హోమియో కౌన్సెలింగ్
వాన జబ్బులకు చికిత్స సాధ్యమే!
వర్షాకాలం వచ్చిందంటే మనసుకు బాగా ఉంటుంది. కానీ శారీరకంగా అనేక సమస్యలు వస్తున్నాయి. జలుబు, దగ్గు, ఆస్తమా వదలడం లేదు. బయటకు వెళ్లాలంటేనే ఆందోళనగా ఉంటుంది. వర్షాకాలం, చలికాలం ఈ బాధలు భరించాల్సిందేనా?
– వేణు, ఒంగోలు
వర్షాకాలం పచ్చదనాన్ని, చల్లటి వాతావరణాన్ని తెచ్చి వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే ఈ కాలం పలు రకాల వ్యాధులనూ ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా, ఇంటి కీటకాలు, ఫంగస్ పెరుగుదలకు వర్షాకాలం అనువుగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఆస్తమా, అలర్జీ, బ్రాంకైటిస్, ఫ్లూ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి.
అలర్జిక్ రైనైటిస్ : వరస తుమ్ములతో ముక్కు కారడం, కళ్లు–ముక్కు దురదగా ఉండటం కనిపిస్తుంది.
అలర్జీ : సాధారణంగా జలుబు లక్షణాలు నిర్ణీత కాలానికి మించి కొనసాగుతూ ఉంటే దాన్ని అలర్జీగా పరిగణించవచ్చు. అయితే కొందరిలో పొగ, దుమ్ము, ధూళి, కాలుష్యాల వంటివి అలర్జీని ప్రేరేపిస్తాయి. అప్పుడు సాధారణ జలుబు సమయంలో కనిపించే లక్షణాలు కనిపిస్తాయి.
ఆస్తమా : ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది ఊపిరితిత్తుల్లోని వాయునాళాల్లో వచ్చే సమస్య. ఇది తేమ వాతావరణంలో ఉండే పుప్పొడి వంటి అలర్జెన్ల కారణంగా వస్తుంది. ఇది వచ్చిన వారిలో పిల్లికూతలు, ఛాతీ పట్టేయడం, రాత్రిపూట దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
జాగ్రత్తలు : పై సమస్యలు ఉన్నవారు చాలాకాలంగా లోపల దాచి ఉంచిన ఉన్ని దుస్తులు ధరించే ముందు కాసేపు ఎండలో ఉంచాలి. చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. కూల్‌డ్రింక్స్, చల్లటి పానీయాలు తీసుకోకూడదు. తమ సమస్యను ప్రేరేపించే అంశాల నుంచి దూరంగా ఉండాలి.
చికిత్స : అలర్జిక్ రైనైటిస్, అలర్జీలు, ఆస్తమా వంటివి వచ్చిన వారికి ఎప్పటికీ తగ్గదని చాలామంది అనుకుంటుంటారు. అయితే అది నిజం కాదు. జీవనశైలిని మార్చుకొని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, హోమియోలో ఆర్సినిక్ ఆల్బ్, ఇపికాక్, నేట్రమ్‌సల్ఫ్, కాలీ కార్బ్, స్పంజియా వంటి మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడితే పైన పేర్కొన్న అన్ని సమస్యలనూ శాశ్వతంగా నయం చేయవచ్చు.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్
ఇంత చిన్న వయసులో డయాబెటిసా?
హోమియో కౌన్సెలింగ్
మా అబ్బాయికి 12 ఏళ్లు. టైప్–1 డయాబెటిస్ అంటున్నారు. ఇంత చిన్న వయసులో డయాబెటిస్ వస్తుందా? దీని గురించి వివరించి, మావాడు పాటించాల్సిన ఆహార నియమాలు వివరించండి.– సుకుమార్, రాజమండ్రి
15 ఏళ్ల లోపు వారిలో వచ్చే చక్కెరవ్యాధిని టైప్–1 డయాబెటిస్ అంటారు. టైప్–1 డయాబెటిస్ అంటే క్లోమగ్రంథి పనిచేయదు. వీరికి వైద్యం ఇన్సులిన్ మాత్రలతో ఆరంభించి, ఇంజెక్షన్‌లు ఇస్తుంటారు.
ఆహారనియమాలు :పిల్లల్లో ఎలాంటి ఆహార నియమాలు వద్దు. ∙లావుగా ఉంటేనే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. జంక్‌ఫుడ్ తగ్గించుకోవాలి. ఇన్సులిన్ నిరోధకత రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచుతుంది కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించుకోవాలి. ∙5 – 15 ఏళ్ల వసువారికి ఎలాంటి ఆహారనియమాలు పెట్టకూడదు. వారి ఎదుగుదల కోసం వాళ్ల బరువుకు తగినట్లు ఎన్ని క్యాలరీలు అవసరమవుతాయో డైటీషియన్‌ను సంప్రదించి వారు చెప్పినట్లు పాటించాలి. త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలను వాడాలి. పిజ్జా, బర్గర్, ఐస్‌క్రీమ్స్, నూడుల్స్, బిస్కెట్లు వాడకూడదు. ∙ఆహారం విషయంలో ఆంక్షలు విధించడం, ఆహారాన్ని తగ్గించి, వ్యాయామాలను పెంచడం మంచిది కాదు. పిల్లల్లో అసలే తక్కువగా ఉండే రోగనిరోధకశక్తి... మరింతగా తగ్గిపోయి క్షయవ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది.
జాగ్రత్తలివే... సాధారణ సమయంలో రక్తంలో గ్లూకోజ్ పాళ్లు 140కి మించకుండా చూసుకోవాలి. మరీ బరువుంటే తప్ప బరువును తగ్గించే ప్రయత్నం చేయకూడదు. 5 నుంచి 15 ఏళ్ల వయసు చాలా కీలకం. పిల్లల వేళ్ల మధ్య, జననాంగాల వద్ద తేమ లేకుండా, ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చూసుకోవాలి. పిల్లలకు మధుమేహం వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి మధుమేహాన్ని అదుపులో పెట్టుకుంటే సాధారణ వ్యక్తుల కంటే కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు.
హోమియో వైద్యవిధానంలో చికిత్స : హోమియోలో టైప్–1కు అద్భుతమైన వైద్యచికిత్స ఉంది. ఇన్సులిన్‌తోపాటు హోమియో మందులు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఎదుగుదలలోపాన్ని, సోమరితనం, అతిమూత్రం లాంటి లక్షణాలను నయం చేయవచ్చు. ఇది పూర్తిగా సురక్షితం, దుష్పరిణామాలు ఉండవు.
- డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్
పైల్స్, ఫిస్టులా, ఫిషర్ సమస్యలు తగ్గుతాయి...
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 37. బాగా ముక్కి ముక్కి మలవిసర్జన చేయాల్సి వస్తోంది. అలాంటి సమయాల్లో మలద్వారం వద్ద ఇబ్బందిగా ఉంటోంది.
– మోహన్‌రావు, కాకినాడ
మీ ప్రశ్నలో మీరు పైల్స్, ఫిషర్ లేదా ఫిస్టులా సమస్యల్లో దేనితో బాధపడుతున్నారన్న స్పష్టత లేదు. అయితే ఈ మూడు సమస్యల్లోనూ మలబద్దకం వచ్చి, మలవిసర్జన సాఫీగా జరగదు. పైల్స్‌ను వాడుకలో మొలలు అంటారు. మలద్వారం వద్ద ఉండే సిరలు ఉబ్బడం వల్ల ఈ సమస్య వస్తుంది. పీచుపదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. తద్వారా కలిగే ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే సిరలు ఉబ్బుతాయి. పైల్స్ ఉన్నవారిలో నొప్పి, కొందరిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం, మలద్వారం వద్ద ఏదో అడ్డంకి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారిలో మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడం జరుగుతుంది.
దీనికి ప్రధాన కారణం మలబద్దకం వల్ల మలం బయటకు రావడానికి అధికంగా ముక్కడం. యానల్ ఫిషర్‌లో ప్రధానమైన లక్షణం మలం బయటకు వచ్చేటప్పుడు నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇక యానల్ ఫిస్టులా అనేది మలద్వార భాగానికీ, చర్మానికీ మధ్యలో ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడటం. విసర్జన సమయంలో కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. ఆ కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి తొలిచేస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడుతుంది. మలద్వారం వద్దగల చర్మంపై ఇది ఒక చీముతో కూడిన గడ్డలాగా కనపడుతుంది. దీన్ని చీముగడ్డగా భావించి చికిత్స చేయడం వల్ల పైన చర్మం మీద ఉన్న గడ్డ నయమవుతుంది. కానీ లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉంటుంది. అందుకే ఈ సమస్య తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంది. యానల్ ఫిస్టులాలో కనపడే ప్రధాన లక్షణం మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దీనితో పాటు అక్కడ ఏర్పడ్డ రంధ్రం నుంచి చీముతో కూడిన రక్తం బయటకు వస్తుంటుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా... ఈ మూడు సమస్యలకూ హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయి. రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు ఇస్తారు.
- డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
వాన జబ్బులకు చికిత్స సాధ్యమే!
Published Thu, Jun 22 2017 1:01 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM
Advertisement
Advertisement