Adipurush Teaser Launch: Prabhas Opens Up About Playing Lord Ram In Adipurush - Sakshi
Sakshi News home page

Adipurush Teaser Event: ఈ సినిమా చేయడానికి భయం వేసింది: ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Mon, Oct 3 2022 12:02 PM | Last Updated on Mon, Oct 3 2022 1:00 PM

Prabhas, Om Raut Comments At Adipurush Teaser Event At Ayodhya - Sakshi

‘డార్లింగ్‌’ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడాని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆదిపురుష్' టీజర్ వచ్చేసింది. ఆదివారం(అక్టోబర్‌ 2న) అయోధ్యలో గ్రాండ్‌గా జరిగిన ఈవెంట్‌లో టీజర్, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వం రామాయణం ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ టీజర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో డైరెక్టర్‌ ఓం రౌత్‌ మాట్లాడుతూ మాట్లాడుతూ.. ‘సాధారణ సినిమాలా ఆదిపురుష్‌ తీయలేదు. దేవుడి పట్ట భక్తిని చాటుకోవడానికి ఈ చిత్రాన్ని తీశాను.

చదవండి: కె భాగ్యరాజ్‌కు షాక్‌, నటీనటుల సంఘం నుంచి తొలగింపు

ఈ పవిత్ర స్థలంలో టీజర్‌ రిలీజ్‌ చేయడం సంతోషంగా ఉంది. టీజర్‌ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను’ అన్నారు. అనంతరం ప్రభాస్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం అయోధ్యకు వచ్చి శ్రీరాముడు ఆశీర్వాదం తీసుకున్నాం. ఈ క్యారెక్టర్‌ చేయడానికి మొదట భయం వేసింది. దేవుడు మీద ఉన్న భక్తి, ప్రమే, భయమే నన్ను ఈ సినిమా చేయించింది. రాముడిని మనం దేవుడుగా విశ్వసిస్తాం, ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు’ అంటూ ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

చదవండి: పూజా ఆ బాడీ పార్ట్‌కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ

అలాగే హీరోయిన్‌ కృతి సనన్‌ మాట్లాడుతూ.. ‘జానకి పాత్రం చేయడం నా అదృష్టం. ఈ సినిమా అనుభవాన్ని నేను మాటల్లో చెప్పలేను. చిన్నప్పుడు తాతా నానమ్మలు చెప్పేవారు. ఆ రామయణ గాధలో నేను చేయ్యడం పూర​ జన్మ సుకృతం’ అని ఆమె చెప్పుకొచ్చింది. కాగా మైథలాజికల్‌ ఫిలింగా రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనుండగా.. కృతీ సనన్‌ సీతగా కనువిందు చేయనుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా అలరించనున్నాడు. కాగా సంక్రాంతి కానుగా వచ్చే ఏడాది జనవరి 12, 2023లో ఆదిపురుష్‌ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement