సాక్షి, చెన్నై: మూడో సారి కూడా ఆడబిడ్డే పుట్టడం ఓ కుటుంబానికి భారమైనట్టుంది. గుట్టుచప్పుడు కాకుండా ఊపిరి ఆడకుండా చేసి ఆ బిడ్డను మట్టుబెట్టి, అనారోగ్యం అంటూ నాటకం ఆడారు. చివరకు పోస్టుమార్టం నివేదికతో బుక్కయ్యారు. మదురై ఉసిలంపట్టికి చెందిన చిన్నస్వామి, శివప్రియ దంపతులకు ఐదేళ్లు, రెండేళ్ల కుమార్తెలు ఉన్నారు. గతవారం మూడోసారిగా ఆడబిడ్డకు శివప్రియ జన్మనిచ్చింది. పుట్టి ఏడు రోజులు అవుతున్న ఆ బిడ్డ గురువారం హఠాత్తుగా అనారోగ్య బారిన పడ్డట్టు ఆ కుటుంబం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
శిశువును పరిశీలించిన వైద్యు లు అప్పటికే మరణించినట్టు తేల్చారు. అయితే, ఆ కుటుంబం తీరు అనుమానాలకు తావివ్వడమే కాకుండా, ఆ శిశువు చెవి భాగంలో చిన్న పాటి గాయం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఉసిలంపట్టి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఊపి రాడకుండా చేసి ఉండడం వెలుగు చూసింది. మూడోసారి కూడా ఆడబిడ్డే పుట్టిందన్న ఆగ్రహంతో ఆకుటుంబానికి చెందిన వారే ఈ కిరాతకానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చా రు. పోలీసులు, శిశువు తల్లిదండ్రులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: చిన్నారి రుద్రమణి.. ఎట్టకేలకు మాలేగావ్ సమీపంలో
చదవండి: ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన బొమ్మ తుపాకీ
Comments
Please login to add a commentAdd a comment