Viral Video: Ants Carry Gold Chain, Internet Reacts Hilarious - Sakshi
Sakshi News home page

Viral Video: బంగారాన్ని దొంగలిస్తున్న చీమలు.. అట్లుంటది మరి వాటితోని!

Published Thu, Jun 30 2022 5:26 PM | Last Updated on Thu, Jun 30 2022 6:02 PM

Viral Video: Ants Carry Gold Internet Reacts Hilarious - Sakshi

ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని పెద్దలు అంటుంటారు. చిన్న ప్రాణులైనా తలుచుకుంటే ఏదైనా చేయగలవని చాలా సార్లు నిరూపితమైంది కూడా. ఇక చీమలంటే చక్కెరనో, లేదా అవి తినేందుకు ఏవైనా పదార్థాలనో ఎత్తుకెళ్తుంటాయి. అవి సైజులో చిన్నవి కాబట్టి అవి మోసుకెళ్లే వస్తువులు కూడా చిన్నవిగా ఉండి మోయడానికి వీలుగా ఉంటే వాటినే తీసుకెళ్తుంటాయి. ఇక్కడ వరకు మనకు తెలిసినదే, అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కూడా. అయితే ఈ వీడియోలో ఏకంగా వాటి సైజుకు మించి, బంగారపు గొలుసుని దొంగలిస్తున్నాయి. అందుకే చీమలను కూడా చీప్‌గా చూడకూడదంటారు.

చీమలు బంగారపు గొలుసు ఎత్తుకెళ్లడమేంటి, వినడానికి వింతగా ఉన్నా కూడా ఇది నిజమే. కొన్ని చీమలు కలిసి ఒక బంగారు చైన్‌ను ఎత్తుకెళ్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ వీడియో షేర్ చేసిన ఆయన.. ‘‘చిన్ని గోల్డ్ స్మగ్లర్లు.. వీళ్లను ఏ ఐపీసీ సెక్షన్ కింద బుక్ చేయాలి?’’ అని కామెంట్‌ చేయగా, మరొకరు ‘‘ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇవి బంగారం గొలుసును ఎందుకు తీసుకెళ్తున్నట్లు?’’ అని కామెంట్‌ చేశారు. చాలా వరకు ఆ చీమల గుంపు బంగారం గొలుసుని ఎత్తుకెళ్లడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement