
తేనెటీగలు ఉంటాయి గాని, తేనెచీమలు ఏమిటనేగా మీ అనుమానం? చీమలందు తేనెచీమలే వేరు! భూమ్మీద ఎన్నోరకాల చీమలు ఉన్నా, వాటిలో తేనెను సేకరించే జాతి ఒక్కటే! అరుదైన ఈ చీమలను ‘హనీపాట్ యాంట్స్’ అంటారు. ఈ చీమలు నిరంతరం కష్టించి, తేనెను సేకరించి, తమ పుట్టల్లో నిల్వ చేసుకుంటాయి.
రకరకాల మొక్కల నుంచి ఇవి పొట్ట నిండా తేనెను సేకరిస్తాయి. నెమ్మదిగా తమ స్థావరానికి చేరుకున్నాక, కదల్లేని స్థితిలో పుట్టల పైకప్పును పట్టుకుని వేలాడుతుంటాయి. తమ సాటి చీమలకు అవసరమైనప్పుడు తమ పొట్టలో దాచుకున్న తేనెను బయటకు వెలిగక్కుతాయి. ఆహారం దొరకని పరిస్థితుల్లో దాచుకున్న తేనెనే ఆహారంగా స్వీకరించి బతుకుతాయి. ఈ జాతికి చెందిన చీమలు ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మెక్సికో దేశాల్లోని ఎడారి ప్రాంతాల్లోను, బీడు భూముల్లోను కనిపిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment