Ants
-
పక్షులకు చీమల గండం!
పర్వత ప్రాంతాల్లోని పక్షి జాతుల మనుగడకు పెను ముప్పు ఎదురవుతోంది. ఎవరి నుంచో తెలుసా? చీమల నుంచి! వాటి దెబ్బకు తీవ్ర ఆహార కొరతతో పక్షులు అల్లాడుతున్నాయి. దీనివల్ల పర్వత ప్రాంతాల్లో పక్షి జాతుల వైవిధ్యం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. దాంతో కష్టమే అయినా, విధిలేని పరిస్థితుల్లో చీమలు ఎక్కి రాని పర్వత పై ప్రాంతాలకు పక్షులు తమ ఆవాసాలను మార్చుకుంటున్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) తాజా పరిశోధనలో ఈ మేరకు వెల్లడైంది. ఈ ధోరణి దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం విశేషమని అధ్యయనం పేర్కొంది.భూమి ఉపరితలంపై 25 శాతం మాత్రమే ఉండే పర్వతాలు ఏకంగా 85 శాతం పక్షి, క్షీరద జాతులకు నిలయాలు. పర్వతాల్లోని పలు పక్షి జాతులు తరచూ పై ప్రాంతాలకు వలస వెళ్తుండటాన్ని పర్యావరణ శాస్త్రవేత్తలు గమనించారు. దీనికి వాతావరణ మార్పులు తదితరాలే ప్రధాన కారణాలని ఇప్పటిదాకా భావిస్తూ వచ్చారు. కానీ అది నిజం కాదని ఐఐఎస్సీ అధ్యయనం తేల్చింది. మన దేశంలో పర్వత ప్రాంతాల్లో నివసించే పక్షులకు ఓషియోఫైలా జాతి చీమలు పెద్ద ముప్పుగా మారినట్టు వెల్లడించింది. పర్వత ప్రాంతల్లో మొత్తం జీవావరణ వ్యవస్థనే అవి ప్రభావితం చేస్తున్నట్టు అధ్యయన బృందానికి సారథ్యం వహించిన సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమేశ్ శ్రీనివాసన్ తెలిపారు. వాటితో నెలకొన్న ఆహార పోటీని తట్టుకోలేక పక్షులే తమ ఆవాసాలను మార్చుకోవాల్సి వస్తోందని వివరించారు. ఓషియోఫైలా చీమలు దూకుడుకు పెట్టింది పేరు. కీటకాలు తదితరాలను తిని బతుకుతుంటాయి. ఇవి ప్రధానంగా పర్వతాల పాద ప్రాంతాల్లో విస్తారంగా ఉంటాయి. దాంతో అక్కడ కీటకాల కొరత నానాటికీ తీవ్రతరమవుతోంది. తమ ప్రధాన ఆహారమైన కీటకాల అలభ్యతతో పక్షులు అల్లాడుతున్నాయి. చీమల బెడదను తప్పించుకోవడానికి వాటి ఉనికి అంతగా ఉండని పర్వత పై ప్రాంతాలకు వలస పోతున్నాయి. ‘‘ఫలితంగా ప్రధానంగా కీటకాలను తినే పక్షి జాతుల వైవిధ్యం 900 మీటర్లు, అంతకంటే ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనే విస్తారంగా కన్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఓషియోఫైలా చీమలుండే పర్వత ప్రాంతాలన్నింట్లోనూ ఈ ధోరణి కొట్టొచ్చినట్టుగా ఉంది. పళ్లు, పూలలోని మకరందం ప్రధాన ఆహారమైన పక్షి జాతులు మాత్రం పర్వత పాదప్రాంతాల్లో కూడా విస్తారంగా ఉండటం గమనించాం. ఆహారం విషయంలో ఓషియోఫైలా చీమలతో వాటికి పోటీ లేకపోవడమే అందుకు ప్రధాన కారణం’’ అని శ్రీనివాసన్ వెల్లడించారు. పక్షి జాతుల పరిరక్షణ ప్రయత్నాలను ఈ అధ్యయన ఫలితాలు ఎంతగానో ప్రభావితం చేయనున్నాయి. వాటిని ఎకాలజీ లెటర్స్‌లో తాజాగా ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బొద్దింకలు, చీమలతో విసిగిపోయారా? ఇవిగో చిట్కాలు!
వేసవికాలం వచ్చిందంటే చీమలు, బొద్దింకల బెడద ఎక్కువవుతుంది. వేసవిలోనే ఈ సమస్య ఎందుకుపెరుగుతుందో తెలుసా? మరి వీటిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? అనేక ఇతర జంతువుల వలె, చీమలు కూడా గడ్డకట్టే శీతల ఉష్ణోగ్రతల నుంచి బయటికొస్తాయి. శీతాకాలంలో నిద్రాణస్థితిలో ఉంటాయి. కొద్దిగా వాతావరణం మారగానే బొద్దింకలు, చీమలు, ఇతర కీటకాలకు ఆహారం కోసం బయటికి రావడం మొదలు పెడతాయి. ఉష్ణోగ్రత వేడెక్కడం ప్రారంభించిన తర్వాత, చీమలు కొత్త గూళ్ళు నిర్మించడం ప్రారంభిస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగిన చీమలు మరింత చురుకుగా జతకడతాయి. సంతానం ఉత్పత్తి చేస్తాయి. ఇది సహజ జీవన చక్రంలో భాగం మాత్రమే. నీరు, వేడి లేదా ఆహారం కోసం వెతుకులాటలో చీమలు, బొద్దింకలు ఈ విషయంలో 'మాస్టర్స్’ అని చెప్పొచ్చు. చీమలు, బొద్దింకల నివారణకు రసాయనాలు, పాయిజన్‌తో నిండిన హిట్, బోరాక్స్ పౌడర్, ఇతర స్ప్రేలతో పోలిస్తే కొన్ని సహజ నివారణ పద్ధతులు పాటించడం ఉత్తమం. వంటగది షెల్ఫుల్లో కొన్ని లవంగాలు లేదా బిర్యానీ ఆకులు ఉంచండి. ఈ ఆకుల నుండి వచ్చే బలమైన వాసన బొద్దింకలు, చీమలకు పడదు అందుకే అవి ఉన్నచోటికి సాధారణంగా రావు. దోసకాయ ముక్కలుగానీ, దోసకాయ తొక్కలుగానీ చీమల రంధ్రాల దగ్గర ఉంచండి. అలాగే బత్తాయిలు, నిమ్మకాయలు, నారింజ పండ్ల తొక్కలు కూడా బాగా పనిచేస్తాయి. బొద్దింకలు, ఇతర కీటకాలకు ఈ వాసన పడదట. వైట్ వెనిగర్ ను కూడా స్ప్రే చేయవచ్చు. ఇంకా ఈగలు, బొద్దింకలు వంటి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే దాల్చిన చెక్క పొడి , పుదీనా ఆకులను ఒక గిన్నెలో వేసి ఉంచాలి. చీమల సమస్యకు కాఫీ పొడి చల్లినా కూడా ఫలితం ఉంటుంది. చెత్త డబ్బాలు తరచుగా క్లీన్ చేయంగా, ఓపెన్‌గా గాకుండా బిగుతుగా ఉండేలా మూతలు పెట్టాలి. నోట్: ఈగలు, చీమలు, బొద్దింకలు, బల్లులు ఇలాంటివి మన వంట ఇంటి ముఖం చూడకుండా ఉండాలంటే. పరిశుభ్రత చాలా ముఖ్యం. ఆహార పదార్థాలు, పండ్లపై మూతలు కచ్చితంగా పెట్టాలి. వంట ఇంటి సింక్‌లో గంటల తరబడి అంట్ల గిన్నెలను వదిలేయ కూడదు. రాత్రి పూట అసలు వదిలేయ కూడదు. సాధ్యమైనంతవరకు ఎప్పటికపుడు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. -
స్పైసీ స్పైసీ ఎర్ర చీమల చట్నీ: ఇక వరల్డ్ వైడ్‌గా మారు మోగనుంది
చీమల పచ్చడి గురించి ఎపుడైనా విన్నారా? ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్, ఒడిశాలోని మయూర్‌భంజ్‌లోనూ ఇది ఫ్యామస్. రుచికరమైన చట్నీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజ నాలున్నాయని తాజాగా పరిశోధకులు తేల్చారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌తో సహా జిల్లాలోని ప్రతి బ్లాక్ ఏరియాలోని అడవులలో ఏడాది పొడవునా సమృద్ధిగా కనిపిస్తాయి. ఒడిశాలోని మయూర్భంజ్ ప్రజలు దీన్ని విరివిగా వాడతారు. వీరు తయారు చేసే స్పైసీ స్పైసీ రెడ్ యాంట్ చట్నీకి ఇప్పటికే భిన్నమైన గుర్తింపు లభించడంతో పాటు ఇపుడిక జీఐ ట్యాగ్ కూడా అందుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో రెడ్ యాంట్ చట్నీ ఇక వరల్డ్ వైడ్‌గా గుర్తింపును తెచ్చుకోనుంది. మయూర్భంజ్ రెడ్ యాంట్ చట్నీకి GI ట్యాగ్ మయూర్భంజ్లోని రెడ్ చట్నీపై చేసిన పరిశోధనలో, శాస్త్రవేత్తలు రెడ్ వీవర్ చీమలను విశ్లేషించారు. ఇందులో ప్రోటీన్, కాల్షియం, జింక్, విటమిన్ బి-12, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, కాపర్, అమినో యాసిడ్లు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పోషకాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులను నివారించవచ్చని గుర్తించారు. రెండ్ యాంట్ చట్నీ కేవలం రుచికి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దాని వైద్యపరమైన లక్షణాల కారణంగా ఇది స్థానిక ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రకృతితో ముడిపడి ఉన్న ప్రజల పోషకాహార భద్రతకు ఇది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. స్థానికుల విశ్వాసంతో పాటు, ఈ చట్నీలోని ఔషధ గుణాలను నిపుణులు ఇప్పటికే గుర్తించారు. జ్వరం, జలుబు, దగ్గు, ఆకలిని తగ్గించడానికి, కంటి చూపు, కీళ్ల నొప్పులు, ఆరోగ్యకరమైన మెదడును మెరుగుపరచడంలో సహాయపడుతుందని తేల్చిన సంగతి తెలిసిందే. ఈ చీమల నుండి తయారుచేసిన సూప్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందట. స్థానికంగా చాప్ డా అని పిలిచే ఈ చీమల పచ్చడికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎర్ర చీమల చట్నీ ఎలా తయారు చేస్తారంటే ఈ రెడ్ వీవర్ చీమలను వాటి గుడ్లతో పాటు గూళ్ళ నుండి సేకరించి శుభ్రం చేస్తారు. దీని తరువాత, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, కారం కలిపి, గ్రైండ్ చేయడం ద్వారా చట్నీ తయారు చేస్తారు. ఈ చట్నీ కారం..కారంగా , పుల్లగా ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటుంది. స్థానిక గిరిజనులు తమ ఆహారంలో చేర్చుకుంటారు. ఇందులోని ప్రొటీన్, కాల్షియం, ఫామిక్ యాసిడ్, ఇతర పోషక గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మారుమూల గిరిజనవాసులకు ఎంతో మేలు చేస్తాయి. ఈ చట్నీ మలేరియా, కామెర్లు తదితర కొన్ని రకాల వ్యాధులను కూడా నయం చేస్తుందని స్థానిక గిరిజనుల విశ్వాసం. అలాగే కొలంబియా, మెక్సికో, బ్రెజిల్‌లోనూ చీమలను ఆహారంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే OUAT బృందం 2020లో శాస్త్రీయ ఆధారాలతో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపుకోసం చేసిన ప్రయత్నం ఫలించింది. -
14 వేల అడుగుల ఎత్తునుంచి జారిపడిన స్కైడైవర్.. కాపాడిన అగ్ని చీమలు!
స్కైడైవింగ్‌కు ప్రయత్నించే ధైర్యం అందరికీ ఉండదు. ఈ ఫీట్ చేసేందుకు కొందరు సిద్ధమైనా.. మధ్యలో పారాచూట్ విఫలమైతే ఏమైపోతామోనని భయపడిపోతారు. ఈ భయంతోనే స్కై డైవింగ్‌కు దూరంగా ఉంటారు. అయితే స్కైడైవింగ్ చేసేటప్పుడు పారాచూట్ విఫలం కావడం అనేది చాలా అరుదు. స్కైడైవర్ల కోసం తయారైన పారాచూట్లు వంద శాతం మేరకు తెరుచుకుంటాయి. అయితే దీనికి విరుద్ధమైన పరిస్థితి జోన్ ముర్రే అనే మహిళకు ఎదురయ్యింది. అత్యంత విచిత్ర పరిస్థితుల్లో ఆమె ప్రాణాలతో బయటపడింది. అది 1999, సెప్టెంబర్ 25.. జోన్ ముర్రే(40) అనే మహిళ స్కైడైవింగ్‌కు దిగింది. 14,500 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం నుండి పారాచూట్ సాయంతో దూకేందుకు ప్రయత్నించింది. అయితే ఆ పారాచూట్ తెరుచుకోలేదు. అలాగే ఆమెకు సాయం అందించాల్సిన సెకండరీ పారాచూట్ కూడా విఫలమైంది. ఫలితంగా ముర్రే గంటకు ఎనభై మైళ్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తూ అగ్ని చీమల దండుపై పడింది. అయితే ఈ అగ్ని చీమలే ఆమెను కాపాడాయి. అపస్మారక స్థితికి చేరిన ఆమెపై ఆ అగ్ని చీమలు దాడి చేశాయి. ఈ దాడి కారణంగానే ఆమె బతికి బట్టకట్టిందంటే ఎవరూ నమ్మలేరు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆ అగ్ని చీమల దాడికి ముర్రే శరీరంలోని నరాలు ఉత్తేజితమయ్యాయి. ఆమె గుండె కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి వెళ్లే వరకు అగ్ని చీమలు ఆమె ప్రాణాలతో ఉండేలా సహాయపడ్డాయి. ఆసుపత్రిలో ముర్రే రెండు వారాల పాటు కోమాలో ఉంది. వైద్యులు ఆమె ప్రాణాన్ని నిలిపి ఉంచేందుకు పలు ఆపరేషన్ల చేయవలసి వచ్చింది. అయితే ఈ ఘటనలో ఆమె ప్రాణాలను అగ్ని చీమలే కాపాడాయని చెప్పకతప్పదు. ఇది కూడా చదవండి: అడవిలో వృద్ధుడు గల్లంతు.. 48 గంటలు గడిచాక.. The story of Joan Murray, who survived a 4,500 meter fall when her main parachute failed while skydiving. She landed in a fire ant mound where numerous venomous stings caused an adrenaline rush to keep her heart beating long enough for doctors to assist https://t.co/YUMFGJCXX6 pic.twitter.com/GOPpFwKjqB — Massimo (@Rainmaker1973) May 13, 2020 -
బ్రిటీషర్లను తరిమికొట్టిన చీమలు? ‘సిపాయిల తిరుగుబాటు’లో ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమరవీరులు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, అష్ఫాక్ ఉల్లా ఖాన్ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. వీరేకాదు షాజహాన్‌పూర్ చీమలు కూడా బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు యుద్ధం చేసి, విజయం సాధించాయి. ఈ ఘటన ‘1857 సిపాయిల తిరుగుబాటు’ సమయంలో జరిగింది. చీమల దండు జరిపిన దాడి కారణంగా బ్రిటీషర్లు షాజహాన్పూర్లో స్థాపించిన కేరు అండ్ కంపెనీని మూసివేయవలసి వచ్చింది. చరిత్రకారుడు డాక్టర్ వికాస్ ఖురానా రచించిన ‘షాజహాన్‌పూర్ కా ఇతిహాస్ 1857’ పుస్తకంలోని వివరాల ప్రకారం బ్రిటీష్ వారు 1805లో కాన్పూర్‌లో కేరు అండ్ కంపెనీని తొలిసారిగా స్థాపించారు. దానిలో క్రిస్టల్ షుగర్, స్పిరిట్, రమ్ తయారు చేసేవారు. ఈ ఉత్పత్తులను యూరప్‌కు ఎగుమతి చేసేవారు. కాన్పూర్‌లో ఈ వ్యాపారం విజయవంతం కావడంతో బ్రిటీషర్లు 1811లో షాజహాన్‌పూర్‌లోని రామగంగా సమీపంలో మరో యూనిట్ ఏర్పాటు చేశారు. 1834లో బ్రిటీషర్లు.. రౌసర్ కోఠి వద్ద మరో యూనిట్‌ను స్థాపించారు. షాజహాన్‌పూర్‌లోని రౌజర్ కోఠి ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో చెరకు సాగయ్యేది. దీనికితోడు గర్రా, ఖన్నాత్ నదుల నుండి వాణిజ్యానికి నౌకాయాన సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండేవి. 1857లో విప్లవ తిరుగుబాటు సమయంలో విప్లవకారులు ఫ్యాక్టరీని కొల్లగొట్టి, తగలబెట్టారని డాక్టర్ వికాస్ ఖురానా తెలిపారు. ఈ నేపధ్యంలో కంపెనీ యజమాని జీబీ కెరు ఇక్కడ నుండి తప్పించుకొని మిథౌలీ రాజు సహాయంతో లక్నోకు తరలివెళ్లిపోయాడు. అక్కడ అతను హత్యకు గురయ్యాడు. తిరుగుబాటు ఆందోళనల తర్వాత ఫ్యాక్టరీ పునఃప్రారంభించారు. వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. అయితే ఆ సమయంలో చీమలు ఆ కంపెనీపై దాడి చేశాయని చరిత్రకారుడు డాక్టర్ వికాస్ ఖురానా, సాహితీవేత్త సుశీల్ తెలిపారు చెప్పారు. కాగా చీమలను తరిమికొట్టేందుకు కంపెనీ యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. అయితే ఆ ప్రయత్నాలు వృథాగా మారాయి. చివరికి బ్రిటీషర్లు కెరుగంజ్లో కంపెనీ పనులను నిలిపివేయవలసి వచ్చింది. కాగా కంపెనీ ఇక్కడ భారీ మార్కెట్‌ను సృష్టించిందని డాక్టర్ ఖురానా తెలిపారు. నేటికీ షాజహాన్‌పూర్‌లోని కెరుగంజ్ మార్కెట్ ఎంతో ప్రసిద్ధి చెందింది. సుదూర ప్రాంతాల వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి, వారి వ్యాపారాలను కొనసాగిస్తుంటారు. ఇది కూడా చదవండి: టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య! -
చీమల చట్నీ-గోంగూర, తింటారు నోరూర! తేడా వస్తే చీమల చికిత్స కూడా!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గల్లీలో ఉండే చిన్న హోటల్లోనే పొద్దున ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా ఇంకా ఎన్నో వెరైటీ టిఫిన్లు దొరుకుతాయి. ఇక మధ్యాహ్నం అన్నం, రెండు మూడు రకాల కూరలు, పప్పు, చారు, పెరుగు ఇవన్నీ లేనిదే ముద్ద దిగదు. ఇక ఏ స్టార్ హోటల్‌కి వెళ్లినా ఏ దేశపు వంటకాలైనా ఆర్డర్‌చేస్తే చాలు టేబుల్‌పై హాజరు... ఇవీ మైదాన ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు. కానీ అడవుల్లో జీవించే ఆదివాసీలు ఏం తింటారు? సీజన్లో దొరికే గోంగూర, చింతపండు, మిరపకాయలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆహార సేకరణ కష్టంగా మారిన సమయంలో ఎర్రచీమలతో పచ్చడి నూరుకుని కూడా తింటుంటారు. అయితే మారిన పరిస్థితుల్లో విద్య, ఉద్యోగాల కోసం అడవుల నుంచి బయటపడుతున్న వారి ఆహారపు అలవాట్లలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు చోటు చేసుకుంటోంది. వలస ఆదివాసీలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, తూర్పుగోదావరి జిల్లాలు రెండు దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన ఆదివాసీలకు ఆశ్రయం ఇస్తున్నాయి. వలస ఆదివాసీల్లో అనేక తెగలు ఉండగా, వీరిలో 90 శాతం మంది రోడ్డు, నీళ్లు, విద్యుత్ సౌకర్యం లేకుండా అటవీ ప్రాంత పల్లెల్లోనే ఉంటున్నారు. పోడు సాగు చేసుకోవడం, ఇంటి ఆవరణలోనే తినే ఆహార పదార్థాలను పండించుకోవడం వీరి జీవనశైలి. గోంగూర.. పండుగే.. వానాకాలంలో మొలకెత్తే గోంగూర ఆగస్టులో తినేందుకు అనువుగా ఎదుగుతాయి. ఆ సమయంలో ఆదివాసీలు గోంగూర పండుగ చేసుకుంటారు. చింతకాయలు అందుబాటులోకి వచ్చే వరకు గోంగూరే వీరి ప్రధాన ఆహారం. వానాకాలం ముగిసేలోగా అందుబాటులో ఉన్న గోంగూర ఎండబెట్టుకుని వేసవి వరకు వాడుకుంటారు. ఎండాకాలంలో చింతకాయలు రాగానే పచ్చడి చేసుకుంటారు. గోంగూరతో పాటు పచ్చకూర (చెంచలి), బొద్దుకూర, నాగళి, టిక్కల్ అనే ఆకుకూరలు, కొన్ని రకాలైన దుంపలను కూడా వండుకుంటారు. కారం కావాలంటే.. మొదట్లో అటవీ ఫలసాయం తప్ప వ్యవసాయం తెలియని ఆదివాసీలను కారం రుచి మైమరపించింది. గోంగూర, చింతకాయ పచ్చడికి అవసరమైన మిరపకాయలు అపురూపమైన ఆహారంగా మారింది. దీంతో మిరపకాయల కోసమే ఎత్తయిన కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ.. వాగులు, వంకలు దాటుతూ రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి గోదావరి తీరానికి చేరుకునేవారు. ప్రారంభంలో భద్రాద్రి ఏజెన్సీలో కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటను దొంగిలించుకెళ్లేవారట. ఆ తర్వాత ఇక్కడ పనిచేసి, కూలీగా మిర్చి తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇక పోడు సాగు కోసం ఆదివాసీలు అడవిని నరికేటప్పుడు ఇప్ప, మద్ది, తునికి, చింత, పాల చెట్లు తారసపడితే ముట్టుకోరు. ఇక ఇప్ప చెట్టునయితే దైవంతో సమానంగా కొలుస్తారు. చీమలు... ఆహారంగానే కాదు.. వైద్యానికి కూడా ఆకు రాలే కాలం మొదలైన తర్వాత వసంతం వచ్చే వరకు ఆదివాసీలకు ఆహార సేకరణ కష్టంగా మారుతుంది. ఈ సమయంలో చీమలను ఆహారంగా తీసుకుంటారు. సర్గీ, సాల్, మామిడి ఆకులపై ఎర్రచీమలను వాటి గుడ్లను సేకరిస్తారు. అనంతరం ఉప్పు, కారం, టమాటా కలిసి రోట్లో వేసి రుబ్బుతారు. ఇలా తయారు చేసిన చట్నీని బస్తరియాగా పిలుస్తారు. ఈ పచ్చడిని వారు ఇష్టంగా తింటారు. ఎర్రచీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫామిక్ యాసిడ్ ఉండడమేకాక ప్రొటీన్, కాల్షియం సమృద్ధిగా ఉండి జ్వరం, జలుబు, దగ్గు, కంటి సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్ముతారు. అలాగే ఒంట్లో నలతగా ఉన్నా, తలనొప్పి, జ్వరంగా అనిపించినా చీమల చికిత్సకే మొగ్గు చూపుతారు. చెవులు, ముక్కుల ద్వారా చీమలు శరీరంలోకి వెళ్లకుండా ముఖాన్ని వస్త్రంతో కప్పేసుకుని చీమల గూడును ఒంటిపై జల్లుకుంటారు. వందల కొద్ది చీమలు శరీరాన్ని కుడుతుండగా.. మంట పుట్టి క్షణాల్లో ఒళ్లంతా చెమటలు వస్తాయి. రెండు, మూడు నిమిషాలు ఉన్న తర్వాత చీమలు తీసేస్తారు. తద్వారా ఒంట్లో ఉన్న విష పదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లి ఉపశమనం కలుగుతుందని వారి నమ్మకం. కాగా, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలనే పండించి ఆహారంగా తీసుకునేవీరు క్రమంగా బియ్యానికి అలవాటు అవుతున్నారు. వ్యవసాయంలో ఎరువులు సైతం ఉపయోగిస్తున్నారు. గతంలో ఆవు పాలు తీసుకోని వీరు.. ఇప్పుడిప్పుడే పాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ గిరిజన పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు నెమ్మదిగా మైదాన ప్రాంత ఆహారపు అలవాట్లు చేసుకుంటున్నారు. చీమల చట్నీకి జీఐ ట్యాగ్.. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఆదివాసీలు తమ ఆహారంలో చీమల చట్నీకి తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఎర్రచీమలతో తయారు చేసే ఈ పచ్చడి ఔషధపరంగానూ ఉపయోగపడుతుందని వారు నమ్ముతున్నారు. చీమల చట్నీకి జీఐ టాగ్ సైతం లభించడం గమనార్హం. జొన్నలు, సజ్జలు తింటే తొందరగా ఆకలి వేయదు ఇంతకు ముందు జొన్నలు, సజ్జలు తినేవాళ్లం. పొద్దున తిని అడవికి వెళితే రాత్రి వరకు ఆకలి అనేది ఉండకపోయేది. కానీ బియ్యంతో చేసిన అన్నం అయితే రోజుకు రెండుసార్లు తినాల్సి వస్తోంది. ఇది తప్పితే బియ్యంతో చేసిన అన్నం బాగుంది. – మామిడి అరవయ్య (కూలీ, రెడ్డిగూడెం ఎస్టీ కాలనీ, పాల్వంచ మండలం) -
చీమల తేనె గురించి విన్నారా! ఇది జలుబు, గొంతు నొప్పి ఇన్ఫెక్షన్లను..
తేనె అంటే తేనెటీగల నుంచి వస్తుందని అందరికీ తెలుసు. మహా అయితే కొన్ని దేశాల్లో ఇంకాస్తా ఔషధాలతో కూడిన తేనె దొరకొచ్చు. కానీ మాగ్జిమమ్ తేనె అంటే వివిధ తేనెటీగల జాతుల నుంచే వస్తుంది. చీమల నుంచి కూడా తెనె వస్తుందని మీరు ఎప్పుడైనా విన్నారా?. పైగా ఇందులో చాలా మంచి ఔషధాలు ఉన్నాయట. ఆస్ట్రేలియాలోని ప్రజలు ఈ తేనెనే ఎక్కువగా ఉపయోగిస్తారట. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు కూడా చెబుతున్నారు. ఆస్ట్రేలియలో ఉండే హనీపాట్ చీమలు ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయట. ఇందులో జలుబు, గొంతు నొప్పుల ఇన్ఫెక్షన్ల భారి నుంచి కాపాడే మంచి యాంటీబయోటిక్స్ ఉన్నాయట. అక్కడ ప్రజలు సాంప్రదాయ వైద్యంలో భాగంగానే కాగా నిత్య జీవితంలో కొన్ని రకాల వ్యాధులకు ఔషధంగా వాడతారట. ఈ చీమలు పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉత్తర భూభాగంలోని ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని రిప్లీట్స్ అని పిలుస్తారు. ఇవి తేనేను అధికంగా తింటాయి. వాటి పొత్తికడుపులో చిన్న అంబర్ గోళీల పరిమాణానికి చేర్చి తేనెను ఉత్పత్తి చేస్తాయి. అవి తమ గూళ్లు పై కప్పులపై వేళ్లాడుతూ ఉండి ఈ తేనెను స్టోర్ చేయడం ప్రారంభిస్తాయి. వాటికి ఆహరం కొరత ఉన్న సమయంలో ఈ తేనెను తీసుకుని జీవిస్తాయి. ఈ తేనె స్టెఫిలోకాకస్ ఆరియస్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. క్రిప్టోకోకస్ చెట్లలో ఈ చీమలు గూడ్లు కట్టుకుంటాయని చెబుతున్నారు. వీటి తేనెలో యాంటీమైక్రోబయల్ పెప్టైడ్, మిథైల్గ్లైక్సాల్ సమ్మేనం, హైడ్రోజన్ పెరాక్సైడ్ తదితరాలు ఉంటాయని పరిశోధకులు తెలిపారు. అందువల్లే ఇది మంచి ఔషధంగా ప్రజలు భావించినట్లు తెలిపారు. దీన్ని గాయాలకు లేపనంగా పూస్తే త్వరితగతిన తగ్గిపోతాయని పేర్కొన్నారు. ఈ చీమల తేనె మాములు తేనె కంటే చిక్కగా ఉండి తక్కువ తీపి ఉంటుందట. ఇది మాపుల్ సిరప్‌ని పోలి ఉంటుంది. అంతేగాదు పరిశోధకులు ఈ తేనెలో ఉండో మైక్రోబయల్ను ఉపయోగించి భవిష్యత్తులో మరిన్ని మందులు తయారు చేసే దిశగా అధ్యయనాలు చేస్తున్నాట్లు పరిశోధకులు తెలిపారు. (చదవండి: ఈ ప్యాక్స్‌తో..జుట్టురాలే సమస్యకు చెక్‌పెట్టండి!) -
చీమలు పెట్టవు... పాములు ఉండవు!
చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనట్లని సుమతీ శతకకారుడు బద్దెన సెలవిచ్చినా నిజానికి చీమలు పుట్టలను తయారు చేయవు.. పాములూ వాటిని ఆక్రమించి నివసించవు. పుట్టలు చెదపురుగుల ఆవాసాలు. కొన్ని రకాల చీమలు చెదపురుగులను ఆహారంగా తీసుకునే క్రమంలో పుట్టల్లోకి చొరబడతాయి. పాములు, ఇతర సరీసృపాలు రక్షణ కోసం తాత్కాలికంగా పుట్టల్లో తలదాచుకుంటాయి. – (సాక్షి, ఏపీ నెట్వర్క్, ఆత్మకూరు రూరల్) మండు వేసవిలోనూ గది ఉష్ణోగ్రత.. పంట పొలాలు, అడవుల్లో భిన్న ఆకారాల్లో పుట్టలు సాధారణం. పిరమిడ్ ఆకారం, భూమికి కొద్ది ఎత్తులో మట్టి కుప్పల్లా పుట్టలు ఏర్పడుతుంటాయి. పైకి ఎంత ఎత్తులో కనిపిస్తాయో భూగర్భంలోనూ అంతే లోతులో గదులుంటాయి. మండు వేసవైనా, ఎముకలు కొరికే చలి కాలమైనా పుట్టల్లో కచ్చితంగా 24 డిగ్రీల సాధారణ గది ఉష్ణోగ్రత ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు. కుండపోత వర్షాలకు సైతం ఒక్క చుక్క నీరు కూడా పుట్టల్లోకి వెళ్లకపోవడం, మట్టితో నిర్మించినవే అయినా కరిగిపోకుండా ఉండటం మరో విశేషం. పుట్టల నిర్మాణంపై శాస్త్రవేత్తలు ఇప్పుడు విస్తృత పరిశోధనలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ.. అడవుల్లో వృక్షాలకు అవసరమైన సేంద్రియ పోషకాలను పుట్టల్లో ఉండే చెద పురుగులే అందిస్తాయి. చెదపురుగులు కీటక విభాగానికి చెందిన జీవులు. వీటిలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40 వేల జాతులున్నాయి. రాలిపోయిన ఆకులు, పడిపోయిన చెట్ల భాగాలను అత్యంత వేగంగా తింటూ విసర్జకాలను విడుస్తుంటాయి. తద్వారా వృక్షాలకు కంపోస్టు ఎరువు లభ్యమవుతుంది. కొన్ని రకాల వృక్ష జాతుల కణజాలంలోని సెల్యులోజ్‌ను ఆహారంగా తీసుకోవడం ద్వారా వాటిలో పరిమితికి మించి పీచు (ఫైబర్) పదార్థం పెరగకుండా నిరోధిస్తాయి. సరీసృపాలకు రక్షణ దుర్గాలు.. సరీసృపాలైన పాములు, తొండలు, బల్లులు, ఉడుములు తమ సహజ శతృవులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునేందుకు మాత్రమే పుట్టల్లో తలదాచుకుంటాయి. ఎలుగుబంట్లు పుట్టలను తవ్వి చెదలను ఆహారంగా తీసుకుంటాయి. ప్రకృతి ఇంజనీరింగ్.. జింబాబ్వే రాజధాని హరారేలో ఓ సంస్థ తన కార్యాలయం, షాపింగ్ మాల్ కోసం నిర్మించిన బహుళ అంతస్థుల భవనంలో సాధారణ ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఎలాంటి విద్యుత్ ఉపకరణాలను వినియోగించకుండా నిర్మాణం పూర్తి చేసింది. సివిల్ ఇంజనీర్ మైక్ పియర్స్ పుట్టలను అధ్యయనం చేసి ప్రకృతి ఇంజనీరింగ్‌ను అనుసరించడంతో ఇది సాధ్యమైంది. భూతాపం, కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు ఇప్పుడు ప్రపంచమంతా ఏసీలు, హీటర్లు అవసరం లేని ఇళ్ల నిర్మాణం వైపు మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలో పుట్టల నిర్మాణంలో దాగున్న ప్రకృతి ఇంజనీరింగ్ విధానాలను అధ్యయనం చేస్తున్నారు. పర్యావరణానికి జీవధాతువులు ప్రకృతి పచ్చగా ఉందంటే వృక్షాలే కారణం. ఎవరూ ఎరువులు వేయకుండా అడవుల్లో అపార వృక్ష సంపద విస్తరించటానికి కారణం పుట్టలు, అందులో ఉండే చెద పురుగులే. రాలిన ఆకులు, వృక్ష సంబంధ వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చి తిరిగి చెట్లకు అందించడంలో చెద పురుగులు అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్నాయి. వృక్షాల ఎదుగుదలకు అవసరమైన సూక్ష్మ పోషకాలన్నీ చెద పురుగులు అందించే సేంద్రియ ఎరువుల్లో ఉన్నాయి. – అలెన్ చోంగ్ టెరాన్, డిప్యూటీ డైరెక్టర్, టైగర్ప్రాజెక్టు, ఆత్మకూరు పుట్టలు ధ్వంసం చేయొద్దు పుట్టల్లో పాములుంటాయని చాలామంది అపోహ పడుతుంటారు. పొలం గట్లపై ఉండే పుట్టలను రైతులు ధ్వంసం చేస్తుంటారు. అది సరికాదు. పుట్టల్లో ఉండే చెదలు వ్యర్థాలను సేంద్రియాలుగా మార్చి సాగు భూమిని సారవంతం చేస్తాయి. – విజయకుమార్, డైరెక్టర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ -
చీమలందు తేనెచీమలు వేరయా!
తేనెటీగలు ఉంటాయి గాని, తేనెచీమలు ఏమిటనేగా మీ అనుమానం? చీమలందు తేనెచీమలే వేరు! భూమ్మీద ఎన్నోరకాల చీమలు ఉన్నా, వాటిలో తేనెను సేకరించే జాతి ఒక్కటే! అరుదైన ఈ చీమలను ‘హనీపాట్ యాంట్స్’ అంటారు. ఈ చీమలు నిరంతరం కష్టించి, తేనెను సేకరించి, తమ పుట్టల్లో నిల్వ చేసుకుంటాయి. రకరకాల మొక్కల నుంచి ఇవి పొట్ట నిండా తేనెను సేకరిస్తాయి. నెమ్మదిగా తమ స్థావరానికి చేరుకున్నాక, కదల్లేని స్థితిలో పుట్టల పైకప్పును పట్టుకుని వేలాడుతుంటాయి. తమ సాటి చీమలకు అవసరమైనప్పుడు తమ పొట్టలో దాచుకున్న తేనెను బయటకు వెలిగక్కుతాయి. ఆహారం దొరకని పరిస్థితుల్లో దాచుకున్న తేనెనే ఆహారంగా స్వీకరించి బతుకుతాయి. ఈ జాతికి చెందిన చీమలు ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మెక్సికో దేశాల్లోని ఎడారి ప్రాంతాల్లోను, బీడు భూముల్లోను కనిపిస్తాయి. -
తేనెటీగలే కాదు.. చీమలు కూడా తేనెను ఉత్పత్తి చేస్తాయని తెలుసా?
తేనె అనగానే మనకు గుర్తొచ్చేది తేనెటీగలే. అవి వివిధ రకాల పూల నుంచి మకరందాన్ని సేకరించి తేనెను ఉత్పత్తి చేస్తాయి. అందులోనూ కొన్నిరకాలే ఈ పనిచేస్తాయి. మరి వీటికి పూర్తి భిన్నంగా ఉండే ఒక రకం చీమలు కూడా తేనెను ఉత్పత్తి చేస్తాయి తెలుసా?.. ఈ చీమల తేనె, దాని సేకరణ, నిల్వ విధానం చాలా చిత్రంగా ఉంటుంది కూడా.. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.. కరువులో వాడుకొనేందుకు.. సాధారణంగా చాలా రకాల జీవులు ఎప్పుడైనా ఆహారం దొరకని పరిస్థితుల్లో వాడుకొనేందుకు వీలుగా నిల్వ చేసుకుంటూ ఉంటాయి. అది అవి మామూలుగా తినే ఆహారమే అయి ఉంటుంది. కానీ ఆ్రస్టేలియా, అమెరికా, మెక్సికోతోపాటు పలు ఆఫ్రికా దేశాల్లోని ఎడారి భూముల్లో ఉండే ఒక రకం చీమలు ఏకంగా తేనెను నిల్వ చేసుకుంటాయి. అది కూడా చిత్రమైన పద్ధతిలో కావడం విశేషం. ఇవి కాంపోనోటస్ ఇన్ఫ్లాటస్ జాతికి చెందినవి. సింపుల్‌గా హనీపాట్ చీమలు అని పిలుస్తుంటారు. శరీరంలోనే ‘తేనె’నిల్వ ► సాధారణంగా తేనెటీగలు తమ నోటిద్వారా పూల నుంచి మకరందాన్ని సేకరించి.. దానిని ప్రత్యేకమైన పట్టుల్లో నిల్వచేస్తాయి. కానీ ఈ చీమలు తేనెను నిల్వ చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లేమీ ఉండవు. వాటి శరీరంలోనే తేనెను నిల్వ చేసుకుంటాయి. అందుకే వీటిని హనీపాట్ చీమలు అని పిలుస్తుంటారు. ► సాధారణంగా చీమల కాలనీల్లో వేర్వేరు విధులను వేర్వేరు చీమలు నిర్వహిస్తుంటాయి. ఇలా వర్కర్ చీమలు పూల నుంచి మకరందాన్ని సేకరించుకుని వచి్చ.. పుట్టలోనే ఉండే హనీపాట్ చీమల నోటికి అందిస్తాయి. హనీపాట్ చీమలు దానిని తేనెగా మార్చి తమ కడుపులో నిల్వ చేస్తాయి. ► ఈ నిల్వ ఏ స్థాయిలో ఉంటుందంటే.. హనీపాట్ చీమల కడుపు పగిలిపోతుందేమో అన్నంతగా తేనెను నింపుకొంటాయి. ఆ బరువుతో కదలలేక.. పుట్టలో గోడలను పట్టుకుని చాలా రోజులు అలాగే ఉండిపోతాయి. ► పుట్టలోని చీమలకు ఆహారం కొరత తలెత్తినప్పుడు.. ఈ హనీపాట్ చీమల కడుపు నుంచి తేనెను బయటికి తీసి తినేస్తాయి. ఒక్కోసారి ఇతర పుట్టల చీమలు.. హనీపాట్ చీమలున్న పుట్టపై దాడిచేసి తేనెను ఎత్తుకుపోతుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ చీమలు.. బహుమతులు సాధారణ తేనెతో పోలిస్తే ఈ చీమల తేనె తీపిదనం తక్కువని, కాస్త పుల్లటి రుచి కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చీమల తేనెలో గ్లూకోజ్ చక్కెర శాతం ఎక్కువని.. అదే తేనెటీగల తేనెలో ఫ్రక్టోజ్ రకం చక్కెర అధికమని వివరించారు. ఆ్రస్టేలియాలో స్థానిక తెగల ప్రజలు తేనెచీమలను సేకరించి బహుమతిగా ఇచ్చి పుచ్చుకుంటారట కూడా. చదవండి: మనసు మాట వినే చక్రాల కుర్చీ! -
‘సరితా.. ఏందే ఇది!’.. అన్నంలో చీమలు పడ్డాయని..
క్రైమ్: క్షణికావేశంలో నేరాలు జరుగుతుంటే.. వాటి వెనకాల కారణాలు ఒక్కోసారి చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. తాజాగా అన్నానికి చీమలు పట్టడం అనే కారణం.. ఒక కాపురంలో చిచ్చుపెట్టాయి. ఆ గొడవ ముదిరి ఏకంగా ఒక ప్రాణం పోయింది. సరితా-హేమంతకు చాలా కాలం కిందట వివాహం అయ్యింది. వీళ్లకు ఇద్దరు ఆడబిడ్డలు. గురువారం రాత్రి హేమంత భోజనానికి కూర్చున్నాడు. ఈ క్రమంలో సరిత అన్నం ప్లేట్ అందించింది. అయితే.. అన్నంలో చీమలు ఉండడంతో నిలదీశాడు హేమంత. రోజూ అలాగే ఇస్తున్నావంటూ మండిపడ్డాడు. అది ఆమెకు కోపం తెప్పించింది. ఇద్దరి మధ్య గొడవ పెద్దది అయ్యింది. సహనం కోల్పోయిన సరిత.. రాత్రి పడుకున్న తర్వాత భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. ఉదయం ఏం తెలియనట్లు కన్నీళ్లు పెట్టుకుంది. అయితే అనుమానంతో హేమంత తండ్రి శశిభూషణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమె గట్టిగా నిలదీయడంతో.. నిజం ఒప్పుకుంది. ఒడిషా సుందర్‌ఘడ్ జిల్లాలో గురువారం ఈ నేరం చోటుచేసుకుంది. -
మేం ఎంత మంది ఉన్నామో చూశారా..
భూమ్మీద ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయని ఎవరైనా అడిగితే మీరేం చెబుతారు? ఇదేం పిచ్చి ప్రశ్న.. వాటినెలా లెక్కేస్తాం? అని ఎదురు ప్రశ్నిస్తారు. మరి భూమ్మీద ఎన్ని చీమలున్నాయని అడిగితే మీ సమాధానం? మళ్లీ ఇంకో పిచ్చి ప్రశ్న అని తీసిపారేయవద్దు. ఎందుకంటే... జర్మనీలోని జులియస్ మాక్స్మిలియన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చీమల సంఖ్యను మాత్రమే కాదు.. వాటన్నింటినీ ఒక దగ్గర చేరిస్తే ఎంత బరువు ఉంటాయో కూడా లెక్కలేసి తేల్చేశారు మరి!! కొంచెం విచిత్రంగా అనిపించినా ఇది నిజమే. భూమ్మీద మొత్తం చీమల సంఖ్యపై ఇప్పటి వరకూ సరైన అంచనా ఏదీ లేకపోవడంతో జర్మనీ శాస్త్రవేత్తలు లెక్కలేసేందుకు నడుం బిగించారు. అంతేకాదు.. చీమల సంఖ్య అడవుల్లో ఎంత ఉంటుంది? ఎడారుల్లోనైతే ఎంత? తేమ ఉన్నచోట?... నగరాల్లో? ఇలా రకరకాల జీవావరణ వ్యవస్థల్లో చీమల ఉనికి ఎంత మేరకు ఉందో తెలుసుకునేందుకు వీరు అందుబాటులో ఉన్న పరిశోధన వ్యాసాలన్నింటినీ జల్లెడ పట్టారు. ఈ అంశంపై ఇప్పటివరకూ ప్రచురితమైన సుమారు 489 అధ్యయనాల సారాంశాన్ని వడపోసి ‘‘ఈ భూమ్మీద మొత్తం 20 క్వాడ్రిలియన్ల చీమలున్నాయి’’ అని తేల్చారు! అంటే 20 పక్కన 15 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అన్నమాట(200 కోట్ల కోట్లు). దీన్నే మరోలా చెప్పాలంటే విశ్వం మొత్తమ్మీద ఉన్న నక్షత్రాలకు 2 వేల రెట్ల ఎక్కువ సంఖ్యలో చీమలున్నాయట! అక్కడ ఒక్క చీమా లేదు! ఎన్ని ఉన్నాయో తెలిసింది! బరువెంతో కూడా స్పష్టమైంది. మరి.. ఏ ప్రాంతంలో ఎక్కువ చీమలు ఉన్నాయి? ఎక్కడ తక్కువ ఉన్నాయి? ఈ ప్రశ్నలకూ జర్మనీ శాస్త్రవేత్తలు సమాధానాలు కనుగొన్నారు లెండి. భూమధ్య రేఖకు 10 డిగ్రీలు పైన, కింద ఉండే ఉష్ణమండల ప్రాంతాల్లో చీమలు పుట్టలు పుట్టలుగా ఉంటే.. నగర ప్రాంతాల్లో అతితక్కువగా ఉన్నాయట. ధ్రువ ప్రాంతాల్లో ఒక్క చీమ కూడా లేదట. అధ్యయనం ఎందుకంటే.. చీమల లెక్కలేసేందుకు శాస్త్రవేత్తలు ఎందుకు శ్రమ పడ్డారన్న సందేహం వచ్చిందా? అయితే ఇవి చేసే పనులు తెలిస్తే శాస్త్రవేత్తలు సరైన పనే చేశారని మీరే అంటారు. ఎందుకంటే.. ఒక్కో హెక్టారు నేల నుంచి చీమలు ఏటా 13 టన్నుల మట్టిని అటూఇటు మారుస్తుంటాయట! నేల లోపలి పోషకాలను పైపొరల్లోకి చేర్చడం ద్వారా పంట దిగుబడులను ప్రభావితం చేస్తూంటాయట!! అలాగే విత్తనాలను ఒక ప్రాంతం నుంచి ఇంకో చోటకు చేర్చడంలోనూ చీమలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్యాట్రిక్ షూల్థెసిస్ వివరించారు. బరువు అతి భారీగానే.. గండుచీమ, నల్లచీమ, ఎర్ర చీమలన్నింటి సంఖ్యపై ఓ స్పష్టత సాధించిన జర్మనీ శాస్త్రవేత్తలు.. ఆ తరువాత వాటి మొత్తం బరువును అంచనా వేశారు. వేర్వేరు ప్రాంతాలు, జీవావరణ వ్యవస్థల్లోని చీమల రకాలను.. వాటి సగటు బరువులను పరిగణనలోకి తీసుకుని చూస్తే.. వాటి మొత్తం బరువు కోటీ ఇరవై లక్షల టన్నులని తేలింది! భూమ్మీద ఉన్న అన్ని పక్షులు, మానవులను మినహాయించి మిగిలిన క్షీరదాల మొత్తం బరువు కంటే చీమల బరువే ఎక్కువ కావడం గమనార్హం. -
శ్రీకాకుళం జిల్లాలో ఎర్ర చీమల దండయాత్ర.. హడలిపోతున్న జనం..
ఆమదాలవలస రూరల్(శ్రీకాకుళం జిల్లా): బెల్లం చుట్టూ ఈగలు ముసరడం ఎంత సహజమో.. ఆహార పదార్థాలు ఎక్కడుంటే అక్కడ చీమల దండు చేరడం సహజం. మనం దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. చీమల మందు చల్లి అవి చేరకుండా జాగ్రత్త పడతాం. మన సమీపంలో ఒకటి రెండు చీమలు కనిపిస్తే నలిపి పారేస్తాం. కానీ ఆ చీమలే ఒక గ్రామానికి నరకం చూపిస్తున్నాయి అంటే నమ్మగలమా?!.. కానీ అది వాస్తవం. చదవండి: మస్కట్‌లో ఏం జరిగింది..? మహిళ సెల్ఫీ వీడియో కలకలం.. చలి చీమల చేతికి విష సర్పం చిక్కినట్లు.. ఈ చీమల దండ యాత్రతో ఆమదాలవలస మండలం ఇసుకలపేట గ్రామస్తులు విలవిల్లాడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా చీమల దండే కనిపిస్తోంది. సాధారణంగా చీమలు కరుస్తాయి. కాసేపు మండినట్లు అనిపించి తగ్గిపోతుంది. కానీ ఇక్కడి చీమలు శరీరంపై పాకినప్పుడు విడిచిపెడుతున్న లార్వా లాంటి ద్రవం వల్ల అలెర్జీ వస్తోంది. దద్దుర్లు, కురుపులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఎర్ర చీమలు బెంబేలెత్తిస్తున్నాయి. కరవకుండానే తీవ్ర అస్వస్థతకు గురి చేస్తున్నాయి. శరీరంపై పాకి వెళ్లిన పది నిమిషాల్లో దద్దుర్లు వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. దీంతో ఎర్రచీమలు అంటేనే ఆమదాలవలస మండలం తొగరాం పంచాయతీ ఇసుకలపేట గ్రామస్తులు హడలిపోతున్నారు. ఇంటిలో ఎర్ర చీమల దండు శరీరం అంతా అలర్జీ.. ఇసుకలపేటలో ఎర్ర చీమలు దండు వల్ల ఇప్పటికే పలువురు అంతుచిక్కని అలర్జీకి గురవుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాళ్లు, చేతులపై ఎక్కడ పాకినా అక్కడ అలర్జీ వస్తుంది. పది నిమిషాల్లో దురద వచ్చి చిన్నపాటి పొక్కులు వస్తున్నాయి. చీమల నోటి నుంచి వచ్చే లార్వా, గుర్తు తెలియని రసాయనం విడిచిపెట్టడం వల్లే ఈ సమస్య వస్తోందని పలువురు చెబుతున్నారు. అలర్జీతో పాటు చిన్నపాటి జ్వరం వచ్చి శరీరం అంతా నొప్పులు వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. బాధితులు సమీపంలోని ఆర్ఎంపీలు, ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద చికిత్స పొందుతున్నారు. గాయాలు నయం కావడానికి 10 రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు. ఇందుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చవుతోందని అంటున్నారు. చీమల వలన ఇలా ఎందుకు జరుగుతుందో వైద్యులు సైతం చెప్పలేకపోతున్నారు. ఎర్ర చీమలతో ఇబ్బందులు పడుతూ అనారోగ్యాలకు గురవుతున్నామంటూ గ్రామస్తులు ఇటీవలే కలెక్టర్ స్పందనలో ఫిర్యాదు చేశారు. చీమలదండు కట్టడికి చర్యలు తీసుకుని, అలర్జీకి గల కారణాలు గుర్తించాలని కోరారు. చీమల నివారణకు చర్యలు.. ఎర్రచీమలు ఇళ్లలోకి రాకుండా గ్రామస్తులు సొంతంగా రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇళ్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆహార పదార్థాలకు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. పురుగు మందులు పిచికారీ చేయడం, చీమల మందును చల్లడం వంటి చర్యలు చేపడుతున్నారు. అధికారులు సైతం తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇబ్బంది పడుతున్నాం.. చీమలు కాళ్లపై పాకడంతో పుండ్లు ఏర్పడి గాయాలయ్యాయి. ఆమదాలవలసలోని ఓ వైద్యుడి వద్దకు వెళ్లి చికిత్స చేయించుకున్నాను. ఈ ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించాలి. – సూర గోవిందమ్మ, ఇసుకలపేట, ఆమదాలవలస మండలం చికిత్సకు రూ.10 వేలు ఖర్చు చీమల వల్ల అలర్జీ వస్తుందని మొదట్లో గుర్తించలేకపోయాం. కాలిపై ఎక్కువ గాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చర్మవ్యాధి నిపుణుడి వద్దకు చికిత్స కోసం వెళితే రూ.10 వేలు ఖర్చయ్యింది. పశువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. – అన్నెపు సూర్యనారాయణ, ఇసుకలపేట వైద్య సేవలు అందిస్తున్నాం చీమల బాధితులకు వైద్యసేవలు అందజేస్తున్నాం. ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ప్రస్తుతానికి వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేస్తున్నాం. చీమల నోటి ద్వారా రసాయనం విడుదల చేయడంతో అలర్జీ వస్తుందని గుర్తించాం. మందులు వాడాక మళ్లీ అలర్జీ వస్తే ప్రమాదం. చీమ లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియడం లేదు. – శ్రీనివాసరావు, వైద్యాధికారి, తొగరాం పీహెచ్సీ, ఆమదాలవలస మండలం -
Red Ant: చీమలు బాబోయ్.. చీమలు!..వేధిస్తున్న ఎర్ర రాకాసి చీమలు
సాక్షి, భువనేశ్వర్: ‘చీమలు బాబోయ్ చీమలు. భరించ లేకపోతున్నాం. ఊరు వదిలి వెళ్లిపోవాల్సిందే. మునుపెన్నడూ ఇటువంటి చీమల దండుని చూడనే లేదు’ ఇదీ.. పూరీ జిల్లా పిప్పిలి మండలం చంద్రాదెయిపూర్ పంచాయతీ బ్రాహ్మణ సాహి గ్రామస్తుల ఆర్తనాదం. ఈ గ్రామంలో చీమలు దండెత్తుతున్నాయి. అక్కడున్న వారిని కాటు కంటే ఘాటుగా కుడుతున్నాయి. చీమ కుట్టిన వారి బతుకు దుర్బరం అవుతుందనే భయాందోళనలతో గ్రామం మార్మోగుతోంది. గత 2 నెలలుగా ఈ వేధింపులు భరించలేక గ్రామం విడిచి పెట్టేందుకు మూటాముల్లె సర్దుకుంటున్నారు. దీని ప్రభావంతో గ్రామానికి చెందిన కుముద్ దాస్ కుటుంబం వేరే ఊరికి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ చీమలు మామూలు చీమలు కాదు. ఎర్రటి రాకాసి చీమలు. అసాధారణ పరిమాణంలో దండుగా చొరబడుతున్నాయి. సందు దొరికితే పుట్ట గట్టుకుని బస చేస్తున్నాయి. జోలికిపోతే కుట్టి గాయపరుస్తున్నాయి. ఈ చీమ కుడితే విపరీతమైన దురదతో దద్దర్లు పొక్కి క్రమంగా గాయమైపోతుంది. కుట్టిన చోటు వాచి, కదల్లేని విపరీత పరిస్థితులు ఆవహిస్తున్నాయి. గ్రామంలో ఇంటా బయట చీమల దండు హోరెత్తుతోంది. గ్రామ శివార్లు కాలువ ప్రాంతం నుంచి చీమల దండు ఆవిర్భవిస్తున్నట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. పొలాలు, రహదారులు, ఇల్లు, వాకిలి, లోపలా, బయట అన్ని చోట్లా గుట్టలుగా పేరుకు పోతున్నాయి. ఇళ్ల మట్టి గోడల్లో చిన్నపాటి సందు కుదిరతే పుట్టగట్టి బస ఏర్పరచుకుంటున్నాయి. గోడల మీద పాకే బల్లి, వాకిట్లో కప్పలు, పిల్లులు వంటి మూగ జీవులను సైతం బతకనీయడం లేదని గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. ఏం చేయాలో తోచని దయనీయ పరిస్థితుల్లో గ్రామం విడిచి పోయేందుకు గ్రామస్తులు నడుం బిగిస్తున్నారు. నిపుణుల అభయం.. గ్రామంలో తాండవిస్తున్న చిత్ర విచిత్ర విపత్కర పరిస్థితి నివారించేందుకు చంద్రాదెయిపూర్ పంచాయతీ సర్పంచ్ రంగంలోకి దిగారు. స్థానిక మండల అభివృద్ధి అధికారి(బీడీఓ)తో ప్రత్యక్షంగా సంప్రదింపులు జరిపారు. మండల అధికార యంత్రాంగం చొరవతో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఈ పరిస్థితిని పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో బెంబేలెత్తాల్సిన పరిస్థితి లేదని గ్రామస్తులకు ఈ బృందం భరోసా ఇచ్చారు. ఇంకా నివారణోపాయం స్పష్టం కానందున గ్రామస్తుల మాత్రం ఆందోళన వీడటం లేదు. చీమల జోలికి పోకుండా దూరంగా ఉండటం తాత్కాలిక ముప్పు నివారణోపాయంగా నిపుణుల బృందం పేర్కొన్నారు. -
Photo Feature: చీమ.. బలానికి చిరునామా..
ఇండోనేసియా: మనుషులను బాహుబలి బాహుబలి అంటాం గానీ.. అసలైన బాహుబలులు ఈ చీమలే.. చూశారుగా.. వాటి బలం.. తమ బరువుకు 10 రెట్ల బరువును అవి అలవోకగా మోయగలవు. ఇండోనేసియాకు చెందిన ఫొటోగ్రాఫర్ జాల్ఫిక్రి ఈ చిత్రాన్ని తీశారు. -
వైరల్ వీడియో: బంగారాన్ని దొంగలిస్తున్న చీమలు.. అట్లుంటది మరి వాటితోని!
ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని పెద్దలు అంటుంటారు. చిన్న ప్రాణులైనా తలుచుకుంటే ఏదైనా చేయగలవని చాలా సార్లు నిరూపితమైంది కూడా. ఇక చీమలంటే చక్కెరనో, లేదా అవి తినేందుకు ఏవైనా పదార్థాలనో ఎత్తుకెళ్తుంటాయి. అవి సైజులో చిన్నవి కాబట్టి అవి మోసుకెళ్లే వస్తువులు కూడా చిన్నవిగా ఉండి మోయడానికి వీలుగా ఉంటే వాటినే తీసుకెళ్తుంటాయి. ఇక్కడ వరకు మనకు తెలిసినదే, అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కూడా. అయితే ఈ వీడియోలో ఏకంగా వాటి సైజుకు మించి, బంగారపు గొలుసుని దొంగలిస్తున్నాయి. అందుకే చీమలను కూడా చీప్‌గా చూడకూడదంటారు. చీమలు బంగారపు గొలుసు ఎత్తుకెళ్లడమేంటి, వినడానికి వింతగా ఉన్నా కూడా ఇది నిజమే. కొన్ని చీమలు కలిసి ఒక బంగారు చైన్‌ను ఎత్తుకెళ్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ వీడియో షేర్ చేసిన ఆయన.. ‘‘చిన్ని గోల్డ్ స్మగ్లర్లు.. వీళ్లను ఏ ఐపీసీ సెక్షన్ కింద బుక్ చేయాలి?’’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘‘ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇవి బంగారం గొలుసును ఎందుకు తీసుకెళ్తున్నట్లు?’’ అని కామెంట్ చేశారు. చాలా వరకు ఆ చీమల గుంపు బంగారం గొలుసుని ఎత్తుకెళ్లడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. Tiny gold smugglers 😀😀 The question is,under which section of IPC they can be booked? pic.twitter.com/IAtUYSnWpv — Susanta Nanda IFS (@susantananda3) June 28, 2022 -
వింత వ్యాధితో అవస్థలు పడుతున్న విద్యార్థిని.. కళ్లు తెరిస్తే...
వేలూరు(తమిళనాడు): రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపంలోని సాత్తూరు గ్రామానికి చెందిన పూంగొడి, గాండీభన్ దంపతుల కుమార్తె షాలిని(14). అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే గత 6 నెలలగా ఈ బాలికకు ఎడమ కన్ను వాపు రావడంతో పాటు.. కంటి నుంచి చలి చీమలు బయటకు రావడం మొదలు పెట్టాయి. రోజుకు సగటున 15 చీమలు బయటకు వస్తున్నట్లు వారు వెల్లడించారు. దీంతో తల్లిదండ్రులు షాలినికి వైద్య పరీక్షలు చేయింగా.. అన్నీ టెస్ట్‌లు నార్మల్‌గానే ఉన్నట్లు తెలిసింది. కంటి నుంచి రోజూ చలి చీమలు వస్తూనే ఉండడంతో పాఠశాలకు వెళ్లలేక, సాధారణ జీవితాన్ని అనుభవించలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ మేరకు విద్యార్థినితో పాటు ఆమె తల్లి పూంగొడి కలెక్టర్ భాస్కర్ పాండియన్‌కు మంగళవారం వినతిపత్రం సమర్పించింది. ఆయన వాలాజలోని ప్రభుత్వ కంటి వైద్యశాలలో బాలికను చేర్పించి చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కంటి వైద్య నిపుణులు విద్యార్థినిని పర్యవేక్షిస్తున్నారు. చదవండి: నటుడి కుమార్తె భర్త కిడ్నాప్.. రాజ్యలక్ష్మి ఇంట్లో డెడ్ బాడీ.. ఏం జరిగింది..? -
చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించగలవట! ఎలాగో తెలుసా!
Scientists Discover Ants Can Identify Cancerous Cells: ప్రస్తుత వైద్యావిధానంలో సరికొత్త మార్పుల చోటు చేసుకుంటున్నాయి. కేవలం సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యాధునిక వైద్యాన్ని అందించడమే కాక తమ చుట్టూ అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ ఖర్చుతో సామాన్యులకు సైతం వైద్యం అందించేందుకే శాస్త్రవేత్తల బృందం నిరతరం కృషి చేస్తోంది. అందులో భాగంగానే శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్స, త్వరితగతిన గుర్తించు విధానాలపై అధ్యయనాలు చేశారు. తాజా అధ్యయనాల్లో చీమలు అత్యంత సులభంగా మానవుని శరీరంలోని క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించగలవు అని కునుగొన్నాం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలాగో తెలుసా!. వివరాల్లోకెళ్తే..చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు వాటి వాసన సామర్థ్యాన్ని ఉపయోగించగలవని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ పరిశోధనలుల చేయడానికి సిల్కీ చీమలు అని పిలిచే ఫార్మికా ఫుస్కా అనే చీమలను వినియోగించింది. వాటికి రివార్డ్ సిస్టమ్ ద్వారా శిక్షణ ఇచ్చింది. నిజానికి అవి తమ వాసన సాయంతోనే ఆహారాన్ని సంపాదించుకునే చీమలు మానవునిలోని క్యాన్సర్ కణాల నంచి ఆరోగ్యకరమైన కణాలను వేరుచేయగలవు అని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎన్ఆర్ఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ శాస్త్రవేత్త బృందం చాలా సమర్ధవంతంగా క్యాన్సర్‌ని నయం చేసే పద్ధతులను అన్వేషించే క్రమంలోనే ఈ విషయాన్ని కనుగొన్నారు. మానవ క్యాన్సర్ కణాలను గుర్తించడానికి చీమను జీవన సాధనాలుగా ఉపయోగించడం అత్యంత సులభమైనది మాత్రమే కాక తక్కువ శ్రమతో కూడినదని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ చీమలకు తొలుత చక్కెర ద్రావణంతో వాసనకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి. ఆ తర్వాత అవి క్రమంగా రెండు వేర్వేరు రకాల క్యాన్సర్ కణాలను గుర్తించుకునే స్థాయికి చేరుకుంటాయి. ఇప్పుడు వాటి సామర్థ్యాన్ని మానవుడిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అంచనా వేయాల్సి ఉందని చ్పెపారు. అయితే ఈ మొదటి అధ్యయనం చీమలు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, చాలా త్వరగా, తక్కువ ఖర్చుతో నేర్చుకోవడమే కాక సమర్థవంతంగా పనిచేస్తాయని తేలిందని అన్నారు. అంతేగాదు ఈ చీమలు మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు లేదా ఇతర వ్యాధులకు సంబంధించిన వాసనలను కూడా పసిగట్టే సామర్థ్యం పై పరిశోధనలు చేస్తున్నారు. అయితే వాటికి మంచి ఘ్రాణ శక్తి కలిగి ఉందని తెలిపారు. పైగా కుక్కుల కంటే చాలా త్వరతిగతిన క్యాన్సర్ కణాల గుర్తింపు శిక్షణను చీమలు తీసుకోంటాయని అన్నారు. (చదవండి: చెర్నోబిల్‌లో ‘అణు’మానాలు.. భయం గుప్పిట్లో యూరప్) -
Science Facts: చీమల రక్తం అందుకే ఎర్రగా ఉండదట..!
Why is Ant’s Blood Not Red Like We Humans Have: చురుక్ మని కుట్టి పుసుక్కున జారుకునే చీమలను... ఒక్కోసారి దొరకపుచ్చుకుని కసితీర నలిపి అవతలేస్తాం కూడా!! కానీ మనుషుల రక్తం తాగే చీమల్లో కూడా రక్తం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏ రంగులో ఉంటుంది? ఇలాంటి అనుమానాలు ఎప్పుడైనా వచ్చాయా? మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో.. చీమల్లో రక్తం ఉంటుంది. ఐతే అది ఎరుపు రంగులోకాకుండా పసుపు పచ్చరంగులో ఉంటుంది. దీనిని హేమోలింఫ్ అని అంటారు. మిడతలు, నత్తల వంటి వర్టిబ్రేట్స్ (వెన్నెముక ఉండే జంతువులు - సకశేరుకాలు)లో ఈ విధమైన రక్తం ఉంటుంది. ఈ ద్రవంలో ఎర్ర రక్తకణాలు లేకపోవటం వల్ల తెల్లగా కనిపిస్తుంది. చీమలు వంటి ఇతర కీటకాల్లో అమైనో యాసిడ్స్ అధికంగా ఉండటమే అందుకు కారణమట. చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!! వీటి రక్త ప్రసరణ వ్యవస్థ కూడా భిన్నంగా ఉంటుంది. మనుషుల్లో రక్తం సిరలు, ధమనుల్లో ప్రవహిస్తుంది. ఐతే కీటకాల్లో మాత్రం ధమనులు ఉండవు కానీ శరీరమంతా స్వేచ్ఛగా ఏ దిశలోనైనా రక్తం ప్రవహిస్తుంది. అందువల్లనే చీమలు ఎటువంటి వాతావరణంలోనైనా సులభంగా జీవించగలవు. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉన్నట్లే, హిమోలింఫ్ లోపల హిమోసైనిన్ ఉంటుంది. రక్తం - హిమోలింఫ్ మధ్య గుమనించదగిన ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే.. మనుషుల్లోనైతే రక్తం ద్వారా ఆక్సిజన్ శరీరం అంతటా వ్యాపిస్తుంది. కీటకాల్లో ఉండే హేమోలింఫ్ ఆక్సిజన్‌ను శరీరం అంతటా వ్యాపింపచేయదు. వీటి శరీరాలకు స్పిరాకిల్స్ అని పిలువబడే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. ఈ రంధ్రాలు ఎర్ర రక్త కణాలతో పనిలేకుండా నేరుగా క్రిమి అవయవాలకు ఆక్సిజన్ చేరవేస్తుంటాయి. చదవండి: Viral: తెలుసా! ఈ ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావట..! -
‘బలమైన విమానం చీమల చేతచిక్కి ఆగెన్’.. ఎలాగంటే!
న్యూఢిల్లీ: ‘బలవంతమైన సర్పము చలి చీమల చేతచిక్కి చావదె’... అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా! ఆధునిక యుగంలో దీన్ని కాస్త మార్చి ‘బలమైన విమానం చీమల చేతచిక్కి ఆగెన్’ అని చదువుకునే చిత్రమైన సంఘటన జరిగింది. అలాంటి చిత్రమైన ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. లండన్ వెళ్లే ఎయిర్ఇండియా విమానం చీమల కారణంగా కొన్ని గంటలు ఆగింది. బిజినెస్ క్లాసులో చీమల గుంపు కనిపించడంతో టేకాఫ్ ఆపేశారు. (చదవండి: తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!) ప్రయాణికులను మరో విమానంలోకి ఎక్కించి పంపించారు. ఈ విమానంలోనే భూటాన్ యువరాజు జిగ్మే నాంగ్యేల్ వాంగ్‌చుక్ ఉన్నారు. ఎయిర్ఇండియా విమానాలు ఇటీవల కాలంలో చిత్రమైన కారణాలతో ఆలస్యం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలోనూ సౌదీ అరేబియా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సరకు రవాణా విమానాన్ని కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం విండ్ షీల్డ్‌లో పగుళ్లు గుర్తించడమే ఇందుకు కారణం. అంతకుముందు మేలో దిల్లీ నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్‌లో గబ్బిలం ఉన్నట్లు గుర్తించారు. (చదవండి: Karnataka Toddler Swallowed Coin: ఐదు రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కొని) -
‘ఈ వెయ్యి కోట్ల ప్రశ్నకు సమాధానం తెలుసా?’
ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు నచ్చిన విషయాలను ట్విటర్ వేదికగా అందరితో పంచుకుంటూ ఉంటారు. తాజాగా చీమల పెళ్లికి సంబంధించి ట్విటర్లో ఓ పోస్టు చేశారు. ‘‘ ఇది చూసిన తర్వాత నవ్వి నవ్వి నా కడుపు ఇప్పటికి కూడా నొప్పితీస్తోంది. శ్రీ అముల్ భారతే అనే వ్యక్తి అడిగిన ఓ సాంకేతిక వివరణ ఇందుకు కారణం. నేను ఇప్పటి వరకు విన్న చీమల పెళ్లిళ్లకు సంబంధించిన పెద్ద జోక్ ఇదే ’’ అంటూ కామెంట్ చేశారు. ( భావోద్వేగ దృశ్యం: కన్నీళ్లు ఆగడం లేదు ) ఇంతకీ విషయం ఏంటంటే.. ఓ ఒంటరి చీమ 29 సంవత్సరాలు జీవిస్తుంది.. అని ఎవరో ఓ పోస్టు పెట్టారు. అముల్ భారతే అనే వ్యక్తి దానిపై కామెంట్ చేస్తూ.. మరి పెళ్లైన చీమ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంది? అని ప్రశ్నించారు. దీన్ని చదివిన ఆనంద్ మహేంద్ర పగలబడి నవ్వుకున్నారు. దీన్ని తన ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్.. వేలల్లో కామెంట్లు, లైకులతో ముందుకు దూసుకుపోతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఈ వెయ్యి కోట్ల ప్రశ్నకు సమాధానం తెలుసా?... పెళ్లైన చీమలకు చావు ఉండదు.. ఎందుకంటే అవి ప్రతి రోజు చస్తూ బ్రతుకుతుంటాయి... అది వాటి భాగస్వామి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది’’ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. My gut is still hurting from how hard I laughed when seeing this. Shri Amol Bharate asked for a ‘technical clarification’ which made this one of the funniest jokes about the perils of marriage that I have ever heard... #SundayFunday pic.twitter.com/Wlli8TtETi — anand mahindra (@anandmahindra) November 15, 2020 -
ఈ చీమలను చూసి నేర్చుకోండి!
-
ఈ చీమలను చూసి నేర్చుకోండి!
చిన్నపాటి ఆటంకాలు ఎదురైతే చాలు..చేస్తున్న, చేసే పని మధ్యలో ఎగ్గొట్టడానికి ప్రయత్నించేవారు చాలామందే ఉంటారు. కానీ ఈ చీమలు అలా చేయలేదు. ఐకమత్యంతో అనుకున్నది సాధించి మనుషులకు గుణపాఠాన్ని నేర్పించాయి. పిట్టగోడపై వెళుతున్న చీమలదండుకు మధ్యలో ఖాళీ ప్రదేశం కనిపించింది. దాన్ని దాటి అటువైపుకు ఎలా వెళ్లాలో వాటికి అర్థం కాలేదు. అలా అని వెనక్కు తిరిగి వెళ్లనూలేవు. ఏదేమైనా అవతలి గట్టుకు చేరుకోవాలనుకున్నాయి. అనుకున్నదే తడవుగా చేయి చేయి కలిపాయి. ఒక్కొక్కటిగా కలిసి గాలిలోనే వంతెనలా ఏర్పడ్డాయి. పట్టు వదలని విక్రమార్కునిలా చీమలు అనుకున్న పని సాధించి, ఐకమత్యమే మహా బలం అన్న మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి. కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన చీమలదండు వీడియోను ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా ట్విటర్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వాటి ఐకమత్యానికి అబ్బురపడుతున్నారు. చీమలను చూసైనా మనుషులు కాస్త నేర్చుకుంటే బాగుంటుంది అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. కలసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని చీమలు మరోసారి నిరూపించాయని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా పలుసార్లు జంతువుల మనుషులకు పాఠాలు నేర్పే వీడియోలు వైరల్‌గా మారాయి. ఓ కోతి తన దాహాన్ని తీర్చుకున్న తర్వాత కుళాయిని కట్టేసిన వీడియో అందర్నీ ఆలోచింపజేసేలా చేసింది. ఇక ఓ ఏనుగు రోడ్డుపై పడి ఉన్న వ్యర్థ పదార్థాలను చెత్తడబ్బాలోకి విసిరేసి శభాష్ అనిపించుకున్న సంగతి తెలిసిందే! -
పురుగుల్ని నమిలి మింగేశాడు..
-
ఆ విషంతో కేన్సర్ కణాలకు చెక్!
శరీరంలోని కేన్సర్ కణాలను మాత్రమే విజయవంతంగా నాశనం చేసేందుకు కొన్ని రకాల మొక్కలు, చీమల్లోని రసాయనం ఉపయోగపడుతుందని వార్విక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంటున్నారు. కేన్సర్ కణాలు వేగంగా విడిపోయేందుకు కారణమైన వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని పనిచేయడం ద్వారా ఈ రసాయనం పనిచేస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ తెలిపారు. మొక్కలు, చీమలతోపాటు అనేక జీవజాతుల్లో సోడియం ఫార్మాట్ అనే రసాయనం ఒకటి ఉంటుంది. దీనిన జేపీసీ11 అనే సేంద్రీయ పదార్థంతో కలిపి ప్రయోగించినప్పుడు కేన్సర్ కణాల విభజనకు ఉపయోగపడే పైరువేట్ రసాయనం కాస్తా అసహజమైన లాక్టేట్‌గా మారిపోతుంది. ఫలితంగా కణ విభజన స్తంభించిపోతుంది. కేన్సర్ కణాలు నాశనమైపోతాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఒకే కేన్సర్ కణంపై ఈ రసాయనం మళ్లీమళ్లీ దాడి చేయగలదు కాబట్టి ఏ కణం కూడా దీని ప్రభావం నుంచి తప్పించుకోలేదని అంచనా. ఈ సరికొత్త రసాయన మిశ్రమం కేన్సర్‌పై పోరులో కీలక పాత్ర పోషించగలదని పీటర్ అంటున్నారు. కీమోథెరపీలో వాడే విషపూరిత రసాయనాల మోతాదును అతితక్కువ మోతాదులో వాడటం ద్వారా దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గింవచ్చు. కేన్సర కణాలకు మాత్రమే పరిమితమైన వ్యవస్థలే లక్ష్యంగా పనిచేస్తూండటం వల్ల ఆరోగ్యకరమైన కణాలకు ఏమాత్రం హాని జరగదని పీటర్ చెప్పారు.