రికార్డులు కొల్లగొడుతున్న ఆదిపురుష్ టీజర్.. విడుదలైన 17 గంటల్లోనే..! | Prabhas Adipurush Teaser Crossed KGF Record In Views | Sakshi
Sakshi News home page

Prabhas Adipurush Teaser: కేజీఎఫ్‌-2 రికార్డ్ బ్రేక్.. బద్దలుకొట్టిన ఆదిపురుష్

Published Mon, Oct 3 2022 3:38 PM | Last Updated on Mon, Oct 3 2022 3:42 PM

Prabhas Adipurush Teaser Crossed KGF Record In Views - Sakshi

అయోధ్య వేదికగా రిలీజైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 17 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి రికార్డుస్థాయిలో 88 మిలియన్ల వ్యూస్ సాధించింది. గతంలో కేజీఎఫ్-2 సాధించిన రికార్డును 'ఆదిపురుష్' బద్దలుకొట్టింది. అలాగే 932 కె లైక్స్ సాధించి నెంబర్‌వన్‌గా నిలిచింది. విక్రమ్ వేద 931 కె లైక్స్‌తో రెండోస్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశముంది. 

(చదవండి: అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్.. రాముడి లుక్‌లో అదరగొట్టిన ప్రభాస్)

అయోధ్య వేదికగా నిన్న రిలీజైన ఆదిపురుష్ టీజర్ విజువల్ వండర్‌ను తలపిస్తోంది. కొంతమంది అభిమానులు ప్రభాస్ రాముడి లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల కానుంది. మైథలాజికల్ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్‌ సీతగా నటించనుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస‍్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement