ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు నచ్చిన విషయాలను ట్విటర్ వేదికగా అందరితో పంచుకుంటూ ఉంటారు. తాజాగా చీమల పెళ్లికి సంబంధించి ట్విటర్‌లో ఓ పోస్టు చేశారు. ‘‘ ఇది చూసిన తర్వాత నవ్వి నవ్వి నా కడుపు ఇప్పటికి కూడా నొప్పితీస్తోంది. శ్రీ అముల్ భారతే అనే వ్యక్తి అడిగిన ఓ సాంకేతిక వివరణ ఇందుకు కారణం. నేను ఇప్పటి వరకు విన్న చీమల పెళ్లిళ్లకు సంబంధించిన పెద్ద జోక్ ఇదే ’’ అంటూ కామెంట్ చేశారు. ( భావోద్వేగ దృశ్యం: కన్నీళ్లు ఆగడం లేదు )
ఇంతకీ విషయం ఏంటంటే.. ఓ ఒంటరి చీమ 29 సంవత్సరాలు జీవిస్తుంది.. అని ఎవరో ఓ పోస్టు పెట్టారు. అముల్ భారతే అనే వ్యక్తి దానిపై కామెంట్ చేస్తూ.. మరి పెళ్లైన చీమ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంది? అని ప్రశ్నించారు. దీన్ని చదివిన ఆనంద్ మహేంద్ర పగలబడి నవ్వుకున్నారు. దీన్ని తన ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్.. వేలల్లో కామెంట్లు, లైకులతో ముందుకు దూసుకుపోతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఈ వెయ్యి కోట్ల ప్రశ్నకు సమాధానం తెలుసా?... పెళ్లైన చీమలకు చావు ఉండదు.. ఎందుకంటే అవి ప్రతి రోజు చస్తూ బ్రతుకుతుంటాయి... అది వాటి భాగస్వామి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది’’ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
My gut is still hurting from how hard I laughed when seeing this. Shri Amol Bharate asked for a ‘technical clarification’ which made this one of the funniest jokes about the perils of marriage that I have ever heard... #SundayFunday pic.twitter.com/Wlli8TtETi
— anand mahindra (@anandmahindra) November 15, 2020
Comments
Please login to add a commentAdd a comment