స్టార్‌డమ్‌ని పట్టించుకోను | Sara Ali Khan WONT think about stardom | Sakshi
Sakshi News home page

స్టార్‌డమ్‌ని పట్టించుకోను

Published Sun, Mar 24 2019 1:32 AM | Last Updated on Sun, Mar 24 2019 1:32 AM

Sara Ali Khan WONT think about stardom - Sakshi

సారా అలీఖాన్‌

యాక్టర్స్‌గా మారిన ప్రతి ఒక్కరూ స్టార్‌డమ్‌ను సంపాదించాలని కలలు కంటారు. కానీ సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె, బాలీవుడ్‌ నయా ఎంట్రీ సారా అలీఖాన్‌ మాత్రం స్టార్‌డమ్‌ని నమ్మను అంటున్నారు. ఈ విషయం గురించి సారా మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో ఏ ఫిల్మ్‌ మేకర్‌ అయినా సరే ‘సారా ఈ పాత్ర చేయలేదేమో?’ అనే సందేహం వ్యక్తపరచకూడదు. యాక్టర్‌గా నా టార్గెట్‌ అదే. స్టార్‌డమ్‌ అనే కాన్సెప్ట్‌ నాకు అర్థం కాదు. ఆ టాపిక్కే చాలా విచిత్రంగా, ఫన్నీగా అనిపిస్తుంది.

అలా అని మన స్టార్స్‌ మీద నాకు రెస్పెక్ట్‌ లేదని కాదు. నేను శ్రీదేవిగారికి వీరాభిమానిని. తనే లాస్ట్‌ సూపర్‌స్టార్‌ అని నా ఉద్దేశం. ఇప్పుడు స్టార్స్‌ కూడా చాలా కామన్‌ అయిపోయారు. అందరికీ ఈజీగా అందుబాటులో ఉంటున్నప్పుడు స్టార్‌డమ్‌ అనే కాన్సెప్ట్‌ ఏంటి? నా వరకూ ప్రతీ ప్రేక్షకుడు మన వర్క్‌కి కనెక్ట్‌ అవ్వాలి. అలాంటి సినిమాలు చేయడమే నా లక్ష్యం’’ అన్నారు. ప్రస్తుతం సారా అలీఖాన్‌ ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ సినిమా చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement