
ఇటీవలకాలంలో సోషల్ మీడియా స్టార్‌డమ్ కోసం పిచ్చిపిచ్చి వీడియోలు చేయడం ఎక్కువైపోయింది. సందేశాత్మకంగా లేకపోయినా పర్వాలేదు గానీ ఇబ్బంది పెట్టేవిగానూ, తప్పుదారి పట్టించేవిగానూ ఉండకూడదు. సోషల్ మాధ్యమాల్లో పెట్టే వీడియోలుకు కూడా కొన్నినిబంధనలు ఉంటాయి. చాలామంది వాటిని విస్మరించి అసభ్యకరంగా వీడియోలు షూట్ చేసి జైలు పాలవ్వుతున్నారు. అచ్చం అలానే చేసి ఇక్కడోక వ్యక్తి కూడా జైలు పాలయ్యాడు.
వివరాల్లోకెళ్తే...లక్నోకి చెందిన అజమ్ అన్సారీ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేందుకని ఒక అసభ్యకరమైన వీడియో చేశాడు. అతను సల్మాన్‌ఖాన్ మాదిరి అర్ధ నగ్నంగా రెడీ అయ్యి రైల్వే ట్రాక్‌పై ఒక వీడియో షూట్ చేశాడు. ఆ వీడియోలో అతను రైల్వే ట్రాక్ పై పడుకుని సిగరెట్ తాగుతూ కనిపించాడు. పైగా ఈ వీడియోని సల్మాన్ చిత్రం తేరే నామ్‌లో హిట్ పాట తేరే నామ్ హమ్మే కియా హై అనే పాటతో రూపొందించాడు.
దీంతో లక్నో రైల్వే పోలీసులు అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఐతే నిందితుడు పై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇలానే ఘంటాఘర్ వద్ద వీడియో తీసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.
(చదవండి: మితిమీరిన వర్క్ అవుట్...దెబ్బకు పుర్రెలో సగభాగం ఔట్!)
Comments
Please login to add a commentAdd a comment