చీమలతో పెట్టుకుంటే అంతే మరి.. | Man puts fire ants in his pants and instantly regrets it | Sakshi
Sakshi News home page

చీమలతో పెట్టుకుంటే అంతే మరి..

Published Sat, Jun 13 2015 11:14 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

చీమలతో పెట్టుకుంటే అంతే మరి..

చీమలతో పెట్టుకుంటే అంతే మరి..

థాయ్లాండ్ :   ఒక నిమిషంలో 40 ఇడ్లీలు.. 30 లడ్డూలు,   విషనాగుల బుట్టలో పది నిమిషాలు....పదునైన వంద కత్తులు .,. ఇలా పందాలు కాయటం మనకు తెలిసిన విషయమే.. ఇలాగే చీమలుతో పెట్టుకొని.... ఓ యువకుడు బుక్కైపోయాడు. సరదా కోసం చేసిన ఓ చిలిపి పని అతగాడికి  చుక్కలు చూపించింది. ఒంటిపై ఉన్న చెడ్డీని కూడా విప్పి అవతల పారేసి..బతుకు జీవుడా అంటూ  పరుగులు తీసాడు.  ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో  చక్కర్లు కొడుతోంది.  

వివరాల్లోకి వెడితే...
థాయ్లాండ్కు చెందిన రేయాంగ్ కు ఓ  కొంటె ఆలోచన వచ్చింది. తన  మిత్ర బృందంతో కలిసి ఓ స్టంట్ చేయాలనుకున్నాడు.  స్నేహితులతో కలిసి దాని  ఆచరణలో పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.  ఈ క్రమంలో వాళ్లంతా ఓ చెట్టు నుంచి చీమలను సేకరించారు. దానికోసం చీమలు పుట్టకు మంటపెట్టి మరీ వాటిని బంధించారు. ఆనక దానికి  తగిన మూల్యం చెల్లించుకున్న వైనం  నెట్లో హల్చల్ చేస్తోంది.

మనోడు  ఒక్క చెడ్డీ తప్ప ఒంటి పైన బట్టలు తీసేసి సిద్ధంగా ఉన్నాడు.  నేను రెడీ... కమాన్..కమాన్.. అంటూ ఉత్సాహంగా ఉన్నాడు.  దీంతో  సేకరించిన చీమల్ని మరింత ఉత్సాహంగా స్నేహితులు రేయాంగ్ చెడ్డీలో వేసేశారు.  అందులోనూ అవి మామూలు చీమలు కావు. ఎర్ర చీమలు.. ఇక అంతే.... నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని ఉద్రేకపడే చీమలు.. ఏమనుకున్నాయో ఏమోగానీ.. తమ పని  కానిచ్చేశాయ్.

దాంతో నొప్పిని తట్టుకోలేక పెడబొబ్బలు పెట్టడం రేయాంగ్ వంతైంది. దీంతో ఖంగుతిన్న స్నేహితులు అతనిపై నీళ్లతో పాటు పౌడర్, అదీ ఇదీ చల్లుతూ  చీమల్ని దులపడానికి నానా తంటాలు పడ్డారు.  ఇహ తట్టుకోలేని  రేయాంగ్ ఒంటిపై ఉన్న చెడ్డీ విప్పేసి పరుగందుకున్నాడు. చీమలు పుట్టకు మంట పెడితే అంతే మరి...ఆనక దానికి  తగిన మూల్యం చెల్లించాల్సిందే... అనే కామెంట్లు వెల్లువెత్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement