stardum
-
సల్మాన్ ఖాన్ లుక్‌లో అర్ధ నగ్నంగా రైల్వే ట్రాక్ పై హల్చల్
ఇటీవలకాలంలో సోషల్ మీడియా స్టార్డమ్ కోసం పిచ్చిపిచ్చి వీడియోలు చేయడం ఎక్కువైపోయింది. సందేశాత్మకంగా లేకపోయినా పర్వాలేదు గానీ ఇబ్బంది పెట్టేవిగానూ, తప్పుదారి పట్టించేవిగానూ ఉండకూడదు. సోషల్ మాధ్యమాల్లో పెట్టే వీడియోలుకు కూడా కొన్నినిబంధనలు ఉంటాయి. చాలామంది వాటిని విస్మరించి అసభ్యకరంగా వీడియోలు షూట్ చేసి జైలు పాలవ్వుతున్నారు. అచ్చం అలానే చేసి ఇక్కడోక వ్యక్తి కూడా జైలు పాలయ్యాడు. వివరాల్లోకెళ్తే...లక్నోకి చెందిన అజమ్ అన్సారీ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేందుకని ఒక అసభ్యకరమైన వీడియో చేశాడు. అతను సల్మాన్‌ఖాన్ మాదిరి అర్ధ నగ్నంగా రెడీ అయ్యి రైల్వే ట్రాక్‌పై ఒక వీడియో షూట్ చేశాడు. ఆ వీడియోలో అతను రైల్వే ట్రాక్ పై పడుకుని సిగరెట్ తాగుతూ కనిపించాడు. పైగా ఈ వీడియోని సల్మాన్ చిత్రం తేరే నామ్లో హిట్ పాట తేరే నామ్ హమ్మే కియా హై అనే పాటతో రూపొందించాడు. దీంతో లక్నో రైల్వే పోలీసులు అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఐతే నిందితుడు పై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇలానే ఘంటాఘర్ వద్ద వీడియో తీసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: మితిమీరిన వర్క్ అవుట్...దెబ్బకు పుర్రెలో సగభాగం ఔట్!) -
స్టార్‌డమ్‌ని పట్టించుకోను
యాక్టర్స్‌గా మారిన ప్రతి ఒక్కరూ స్టార్‌డమ్‌ను సంపాదించాలని కలలు కంటారు. కానీ సైఫ్ అలీఖాన్ కుమార్తె, బాలీవుడ్ నయా ఎంట్రీ సారా అలీఖాన్ మాత్రం స్టార్‌డమ్‌ని నమ్మను అంటున్నారు. ఈ విషయం గురించి సారా మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే ‘సారా ఈ పాత్ర చేయలేదేమో?’ అనే సందేహం వ్యక్తపరచకూడదు. యాక్టర్‌గా నా టార్గెట్ అదే. స్టార్డమ్ అనే కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. ఆ టాపిక్కే చాలా విచిత్రంగా, ఫన్నీగా అనిపిస్తుంది. అలా అని మన స్టార్స్ మీద నాకు రెస్పెక్ట్ లేదని కాదు. నేను శ్రీదేవిగారికి వీరాభిమానిని. తనే లాస్ట్ సూపర్‌స్టార్ అని నా ఉద్దేశం. ఇప్పుడు స్టార్స్ కూడా చాలా కామన్ అయిపోయారు. అందరికీ ఈజీగా అందుబాటులో ఉంటున్నప్పుడు స్టార్డమ్ అనే కాన్సెప్ట్ ఏంటి? నా వరకూ ప్రతీ ప్రేక్షకుడు మన వర్క్‌కి కనెక్ట్ అవ్వాలి. అలాంటి సినిమాలు చేయడమే నా లక్ష్యం’’ అన్నారు. ప్రస్తుతం సారా అలీఖాన్ ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమా చేస్తున్నారు. -
'మావాళ్లే నన్నలా పెంచారు'
చెన్నై: తానెప్పుడూ స్టార్ డమ్ కోరుకోనని ప్రముఖ సినీ హీరో శింబు అన్నారు. గత 20 ఏళ్లుగా తమిళ చిత్ర పరిశ్రమలో వెలుగొందుతున్న ఆయన పేరు ప్రతిష్టలు పెద్దగా పట్టించుకోనని చెప్పారు. 'నాకు తొలిసారి కెమెరాముందుకు ఎప్పుడు వెళ్లాననే విషయం కూడా గుర్తు లేదు. నట వారసత్వం ఉన్న కుటుంబం నుంచే నేను వచ్చాను. చాలా యుక్తవయసులో ఉండగానే నేను నటనలో అడుగుపెట్టాను. నాకు అర్ధం చేసుకునే వయసు లేనప్పుడే స్టార్ డమ్ వచ్చింది. మా అమ్మవాళ్లే నన్నలా పెంచారు. అందుకే పేరు ప్రఖ్యాతలు, స్టార్ డమ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. మమ్మల్ని అంతా పనికిరానివాళ్లుగా భావిస్తారు. రేపు నాతో సినిమాలు తీసేందుకు ఎవరూ ముందుకు రాకపోయినా.. నాకు తెలుసు.. నా చిత్రాన్ని నేనే తీసుకోగలనని' అని శింబు చెప్పారు. శింబు నటించిన కామెడీ చిత్రం 'ఇదు నమ్మ ఆలు' ఆలస్యంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. -
నాకా భయం లేదు!
ఎలాంటి చీకూ చింతా లేకుండా హాయిగా బతకాలంటే.. మంచి కుటుంబం, ఓ సొంత ఇల్లు, కారు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు. దీపికా పదుకొనేకి ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఇలా అన్నీ ఉన్న చోట మిడిసిపాటు సహజం. కానీ, దీపికా ఆ బాపతు కాదని హిందీ రంగంలో అంటుంటారు. గుడ్ గాళ్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ తన నిరాడంబరత గురించి చెబుతూ - ‘‘జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. అసలీ రోజున్న హోదా రేపు ఉంటుందో ఉండదో. ఆ మాటకొస్తే... జీవితాంతం నేను స్టార్ హీరోయిన్గా ఉంటానా చెప్పండి? రేపు నా స్థానంలో ఇంకొకరు.. ఆ తర్వాత వాళ్ల స్థానంలో మరొకరు.. కాలచక్రంలో స్థానాలు మారిపోతాయ్. అందుకే ‘రేపు స్టార్డమ్ పోతే ఎలా?’ అని అదే పనిగా ఆలోచించి, భయపడను. ఎందుకంటే, ఎలాగూ పోవడం ఖాయం. ఈ మాత్రం దానికి ‘అంతా నేనే’ అని మిడిసిపడడం ఎందుకు? అదే గనక మనం నిరాడంబరంగా ఉంటే నలుగురు స్నేహితులు ఉంటారు. మనకు స్టార్డమ్ ఉన్నా లేకపోయినా వాళ్లు మనతో పాటే ఉంటారు. ఏమంటారు?’’ అని అన్నారు.