underpants
-
ఒంటిపై కేవలం అండర్వేర్..అలానే వచ్చి దొంగలను పరిగెత్తించాడు
ఒక వ్యక్తి ఇంటికి కొందరూ దొంగలు దోచుకునేందుకు వచ్చారు. ఆ సమయంలో అతను పడుకుని ఉన్నాడు. వారి అలికిడికి లేచి తాను ఎలా ఉన్నది గమనించకుండా అలానే వచ్చి వారితో వీరోచితంగా పోరాడాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...స్టీవ్ మిడిల్టన్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా కొందరు సాయుధ దొంగలు ఇంటిలోకి చొరబడేందుకు యత్నించారు. ఆ క్రమంలోనే ఆ దుండగులు స్టీవ్ ఇంటి ముంగిట ఉన్న కారు వద్ద గుమిగూడి ఉన్నారు. ఐతే వారి అలికిడికి స్టీవ్‌కి మెలుకువ వచ్చింది. ఆ దొంగలను చూసి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారితో పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో స్టీవ్ నగ్నంగా నిద్రిస్తున్నాడు. వారిని చూసి హడావిడిగా కేవలం అండర్ వేర్ ధరించి అలానే బయటకు పరిగెత్తాడు. అక్కడ ఉన్న ఆ సముహంతో వీరోచితంగా పోరాడాడు. పైగా వారి వద్ద ఆయుధాలు ఉన్న లెక్కచేయకుండా గట్టిగా పోరాడి వారిని పరిగెట్టించాడు. విచారణలో ఆ దొంగలు భవన నిర్మాణ కార్మికుల సముహం అని తేలింది. స్టీవ్ మాత్రం తన గురించి ఆలోచించికుండా దోచుకోవడానికి వచ్చారన్న కోపంతో అలానే బయటకు వచ్చేశానని చెబుతున్నాడు. ఐతే తాను వారిలో ఒక్కరినైనా పట్టుకుని పోలీసులకు అప్పగించేందకు ప్రయత్నించానని, కానీ సాధ్యం కాలేదని చెబుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు వ్యక్తి స్టీవ్‌ని 'అండర్ వేర్ హిరో' అంటూ నెటిజన్లు ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Not all heroes wear capes, in fact some just wear a pair of undies. Steve Middleton was up early on Boxing Day when he spotted some thugs trying to steal from his car - the tradie decided to take matters into his own hands. #9News pic.twitter.com/ocg3s37W2f — 9News Gold Coast (@9NewsGoldCoast) December 26, 2022 (చదవండి: ఆందోళనతో బాధపడుతున్న కూతురు కోసం ఆ తల్లి ఏం చేసిందో తెలుసా!) -
చీమలతో పెట్టుకుంటే అంతే మరి..
థాయ్‌లాండ్ : ఒక నిమిషంలో 40 ఇడ్లీలు.. 30 లడ్డూలు, విషనాగుల బుట్టలో పది నిమిషాలు....పదునైన వంద కత్తులు .,. ఇలా పందాలు కాయటం మనకు తెలిసిన విషయమే.. ఇలాగే చీమలుతో పెట్టుకొని.... ఓ యువకుడు బుక్కైపోయాడు. సరదా కోసం చేసిన ఓ చిలిపి పని అతగాడికి చుక్కలు చూపించింది. ఒంటిపై ఉన్న చెడ్డీని కూడా విప్పి అవతల పారేసి..బతుకు జీవుడా అంటూ పరుగులు తీసాడు. ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెడితే... థాయ్‌లాండ్‌కు చెందిన రేయాంగ్ కు ఓ కొంటె ఆలోచన వచ్చింది. తన మిత్ర బృందంతో కలిసి ఓ స్టంట్ చేయాలనుకున్నాడు. స్నేహితులతో కలిసి దాని ఆచరణలో పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలో వాళ్లంతా ఓ చెట్టు నుంచి చీమలను సేకరించారు. దానికోసం చీమలు పుట్టకు మంటపెట్టి మరీ వాటిని బంధించారు. ఆనక దానికి తగిన మూల్యం చెల్లించుకున్న వైనం నెట్లో హల్చల్ చేస్తోంది. మనోడు ఒక్క చెడ్డీ తప్ప ఒంటి పైన బట్టలు తీసేసి సిద్ధంగా ఉన్నాడు. నేను రెడీ... కమాన్..కమాన్.. అంటూ ఉత్సాహంగా ఉన్నాడు. దీంతో సేకరించిన చీమల్ని మరింత ఉత్సాహంగా స్నేహితులు రేయాంగ్ చెడ్డీలో వేసేశారు. అందులోనూ అవి మామూలు చీమలు కావు. ఎర్ర చీమలు.. ఇక అంతే.... నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని ఉద్రేకపడే చీమలు.. ఏమనుకున్నాయో ఏమోగానీ.. తమ పని కానిచ్చేశాయ్. దాంతో నొప్పిని తట్టుకోలేక పెడబొబ్బలు పెట్టడం రేయాంగ్ వంతైంది. దీంతో ఖంగుతిన్న స్నేహితులు అతనిపై నీళ్లతో పాటు పౌడర్, అదీ ఇదీ చల్లుతూ చీమల్ని దులపడానికి నానా తంటాలు పడ్డారు. ఇహ తట్టుకోలేని రేయాంగ్ ఒంటిపై ఉన్న చెడ్డీ విప్పేసి పరుగందుకున్నాడు. చీమలు పుట్టకు మంట పెడితే అంతే మరి...ఆనక దానికి తగిన మూల్యం చెల్లించాల్సిందే... అనే కామెంట్లు వెల్లువెత్తాయి.