్యవిధానంలో అధునాతనమైన కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స ద్వారా గౌట్‌ వ్యాధిని శాశ్వతంగా నయం చేయవచ్చు.

డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌
సీఎండ్‌డి హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement