తండ్రి లెంపకాయతో కూతురి మరణం | A baby girl dies after being slapped by father | Sakshi
Sakshi News home page

తండ్రి లెంపకాయతో కూతురి మరణం

Published Mon, Aug 17 2015 5:01 PM | Last Updated on Thu, Aug 16 2018 4:30 PM

తండ్రి లెంపకాయతో కూతురి మరణం - Sakshi

తండ్రి లెంపకాయతో కూతురి మరణం

ఎంత చెప్పినా ఏడుపు ఆపట్లేదని ఓ తండ్రి తన కూతురిని లెంపకాయ కొట్టేసరికి.. ఆ చిన్నారి కాస్తా ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన జంషెడ్పూర్ స్టీల్ సిటీ శివార్లలోని నయాబస్తీ ప్రాంతంలో జరిగింది. మురళీ పాత్రా రోజు కూలీగా పనిచేస్తుంటాడు. అతడికి మూడున్నరేళ్ల వయసున్న కూతురు ఉంది. ఆమె ఏడుస్తుండగా సముదాయించడానికి రకరకాలుగా ప్రయత్నించాడు.

ఎంతకూ ఆ చిన్నారి ఏడుపు మానకపోవడంతో.. బాగా కోపం వచ్చిన పాత్రా.. లాగి లెంప మీద కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే టాటా ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారు. తన భర్త తన కూతురిని తరచు కొట్టేవాడని, ఈసారి బాగా బలంగా కొట్టడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో మురళీ పాత్రాను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement