baby girl dies
-
మద్యం మత్తులో కన్నబిడ్డ హత్య
విజయనగరం క్రైమ్: మద్యం మత్తులో కన్నబిడ్డను చంపేసుకున్నారు ఆ కసాయి తల్లిదండ్రులు. ఈ ఘటన స్థానిక మయూరీ కూడలి వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు ఆదివారం వివరాలు వెల్లడించారు. స్థానిక మయూరి కూడలి వద్ద భిక్షాటన చేస్తూ ఐదేళ్లుగా సహజీవనం సాగిస్తున్న గాయత్రీదాస్, అలోక్ దాస్‌కు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దపాపకు రెండేళ్లు, చిన్నపాపకు నెలన్నర రోజులు. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని భార్యాభర్తలు గొడవపడేవారు. ఎప్పటిలాగే శనివారం అర్ధరాత్రి తరువాత మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఆ తగాదాలోనే తల్లి చేతిలో ఉన్న చిన్న పాపను లాగడంతో గట్టిగా దెబ్బలు తగిలాయి. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రభుత్వాస్పత్రికి పాపను తీసుకువెళ్లగా.. అక్కడ వైద్యులు పాప మృతి చెందిందని చెప్పారు. దీంతో పాప మృతదేహాన్ని రైల్వేస్టేషన్ రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో కంకరపిక్క, క్రషర్ బుగ్గిలో రెండు అడుగుల లోతు గొయ్యి తీసి కప్పేశాడు. అనంతరం మయూరీ కూడలి వద్ద బిడ్డను నువ్వే చంపేశావంటే నువ్వే చంపేశావని ట్రాఫిక్ కానిస్టేబుల్ వద్ద వాదులాడుకున్నారు. వెంటనే ఆయన వన్‌టౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన వన్‌టౌన్ సీఐ వెంకటరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసిన కారు..
సాక్షి, మెదక్: నిర్లక్ష్యపు డ్రైవింగ్ నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాబు–నవ్య దంపతుల ఏకైక కుమార్తె కీర్తన (4) అంగన్వాడీ సెంటర్‌కు వెళ్తుంది. ఆదివారం సాయంత్రం గ్రామంలో ఆడుకుంటూ రోడ్డుదాటే ప్రయత్నం చేసింది. అదే గ్రామంలోని ఓ రైస్ మిల్ యజమాని కుమారుడు కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ చిన్నారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కీర్తన రక్తపుమడుగులో కొట్టుమిట్టాడి అక్కడే చనిపోయింది. కారు డ్రైవర్ ప్రమాదస్థలం నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకున్నారు. అదే కారులో చిన్నారిని మెదక్ పట్టణంలోని ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఈ విషయమై ఇంకా ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్ఐ మురళీ తెలిపారు. చదవండి: ‘సారీ.. అన్నయ్య మిస్ యూ’.. అంటూ మెసెజ్ పెట్టి.. -
9 నెలల చిన్నారిని బలి తీసుకున్న చైన్ స్నాచర్
-
చిన్నారిని బలితీసుకున్న చైన్ స్నాచర్.. నీటి సంపులో పడేయడంతో..
సాక్షి, జనగామ జిల్లా: పాప వయస్సు ఏడాది.. అయినా బోర్లా పడరాదు..చేతులతో ముందుకు కదలలేదు.. ఆస్పత్రులకు వెళితే బాగయ్యే పరిస్థితి లేదన్నారు.. ఒకవైపు మూడేళ్ల కొడుక్కి ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడం, చిన్నారి పరిస్థితిలో తీవ్ర మనోవేదనకు గురైన కన్న తల్లే చిన్నబిడ్డను నీటి సంప్‌లో వేసి చంపేసింది. ‘అయ్యో దొంగోడొచ్చాడు.. నా మెడలో పుస్తెల తాడు లాక్కోబోయాడు.. అడ్డుకున్నందుకు చంటి పాపను సంపులో వేసి చంపేశాడంటూ దొంగేడుపుతో అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు జైలు పాలయింది. అప్పటివరకు తన కూతురును ఎత్తుకుని ఆడించిన తండ్రి.. హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్లిన అరగంటకే ఫోన్లో ఆమె మరణ వార్త తెలియడంతో అక్కడే కుప్పకూలి పోయాడు. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌లో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొడుక్కి ఓపెన్ హార్ట్.. కూతురు కదల్లేని స్థితి జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన నడిగోటి భాస్కర్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా పొద్దుటూరు గ్రామానికి చెందిన ప్రసన్నతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.. మూడేళ్ల నవనీత్, తేజస్వి (12 నెలలు) ఉన్నారు. హెయిర్ కటింగ్ సెలూన్ నడిపించే భాస్కర్, బతుకు దెరువు కోసం జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌కు మకాం మార్చాడు. అనారోగ్యానికి గురైన నవనీత్‌కు ఇటీవలే ఓపెన్ హార్టు సర్జరీ చేయించగా, రూ.8 లక్షల వరకు ఖర్చయింది. తేజస్వి కూడా సరైన ఎదుగుదల లేక సరిగ్గా కదలలేని స్థితిలో ఉండేది. దీంతో అనేక ఆస్పత్రులకు తిప్పారు. లక్షల రూపాయలు ఖర్చు చేసినా, బాగయ్యే పరిస్థితి లేదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ప్రసన్న తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది. కూతురు హత్యకు ముందే ప్లాన్ సోమవారం వీరితోనే ఉంటున్న అత్త, మామ, మరిది వేరే ఊరికి వెళ్లారు. ఉదయం 10.30 గంటలకు భాస్కర్ హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్లగా, ప్రసన్న ఇంటి గేటుకు తాళం వేసుకుని లోపలే ఉండి పోయింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కూతుర్ని చంపాలని నిర్ణయించుకుంది. ఇంటి బయట నీటి సంప్‌లో పడేసింది. చనిపోయిన తర్వాత బయటకు తీసి అరుపులు, కేకలతో ఏడుపు మొదలుపెట్టింది. అటుగా బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రావడంతో అతనికి చైన్ స్నాచింగ్ కథ విని్పంచింది. అతనితో కలిసి బైక్‌పై ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ నుంచి చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌కు తరలించారు. చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి ఉంచి ఆమెతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ‘గోడ మీదుగా హెల్మెట్ ధరించిన దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి, మెడలోని పుస్తెల తాడు బ్లేడ్‌తో తెగ్గొట్టే ప్రయత్నం చేశాడని పోలీసులకు, చుట్టుపక్కల వారికి ప్రసన్న చెప్పుకొచి్చంది. తాను అతనితో పెనులాడడానని, దుండగుడు రెండు ముక్కలైన పుస్తెల తాడు తీసుకుని, మరో వైపు పసిపాపను లాక్కుని, ఇంటి ఆవరణలో ఉన్న సంపులో వేసి, గోడ దూకి పారిపోయాడంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే అక్కడ ప్రసన్న చెబుతున్నట్టుగా సీన్ కనిపించకపోవడంతో అనుమానించిన ఏసీపీ జి.క్రిష్ణ, సీఐ ఇ.శ్రీనివాస్ భార్యాభర్తలను స్టేషన్‌కు తీసుకుని వెళ్లి ప్రసన్నను తమదైన శైలిలో విచారించారు. తానే పాపను హత్య చేసినట్లు ఆమె నోటితోనే చెప్పించారు. ఆ మేరకు భర్త ఇచి్చన ఫిర్యాదుతో హత్యా నేరం కింద కేసు నమోదు చేసుకుని జైలుకు పంపించారు. తల్లి డ్రామా బట్టబయలైయింది : డీసీపీ ఈ కేసును పోలీసులు ఏడు గంటల్లోనే ఛేదించారు. కూతురును హత్య చేసి, చైన్‌స్నాచర్ చేతిలో హతమైనట్లుగా నమ్మించేందుకు ప్రయతి్నంచిన తల్లి నిజాన్ని ఒప్పుకుందని డీసీపీ పి.సీతారాం విలేకరులకు తెలిపారు. పాప అనారోగ్య సమస్యతో బాధపడుతుండడంతోనే హత్య చేసినట్లు ప్రసన్న అంగీకరిచిందని తెలిపారు. బతికినంత కాలం కూతురితో ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పిందన్నారు. పోలీసులను తప్పుదారి పట్టించడం కోసమే చైన్ స్నాచింగ్ డ్రామా చేసిందన్నారు. -
‘ఇప్పటికే ఇద్దరాడపిల్లల్ని కన్నాను’..! రోజుల పసికందును చంపిన తల్లి..
Mother Kills Her Baby: పుట్టి వారం రోజులైనా కాని పసికందును కన్నతల్లే కర్కశంగా చంపేసింది. ఈ హృదయవిదారక ఘటన తాడికొండ మండలం రావెల గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. దీనిపై ఏఎన్ఎం ఎం.స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కథనం ప్రకారం రావెలకు చెందిన బొంతా లక్ష్మి ఈనెల 2న గుంటూరు జీజీహెచ్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. గత సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఆ రోజు వైద్యసిబ్బంది పాపను పరిశీలించి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించారు. మంగళవారం పాప నోటి నుంచి నురగ వస్తోందని తల్లి బొంతా లక్ష్మి సమాచారమివ్వగా వైద్యసిబ్బంది వెళ్లి జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. సాయంత్రం మళ్లీ పాపను చూసేందుకు వెళ్లారు. దీంతో పాప చనిపోయిందని, ఖననం కూడా చేశామని తల్లి సమాధానమిచ్చింది. అనుమానమొచ్చిన ఏఎన్ఎం స్వప్న నిలదీయగా తనకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారని, మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో తానే పాప గొంతులో వేలుపెట్టి చంపేసినట్టు నేరం అంగీకరించింది. ఈ విషయం కాగితంపై రాసి సంతకం పెట్టిన లక్ష్మి దీని గురించి ఎవరికైనా చెబితే తన చావుకు ఏఎన్ఎం కారణమని పేరు రాసి చస్తానని బెదిరించినట్టు స్వప్న ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గ్రంధి వెంకటాద్రి తెలిపారు. చదవండి: Omicron Variant Symptoms In Telugu: కొత్తవేరియంట్ లక్షణాలు పూర్తిగా భిన్నమైనవి! -
ఆడపిల్ల పుట్టిందని.. కొడుకంటే ఇష్టం లేదని.. చంపేశారు..
సాక్షి,కాగజ్‌నగర్: కన్న ప్రేమ కనికరం చూపలేకపోయింది. కన్నతండ్రే కాల యముడయ్యాడు. ఆడపిల్లగా పుట్టినందుకు 40 రోజుల పసికందును బండరాయితో కొట్టి చంపేశాడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్ మండలం మారేపల్లి పంచాయతీ లైన్‌గూడ గ్రామానికి చెందిన మెస్రం బాపురావు–మానస దంపతులు వ్యవసాయ పనులు చేస్తుంటారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. మూడో సంతానంలోనూ ఆడపిల్ల పుట్టింది. భారంగా భావించిన బాపురావు తాగిన మైకంలో సోమవారం అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 40 రోజుల పసికందును తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకెళ్లి రోడ్డుపై పడేసి, బండతో మోది చంపేశాడు. భార్య వారిస్తున్నా వినకుండా ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంకా లోకం కూడా చూడని చిన్నారిని కిరాతకంగా హత్య చేశాడు. పక్కలోని బిడ్డను తీసుకెళ్లి తన కళ్లముందే చంపడంతో తల్లి కంటికి పుట్టెడుగా శోకిస్తోంది. కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు. నిందితుడిని అదుపులోనికి తీసుకున్నట్లు కాగజ్‌నగర్ రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. చదవండి: నయా ట్రెండ్: నోరూరిస్తున్న బిర్యానీ.. తింటే వదల‘మండీ’ ఆరేళ్ల బాలుడిని చితకబాది హతమార్చిన మారుతండ్రి పటాన్చెరు టౌన్: ఆరు సంవత్సరాల బాలుడిని మారు తండ్రి చితకబాదడంతో మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామానికి చెందిన నర్సింహులుకు 11 సంవత్సరాల క్రితం అరుణతో వివాహం జరిగింది. వీరికి జాన్‌పాల్, జస్వంత్, అరుణ్ (6) ముగ్గురు కుమారులు. కాగా నర్సింహులు మద్యానికి బానిసై సంవత్సరం క్రితం మృతి చెందాడు. అరుణ గద్వాలలో పనిచేస్తున్న సమయంలో వినయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నెలరోజుల క్రితం వినయ్, అరుణ మెదక్ చర్చిలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఇస్నాపూర్‌కు వచ్చి పద్మారావునగర్ కాలనీలో నివాసముంటున్నారు. చదవండి: బాలికపై టీఆర్ఎస్ సర్పంచ్ అత్యాచారం.. బాధితురాలికి బండి పరామర్శ అయితే వివాహం జరిగినప్పటి నుంచి వినయ్‌కు అరుణ్ అంటే ఇష్టం ఉండేది కాదు. చిన్నచిన్న విషయాలకు బాలుడిని కొట్టేవాడు. మంగళవారం కూడా అరుణ డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇంట్లోనే ఉన్న అరుణ్‌ని వినయ్ తీవ్రంగా కొట్టాడు. స్పృహ తప్పి పడిపోయిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అరుణ్ మృతిచెందినట్లు తెలిపారు. దీంతో బాలుడిని ఇంట్లో పడుకోబెట్టి వినయ్ పారిపోయాడు. డ్యూటీనుంచి తిరిగొచ్చిన తల్లికి కుమారుడు మృతిచెంది కనిపించాడు. అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యో దేవుడా: పాప ప్రాణం కోసం తండ్రి ఆరాటం..
లక్నో: ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ మంచం మీద నుంచి కిందపడడంతో అత్యవసర చికిత్స కోసం తల్లిదండ్రులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యం చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. వైద్యులు చేయకున్నా తన బంగారాన్ని కాపాడుకునేందుకు ఆ తండ్రే తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఎలాగైనా బతికించుకోవాలని కూతురికి నోటిలో నోరు పెట్టి శ్వాస అందించేందుకు ప్రయత్నించాడు. కానీ చివరకు ఆ చిన్నారి ప్రాణాలు దక్కలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పాప ప్రాణం నిలిపేందుకు ఆ తండ్రి పడుతున్న కష్టాలు చూస్తుంటే కళ్లు చెమరుస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాకు చెందిన గౌస్పూర్కు చెందిన ఓ తండ్రి తన కూతురు మంచం పైనుంచి కిందపడిందని ఐదేళ్ల చిన్నారిని ఆస్పత్రికి తీసుకొచ్చాడు. బరాబంకిలోని ఆస్పత్రి వైద్యులు చికిత్స చేసేందుకు వెనకడుగు వేశారు. దీంతో కొన ప్రాణంతో ఉన్న తన కూతురిని బతికించేందుకు ఆ తండ్రి నోటితో శ్వాస అందించాడు. పలుమార్లు నోటితో పాప నోట్లో ఊది బతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అనంతరం ఊపిరితిత్తులను పలుమార్లు మెల్లగా నొక్కాడు. అయినా అతడి ప్రయత్నాలు ఫలించలేదు. పాప కన్నుమూసింది. వైద్యుల తీరుపై ఆ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతోపాటు ఈ సన్నివేశాన్ని సెల్ఫోన్లలో వీడియోలు తీయడంపై మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాల కోసం ఈ వార్త చదవండి: నా కూతురు చనిపోయింది సార్, మీకు డ్రామాలా ఉందా? -
వైరల్ వీడియో: పాప ప్రాణం కోసం నోటితో తండ్రి ఆరాటం..
-
అయ్యో నా కూతురు చనిపోయింది సార్, మీకు డ్రామాలా ఉందా?
లక్నో:దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కారణంగా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు సాహసం చేయడం లేదు.దీంతో పలువురు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ ఐదేళ్ల చిన్నారికి కరోనా సోకిందనే అనుమానంతో ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు చికిత్స చేయలేదు. సకాలంలో ట్రీట్మెంట్ చేయకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర్ ప్రదేశ్ బారాబంకి జిల్లాకు చెందిన గౌస్పూర్లో ఓ ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ మంచం మీద నుంచి కిందపడింది. అయితే అత్యవసర చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు చిన్నారిని గౌస్ పూర్‌కు చెందిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ చిన్నారికి వైద్యం చేసేందుకు డాక్టర్లు ముందుకు రాలేదు. చివరికి రెండు గంటల తర్వాత చనిపోయింది. దీంతో డాక్టర్లు తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలి తండ్రి మృతదేహంతో ఆస్పత్రి ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ హృదయ విదారకర దృశ్యాల్ని స్థానికులు వీడియోలు తీయడంతో ఈ విషాదం చర్చనీయంగా మారింది. డాక్టర్లుపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపించాయి.అయితే చిన్నారి మరణంపై బారాబంకి చీఫ్ మెడికల్ ఆఫీసర్ బికెఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. చిన్నారి మంచం పై నుంచి కింద పడిందని తల్లిదండ్రులు చెప్పారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన వెంటనే పారామెడికల్ సిబ్బంది, డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి మార్గం మధ్యలోనే చనిపోయినట్లు నిర్ధారించారు. ఆమె తండ్రి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. వైద్యులు తీరు ఎలా ఉందో చూడండి? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చిన్నారి మృతదేహంతో విలపిస్తున్న తండ్రి.. చూడండి సార్. కరోనా బాధితుల్ని తాకేందుకు ఎవరు ఇష్టపడడం లేదు. రెండుగంటల పాటు నా కుమార్తెకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు ముందుకు రాలేదు. ఈ డాక్టర్లు తీరుతో నా పాప చనిపోయిందని వాపోయాడు. నా బిడ్డ చనిపోయింది సహనంతో ఉండాలా? డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తండ్రిని ఓదార్చేందుకు స్థానికులు ప్రయత్నించారు. మీరు కొంచెం సహనంతో ఉండాలని సముదాయిస్తుంటే నా బిడ్డ చనిపోయింది. నేను సహనంతో ఉండాలా? అని ప్రశ్నించాడు. ఇది మీకు డ్రామాలా ఉందా? అదే ఆస్పత్రి భయట ఆందోళన చేస్తున్నచిన్నారి తండ్రిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఏం డ్రామాలు చేస్తున్నావా అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో సార్ ఇది మీకు డ్రామాలా కనిపిస్తుందా? నా కూతురు చనిపోయింది సార్ అంటూ కన్నీటి పర్యంతరమయ్యాడు. చేసేది లేక అధికారులపై చర్యలు తీసుకుంటాం. మీరు స్టేషన్ లో ఫిర్యాదు చేయండని పోలీసులు చెప్పడం పై స్థానికులు మండిపడుతున్నారు. చదవండి : షాకింగ్: ఇంట్లో పాములు.. అద్దెకే దిక్కులేదన్న ఓనర్! -
గుట్టచప్పుడు కాకుండా పసి బిడ్డ ఊపిరి తీసి, ఆపై
సాక్షి, చెన్నై: మూడో సారి కూడా ఆడబిడ్డే పుట్టడం ఓ కుటుంబానికి భారమైనట్టుంది. గుట్టుచప్పుడు కాకుండా ఊపిరి ఆడకుండా చేసి ఆ బిడ్డను మట్టుబెట్టి, అనారోగ్యం అంటూ నాటకం ఆడారు. చివరకు పోస్టుమార్టం నివేదికతో బుక్కయ్యారు. మదురై ఉసిలంపట్టికి చెందిన చిన్నస్వామి, శివప్రియ దంపతులకు ఐదేళ్లు, రెండేళ్ల కుమార్తెలు ఉన్నారు. గతవారం మూడోసారిగా ఆడబిడ్డకు శివప్రియ జన్మనిచ్చింది. పుట్టి ఏడు రోజులు అవుతున్న ఆ బిడ్డ గురువారం హఠాత్తుగా అనారోగ్య బారిన పడ్డట్టు ఆ కుటుంబం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శిశువును పరిశీలించిన వైద్యు లు అప్పటికే మరణించినట్టు తేల్చారు. అయితే, ఆ కుటుంబం తీరు అనుమానాలకు తావివ్వడమే కాకుండా, ఆ శిశువు చెవి భాగంలో చిన్న పాటి గాయం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఉసిలంపట్టి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఊపి రాడకుండా చేసి ఉండడం వెలుగు చూసింది. మూడోసారి కూడా ఆడబిడ్డే పుట్టిందన్న ఆగ్రహంతో ఆకుటుంబానికి చెందిన వారే ఈ కిరాతకానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చా రు. పోలీసులు, శిశువు తల్లిదండ్రులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: చిన్నారి రుద్రమణి.. ఎట్టకేలకు మాలేగావ్ సమీపంలో చదవండి: ఆన్లైన్లో కొనుగోలు చేసిన బొమ్మ తుపాకీ -
9 నెలల పసికందు పై అత్యాచారయత్నం
-
తండ్రి లెంపకాయతో కూతురి మరణం
ఎంత చెప్పినా ఏడుపు ఆపట్లేదని ఓ తండ్రి తన కూతురిని లెంపకాయ కొట్టేసరికి.. ఆ చిన్నారి కాస్తా ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన జంషెడ్పూర్ స్టీల్ సిటీ శివార్లలోని నయాబస్తీ ప్రాంతంలో జరిగింది. మురళీ పాత్రా రోజు కూలీగా పనిచేస్తుంటాడు. అతడికి మూడున్నరేళ్ల వయసున్న కూతురు ఉంది. ఆమె ఏడుస్తుండగా సముదాయించడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. ఎంతకూ ఆ చిన్నారి ఏడుపు మానకపోవడంతో.. బాగా కోపం వచ్చిన పాత్రా.. లాగి లెంప మీద కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే టాటా ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారు. తన భర్త తన కూతురిని తరచు కొట్టేవాడని, ఈసారి బాగా బలంగా కొట్టడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో మురళీ పాత్రాను పోలీసులు అరెస్టు చేశారు.