Interesting Facts In Telugu: Do Ants Have Blood? Why Ants Blood Is In Yellow Colour - Sakshi
Sakshi News home page

Science Facts In Telugu: చీమల రక్తం అందుకే ఎర్రగా ఉండదట..!

Published Thu, Nov 18 2021 3:49 PM | Last Updated on Thu, Nov 18 2021 4:16 PM

Interesting Science Facts Thats Why Ants Blood Not Red Like Humans - Sakshi

Why is Ant’s Blood Not Red Like We Humans Have: చురుక్‌ మని కుట్టి పుసుక్కున జారుకునే చీమలను... ఒక్కోసారి దొరకపుచ్చుకుని కసితీర నలిపి అవతలేస్తాం కూడా!! కానీ మనుషుల రక్తం తాగే చీమల్లో కూడా రక్తం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏ రంగులో ఉంటుంది? ఇలాంటి అనుమానాలు ఎప్పుడైనా వచ్చాయా? మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో..

చీమల్లో రక్తం ఉంటుంది. ఐతే అది ఎరుపు రంగులోకాకుండా పసుపు పచ్చరంగులో ఉంటుంది. దీనిని హేమోలింఫ్ అని అంటారు. మిడతలు, నత్తల వంటి వర్టిబ్రేట్స్‌ (వెన్నెముక ఉండే జంతువులు - సకశేరుకాలు)లో ఈ విధమైన రక్తం ఉంటుంది. ఈ ద్రవంలో ఎర్ర రక్తకణాలు లేకపోవటం వల్ల తెల్లగా కనిపిస్తుంది. చీమలు వంటి ఇతర కీటకాల్లో అమైనో యాసిడ్స్‌ అధికంగా ఉండటమే అందుకు కారణమట.

చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!!

వీటి రక్త ప్రసరణ వ్యవస్థ కూడా భిన్నంగా ఉంటుంది. మనుషుల్లో రక్తం సిరలు, ధమనుల్లో ప్రవహిస్తుంది. ఐతే కీటకాల్లో మాత్రం ధమనులు ఉండవు కానీ శరీరమంతా స్వేచ్ఛగా ఏ దిశలోనైనా రక్తం ప్రవహిస్తుంది. అందువల్లనే చీమలు ఎటువంటి వాతావరణంలోనైనా సులభంగా జీవించగలవు. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉన్నట్లే, హిమోలింఫ్ లోపల హిమోసైనిన్  ఉంటుంది.

రక్తం - హిమోలింఫ్ మధ్య గుమనించదగిన ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే.. మనుషుల్లోనైతే రక్తం ద్వారా ఆక్సిజన్‌ శరీరం అంతటా వ్యాపిస్తుంది. కీటకాల్లో ఉండే హేమోలింఫ్ ఆక్సిజన్‌ను శరీరం అంతటా వ్యాపింపచేయదు. వీటి శరీరాలకు స్పిరాకిల్స్ అని పిలువబడే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. ఈ రంధ్రాలు ఎర్ర రక్త కణాలతో పనిలేకుండా నేరుగా క్రిమి అవయవాలకు ఆక్సిజన్‌ చేరవేస్తుంటాయి.

చదవండి: Viral: తెలుసా! ఈ ఉల్లిని కట్‌ చేస్తే ‍కన్నీళ్లు రావట..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement