video shoot
-
సల్మాన్ ఖాన్ లుక్‌లో అర్ధ నగ్నంగా రైల్వే ట్రాక్ పై హల్చల్
ఇటీవలకాలంలో సోషల్ మీడియా స్టార్డమ్ కోసం పిచ్చిపిచ్చి వీడియోలు చేయడం ఎక్కువైపోయింది. సందేశాత్మకంగా లేకపోయినా పర్వాలేదు గానీ ఇబ్బంది పెట్టేవిగానూ, తప్పుదారి పట్టించేవిగానూ ఉండకూడదు. సోషల్ మాధ్యమాల్లో పెట్టే వీడియోలుకు కూడా కొన్నినిబంధనలు ఉంటాయి. చాలామంది వాటిని విస్మరించి అసభ్యకరంగా వీడియోలు షూట్ చేసి జైలు పాలవ్వుతున్నారు. అచ్చం అలానే చేసి ఇక్కడోక వ్యక్తి కూడా జైలు పాలయ్యాడు. వివరాల్లోకెళ్తే...లక్నోకి చెందిన అజమ్ అన్సారీ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేందుకని ఒక అసభ్యకరమైన వీడియో చేశాడు. అతను సల్మాన్‌ఖాన్ మాదిరి అర్ధ నగ్నంగా రెడీ అయ్యి రైల్వే ట్రాక్‌పై ఒక వీడియో షూట్ చేశాడు. ఆ వీడియోలో అతను రైల్వే ట్రాక్ పై పడుకుని సిగరెట్ తాగుతూ కనిపించాడు. పైగా ఈ వీడియోని సల్మాన్ చిత్రం తేరే నామ్లో హిట్ పాట తేరే నామ్ హమ్మే కియా హై అనే పాటతో రూపొందించాడు. దీంతో లక్నో రైల్వే పోలీసులు అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఐతే నిందితుడు పై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇలానే ఘంటాఘర్ వద్ద వీడియో తీసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: మితిమీరిన వర్క్ అవుట్...దెబ్బకు పుర్రెలో సగభాగం ఔట్!) -
తండ్రి కొడుకుల ఘాతుకం...మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి...
మైసూరు: మహిళ స్నానం చేస్తుండగా చాటుగా వీడియోలు తీసి తద్వారా బెదిరింపులకు పాల్పడతున్న తండ్రీ కొడుకుపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెబ్బాలలో సదరు మహిళ ఇంటి పక్కన ఉండే ప్రమోద్, అతని తండ్రి గోవిందరాజు నిందితులు. బాధితురాలి భర్త పనికి వెళ్ళిన సమయంలో ఇంటి ముందు బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో తండ్రీ కొడుకు కలిసి గుట్టుగా మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. దానిని ఆమె మొబైల్‌ఫోన్‌కు పంపి లైంగికంగా వేధించడంతో పాటు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయసాగారు. దీంతో బాధితురాలు, ఆమె భర్త హెబ్బాల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. (చదవండి: రక్షకుడే భక్షకుడై దారుణకాండ) -
డార్నెల్లా ఫ్రెజర్.. నిప్పులా ఉద్యమాన్ని రాజేసింది!
ధైర్యం ఏ రూపంలో ఉంటుంది? ఘనమా? ద్రవమా? వాయువా? శబ్దమా? నిశ్శబ్దమా? ఇవన్నీ కలిసిన రూపమా? అయితే ఆ రూపానికి డార్నెల్లా ఫ్రెజర్ అని పేరు పెట్టాలి. తెల్లజాతి పోలీసు మోకాలి కింద బిగుసుకుపోతున్న గొంతుతో ఊపిరందక 9 నిముషాల పాటు ‘ఐ కాంట్ బ్రీత్’ అని మూలుగుతూ గిలగిల కొట్టుకుంటున్న నల్లజాతి మనిషి జార్జి ఫ్లాయిడ్‌ను తన ఫోన్లో షూట్ చేసిన 17 ఏళ్ల నల్ల అమ్మాయే డార్నెల్లా ఫ్రెజర్. కళ్ల ముందరి ఘాతుకానికి ఆ అమ్మాయి హృదయం చెంపల మీదకు ద్రవీభవించింది. ఆవేదన ఆమె గుండెల్లో ఘనీభవించింది. గొంతులోంచి పోతున్నది తన ప్రాణవాయువే అని ఆమెకు అనిపించింది. శబ్దానికి ముందరి నిశ్శబ్దంలా ఇంటికి వెళ్లి ఆ రోజు అర్ధరాత్రి దాటాక ఆ వీడియోను ఫేస్బుక్ లో అప్ లోడ్ చేసింది డార్నెల్లా. మొన్న మంగళవారం ఆ వీడియో సాక్ష్యంతో కోర్టు ఆ పోలీసు అధికారిని దోషిగా నిర్ధారించింది. అతడికి 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఏడాదిగా జరుగుతున్న ఈ కేసు విచారణకు కీలక సాక్ష్యాన్ని అందజేసి నల్లజాతి ఉద్యమానికి మళ్లీ కాస్త ఊపిరి తెచ్చింది డార్నెల్లా ఫ్రెజర్. డార్నెల్లా ఫ్రేజర్ కనుక ఆ రోజు పాదరసంలా ఆలోచించి ఉండకపోతే డెరెక్ చావిన్ ఈరోజుకీ మినియాపొలిస్ పోలీస్ ఆఫీసర్‌గానే కొనసాగుతూ ఉండేవారు. ∙∙ ఈ స్టోరీ.. పై వాక్యంతో తప్ప ఇక ఎలానూ ప్రారంభం అవడానికి లేదు. సుమారు ఏడాదిగా అత్యున్నతస్థాయి పోలీస్ ఆఫీసర్ డెరెక్ చావిన్‌పై జరుగుతున్న విచారణ మంగళవారం ముగిసింది. కోర్టు అతడికి 40 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది! విచారణలో నల్లజాతి పౌరుడు జార్జి ఫ్లాయిడ్ దుర్మరణానికి ఈ తెల్ల పోలీసు కారణమైనట్లు నిరూపించే ఏ ఒక్క గట్టి సాక్ష్యాధారమూ లేకపోయింది. ఆఖరుగా మిగిలింది పద్దెనిమిదేళ్ల నల్లజాతి టీనేజర్ డార్నెల్లా ఫ్రేజర్ అప్రయత్నంగా తన సెల్ ఫోన్లోంచి ఆనాటి ఘటనను షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్! కోర్టు హాల్లో ఆ క్లిప్‌ను ప్రదర్శించారు. జార్జి ఫ్లాయిడ్ గొంతును మోకాలితో తొక్కుతున్నప్పుడు తన సెల్‌ఫోన్ లోంచి షూట్ చేస్తున్న డార్లెల్లా, ఆమె కజిన్ (కుడి వైపు నుంచి మూడు, రెండు స్థానాల్లో). సీసీ ఫుటేజ్ అందులో డెరెక్ చావిన్ తొమ్మిది నిముషాల పాటు జార్జి ఫ్లాయిడ్ గొంతు మీద మోకాలిని అదిమిపట్టి ఉంచడం డార్నెల్లా తీసిన పది నిముషాల వీడియోలో మొత్తం రికార్డయి ఉంది. డార్నెల్లా వీడియో తీస్తున్నప్పటి వీడియో ఫుటేజ్‌ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకుని జడ్జి చూశారు. 2020 మే 25న ఆ ఘటన జరగడానికి కొద్ది నిముషాల ముందు వరకు జార్జి ఫ్లాయిడ్ ఎవరో, డార్నెల్లా ఫ్రేజర్ ఎవరో ప్రపంచానికి తెలియదు. ఒకరికొకరు కూడా తెలియని సాధారణ పౌరులు. ఆ సాయంత్రం.. మినియాపొలిస్ నగరంలోని చికాగో అవెన్యూలో.. 38వ వీధిలో ఉన్న ‘కప్ ఫుడ్స్’ షాపింగ్ మాల్కి తొమ్మిదేళ్ల వయసున్న తన కజిన్‌తో కలిసి వచ్చింది డార్నెల్లా. అక్కడికి దగ్గర్లోనే ఒక అపార్ట్మెంట్లో ఉంటారు వాళ్లు. వచ్చిన కొద్ది నిముషాలకు నలుగురు పోలీసులు ఒక నల్లజాతి వ్యక్తిని (జార్జి ఫ్లాయిడ్) పెడరెక్కలు విరిచి తీసుకెళ్లడం ఆ కూడలి లో ఉన్నవారు చూశారు. ఆ పోలీసులలో ఒకరైన డెరెక్ చావిన్.. జార్జి ఫ్లాయిడ్‌ని కింద పడేసి, అతడి గొంతుపై తన మోకాలును నొక్కిపెట్టాడు. అప్పుడు చూసింది డార్నెల్లా.. తనకు ఐదడుగుల దూరంలో ఆ దృశ్యాన్ని. జార్జి ఊపిరి అందక విలవిల్లాడుతున్నాడు. ‘ఐ కాంట్ బ్రీత్. లీవ్ మీ’ అంటున్నాడు. పోలీస్ ఆఫీసర్ వినడం లేదు. దారుణం అనిపించింది డార్నెల్లాకు. వెంటనే తన సెల్ ఫోన్ తీసి షూట్ చేయడం మొదలు పెట్టింది. జరుగుతున్న ఒక అన్యాయాన్ని మాత్రమే తను షూట్ చేస్తున్నానని అనుకుంది కానీ.. నల్లజాతిపై అమెరికన్ల జాత్యహంకారానికి వ్యతిరేకంగా అప్పటికే కొనసాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ అనే ఒక ఉద్యమానికి తనొక చోదకశక్తి కాబోతున్నానని అప్పుడు ఆమె అనుకోలేదు. చివరికి నేరస్థుడైన ఆ పోలీస్ ఆఫీసర్ కు శిక్ష పడేందుకు కూడా డార్నెల్లానే కారణం అయింది. అయితే కోర్టు తీర్పును డార్నెల్లా.. జార్జి ఫ్లాయిడ్‌కి జరిగిన న్యాయంగానే చూస్తోంది తప్ప, పోలీస్ ఆఫీసర్‌కు పడిన శిక్షగా కాదు. ‘‘థ్యాంక్యూ గాడ్. థ్యాంక్యూ థ్యాంక్యూ థ్యాంక్యూ. జార్జి ఫ్లాయిడ్.. నీకు న్యాయం జరిగింది’’ అని బుధవారం ఆమె తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. జార్జి ఫ్లాయిడ్‌ను మోకాలితో తొక్కుతున్న పోలీస్ అధికారి డెరెక్ చావిన్. ఇతడిపై నేరం రుజువైంది. ఏడాది క్రితం జార్జి ఫ్లాయిడ్ ఊపిరిపోతున్న క్షణాలను చిత్రీకరించిన రోజు డార్నెల్లాకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. బాగా పొద్దుపోయేవరకు మేల్కొని ఆలోచిస్తూనే ఉంది. ఆమె హృదయం ఆక్రోశిస్తోంది. ఆమె నేత్రాలు వర్షిస్తున్నాయి. ఆమె పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. పోలీసులైతే మాత్రం ఇంత అమానుషమా అనిపించింది. తను తీసిన వీడియోను ఏం చేయాలో తోచలేదు. కళ్ల ముందే ఒక మనిషి చనిపోవడాన్ని తీసిన వీడియో అది! అది తన దగ్గరుంది. కొన్ని గంటల మౌనం తర్వాత ఫేస్ బుక్ ఓపెన్ చేసి వీడియోను అప్లోడ్ చేసింది. ‘‘ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను’’ అని రెండు ముక్కలు రాసింది. కొన్నాళ్ల వరకు ఆ వీడియోను ఎవరూ నమ్మలేదు. జార్జి ఫ్లాయిడ్ మరణానంతరం నల్లజాతి ఉద్యమకారులు ఆయనపై వేసిన పోస్టర్లలో ఒకటి. అది నిజం అని తెలిశాక ఒక్కసారిగా ప్రఖ్యాత అమెరికన్ న్యూస్ చానళ్లు సి.ఎన్.ఎన్., ఎ.బి.సి., ఫాక్స్, ఎన్.బి.సి., సి.బి.ఎస్. డార్నెల్లా కోసం వచ్చాయి. ఆ వీడియో రేపిన భావోద్వేగాలు అమెరికాలోని యాభై నగరాలలో, ప్రపంచ దేశాలలో జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి ఆజ్యం అయ్యాయి. ఐక్యరాజ్య సమితి సైతం జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతాన్ని నిరాకరించ తగని, నిర్లక్ష్యం చేయకూడని పరిణామంగా పరిగణించింది. నల్లజాతి ఉద్యమ భాషలో నిప్పు రవ్వ అని జార్జి ఫ్లాయిడ్ ను అంటున్నాం కానీ.. నిప్పులా ఉద్యమాన్ని రాజేసింది మాత్రం డార్నెల్లా ప్రేజరేనన్నది కాదనలేని సత్యం. లేత మనసుకు అయిన గాయం కన్నీటిగా ఉబికి, జ్వలించింది. ఉద్యమజ్వాల అయింది. తాజాగా కోర్టు తీర్పు రాగానే అమెరికా అధ్యక్షుడు జార్జి బైడెన్ ‘బ్రేవ్ యంగ్ ఉమన్’ అని డార్నెల్లాను అభినందించారు! -
కోడలు ఉరేసుకుంటుంటే అత్తమామలు వీడియో తీస్తూ..
లక్నో: కోడలు తమ కళ్ల ముందే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుటుంటే రక్షించడం మానేసి కిటికీలోంచి వీడియో తీశారు ఓ రాక్షస అత్త మామలు. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్లో జరిగింది. బాధితురాలు కోమల్.. డాటియానా గ్రామంలో భర్త ఆశిష్, అత్తమామలతో కలిసి ఉంటోంది. అత్తమామల వేధింపులు భరించలేక మనస్తాపంతో గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. అయితే కోడలు మృతికి తమకు సంబంధం లేదని, చెప్పుకునేందుకే నిందితులు ఆమె ఉరి వేసుకుంటున్న దృశ్యాలను తమ సెల్లో బంధించారు. ఈ వీడియో కాస్త బయటికి రావడం, వైరల్ కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కోమల్‌కు, ఆశిష్‌కు 2019లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కోమల్ తల్లిదండ్రులు 5 లక్షలు డబ్బు, ఒక బైక్‌ని కట్నం కింద ఇచ్చారు. గత ఆరు నెలలుగా ఆశిష్ అమ్మానాన్నలు అదనపు కట్నం కావాలని, లేదంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోమల్ని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. భర్త కూడా తల్లిదండ్రులకే వత్తాసు పలికాడు. వారి పోరు తట్టుకోలేని కోమల్ ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ ఊరి పెద్దలు నచ్చజెప్పడంతో ఇటీవల తిరిగి తన అత్తవారింటికి వచ్చింది. అయితే అత్తమామలు మళ్లీ తనని వేధించడం మొదలు పెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని ఆదివారం ఈ దారుణానికి పాల్పడింది. ( చదవండి: విజయవాడ: పురుగుల మందు తాగి తల్లీపిల్లలు మృతి ) -
వ్యాపారి ఆత్మహత్య.. సీఎం కేసీఆర్‌కు సందేశం
సాక్షి, కొత్తగూడెం : వ్యాపారంలో స్నేహితులు మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చుంచుపల్లి మండలం ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీకి చెందిన ఎండీ ముక్తార్(33) కొత్తగూడెం పట్టణం చిన్నబజార్లో సనా డిజైనర్ వస్త్ర దుకాణం, జమా మసీద్ కాంప్లెక్స్‌లో లేడీస్ దుస్తుల షాపు నడిపించేవాడు. గత ఏడాది భద్రాచలంలో స్నేహితులతో కలిసి మరో వస్త్ర దుకాణం ప్రారంభించాడు. వ్యాపారంలో స్నేహితుడు రమేష్‌తో పాటు మరికొందరు మిత్రులు మోసం చేశారు. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యమంత్రికి సందేశం.. ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వీడియో సందేశాన్ని రికార్డు చేసి పోస్టు చేశాడు. తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వీడియో పోస్ట్ చేశాడు. వ్యాపారంలో నష్టపోయిన తీరును వీడియోలో వివరించాడు. తాను స్థానిక ఎమ్మెల్యే అభిమానినని వీడియోలో తెలిపాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్
సాక్షి, విశాఖపట్నం : అతి పిన్న వయసులో పార్లమెంట్లో అడుగుపెట్టిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17న జరగనున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడైన శివప్రసాద్‌ను పెద్దల అంగీకారంతో విహహం చేసుకోబోతున్నారు. మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో ఈ వివాహ వేడుక జరగనుంది. రిసెప్షన్‌ను ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేయనున్నారు. గొలుగొండ మండలం కెడిపేట గ్రామానికి చెందిన శివప్రసాద్ బి.టెక్, ఎంబీఏ పూర్తిచేశారు. ప్రస్తుతం కరస్పాండెట్‌గా ఓ కాలేజ్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ పెళ్లికి ముందు తమ స్నేహాన్ని, ప్రేమను తెలియజేసేలా ఓ ప్రీ వెడ్డింగ్ వీడియో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రేమ ముందు అందరూ సమానమే అని ఈ వీడియో రుజువు అయింది. పాతికేళ్ల ప్రాయంలోనే మాధవి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నిక అయ్యారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి... ఈ ఎన్నికల్లో ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పిన కిశోర్‌చంద్రదేవ్‌ని ఇంటికి సాగనంపారు. -
అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్
-
బాలికపై గ్యాంగ్‌రేప్.. వీడియో షూట్!
ఆసిఫాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు యువకులు ఓ బాలికను చెరబట్టారు. లైంగికదాడికి పాల్పడి సెల్ఫోన్లో చిత్రీకరించి.. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఈ వీడియో రెండ్రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శనివారం ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. కాగజ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ మల్లేశ్ తిర్యాణి మండలం టేకం లొద్దికి చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మూడు నెలల క్రితం మల్లేశ్ తన మిత్రుడితో కలిసి ఆసిఫాబాద్ వచ్చాడు. అదే సమయంలో ఆసిఫాబాద్‌లో ఉన్న బాలికకు ఫోన్ చేయడంతో బస్టాండ్ వద్ద కలుసుకున్నారు. అక్కడి నుంచి ఆమెను చిన్నరాజూర రోడ్‌కు తీసుకవెళ్లారు. వీరిని గమనించిన ఆసిఫాబాద్‌కు చెందిన మాచెర్ల రాజు, రౌతు రంజిత్, సయ్యద్ మతీన్ అక్కడికి వచ్చారు. ఆ ముగ్గురూ కలసి మల్లేశ్‌ను, అతడి స్నేహితుడు బాలికను బెదిరించి సెల్ఫోన్లు లాక్కున్నారు. అనంతరం బాలికను పక్కకు తీసుకెళ్లి రాజు(27), రంజిత్(25), మతీన్(23)లు వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో తీశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి వదిలిపెట్టారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ కావడంతో బాలిక తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీశ్‌కుమార్ తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, సామూహిక అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.