amino acids
-
Health Tips: అంజీర తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా?
ఒంట్లో నలతగా ఉన్నా... జ్వరంతో బాధ పడుతున్నా అంజీరను తినమని చాలా మంది సలహా ఇస్తారు. ఒత్తిడిని తగ్గించే అంజీర పండ్లకు వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఐదు వేల సంవత్సరాల కిందటే అంజీర సాగు చేయడం మొదలైందని ప్రతీతి. ప్రస్తుతం ప్రపంచమంతటా అంజూర్ను పండిస్తున్నారు. ముఖ్యంగా ఈజిప్టు, టర్కీ, స్పెయిన్, మొరాకో, గ్రీస్, ఇటలీ, బ్రెజిల్ తదితర దేశాల్లో అంజీర ఎక్కువగా సాగవుతోంది. వగరు, తీపి, పులుపు కలగలిసే ఉండే ఈ పండ్లను ఎండబెట్టగా తయారయ్యే అంజీర డ్రై ఫ్రూట్ ఏడాది పొడుగునా మార్కెట్లలో దొరుకుతూనే ఉంటుంది. అంజీరలో ఉండే పోషకాలు... ►అంజీరలో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. ►విటమిన్ సి, ఎ, బి6, కె విటమిన్లు దీనిని తినడం ద్వారా లభిస్తాయి. ►పొటాషియం, క్యాల్షియం అంజీరలో పుష్కలం. ►సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి ఇతర ఖనిజ లవణాలు కూడా అంజీరలో తగు మోతాదుల్లో ఉన్నాయి. 100 గ్రాముల తాజా అంజీరలో ఉండే న్యూట్రియెంట్స్ కార్బోహైడ్రేట్లు- 6 శాతం ప్రొటిన్- 2 శాతం ఫ్యాట్- 0 శాతం మొత్తం కాలరీలు- 74 పీచు పదార్థం 12 శాతం మెగ్రీషియం- 4 శాతం కాల్షియం- 3 శాతం ఐరన్- 2 శాతం పొటాషియం- 7 శాతం షుగర్స్- 33 శాతం అంజీర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ►అంజీరలో ఫైబర్ ఎక్కువ. జీర్ణక్రియను వేగవంతం చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ►ఇందులోని కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకలు, కండరాలు బలంగా తయారవడంలో తోడ్పడతాయి. ►బరువు తగ్గడానికి, మానసిక ఒత్తిడుల నుంచి బయటపడడానికి అంజీర తినడం ఉపయోగకరం. ►గుండె జబ్బులు, క్యాన్సర్లకు అంజీర మంచి ఔషధం. ►ఎమైనో ఆమ్లాలు ఎక్కువ. ఎండిన అంజీర తినడం వల్ల లైంగిక సామర్థ్యం మెరుగవుతుంది. పురుషులు 2 లేదా 3 అంజీర పళ్లను రాత్రంతా పాలలో నానబెట్టి... మరుసటి రోజు ఉదయాన్నే తింటే మంచి ఫలితాలు ఉంటాయి. ►అంజీర జ్యూస్‌లో తేనె కలుపుకొని తరచుగా తాగితే బ్లీడింగ్ డిజార్డర్ తగ్గుతుంది. ►అంజీర పేస్ట్ ముఖానికి రాసుకోవడం వల్ల మెలనిన్ తగ్గుతుంది. ►వాపులపై అంజీర పేస్ట్‌ను రాస్తే ఉపశమనం కలుగుతుంది. ►మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడంలో అంజీర ఉపయోగపడుతుంది. చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
Science Facts: చీమల రక్తం అందుకే ఎర్రగా ఉండదట..!
Why is Ant’s Blood Not Red Like We Humans Have: చురుక్ మని కుట్టి పుసుక్కున జారుకునే చీమలను... ఒక్కోసారి దొరకపుచ్చుకుని కసితీర నలిపి అవతలేస్తాం కూడా!! కానీ మనుషుల రక్తం తాగే చీమల్లో కూడా రక్తం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏ రంగులో ఉంటుంది? ఇలాంటి అనుమానాలు ఎప్పుడైనా వచ్చాయా? మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో.. చీమల్లో రక్తం ఉంటుంది. ఐతే అది ఎరుపు రంగులోకాకుండా పసుపు పచ్చరంగులో ఉంటుంది. దీనిని హేమోలింఫ్ అని అంటారు. మిడతలు, నత్తల వంటి వర్టిబ్రేట్స్ (వెన్నెముక ఉండే జంతువులు - సకశేరుకాలు)లో ఈ విధమైన రక్తం ఉంటుంది. ఈ ద్రవంలో ఎర్ర రక్తకణాలు లేకపోవటం వల్ల తెల్లగా కనిపిస్తుంది. చీమలు వంటి ఇతర కీటకాల్లో అమైనో యాసిడ్స్ అధికంగా ఉండటమే అందుకు కారణమట. చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!! వీటి రక్త ప్రసరణ వ్యవస్థ కూడా భిన్నంగా ఉంటుంది. మనుషుల్లో రక్తం సిరలు, ధమనుల్లో ప్రవహిస్తుంది. ఐతే కీటకాల్లో మాత్రం ధమనులు ఉండవు కానీ శరీరమంతా స్వేచ్ఛగా ఏ దిశలోనైనా రక్తం ప్రవహిస్తుంది. అందువల్లనే చీమలు ఎటువంటి వాతావరణంలోనైనా సులభంగా జీవించగలవు. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉన్నట్లే, హిమోలింఫ్ లోపల హిమోసైనిన్ ఉంటుంది. రక్తం - హిమోలింఫ్ మధ్య గుమనించదగిన ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే.. మనుషుల్లోనైతే రక్తం ద్వారా ఆక్సిజన్ శరీరం అంతటా వ్యాపిస్తుంది. కీటకాల్లో ఉండే హేమోలింఫ్ ఆక్సిజన్‌ను శరీరం అంతటా వ్యాపింపచేయదు. వీటి శరీరాలకు స్పిరాకిల్స్ అని పిలువబడే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. ఈ రంధ్రాలు ఎర్ర రక్త కణాలతో పనిలేకుండా నేరుగా క్రిమి అవయవాలకు ఆక్సిజన్ చేరవేస్తుంటాయి. చదవండి: Viral: తెలుసా! ఈ ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావట..! -
ముప్పుతిప్పలు పెడుతున్న మూడు వైరస్లు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ మూడు రూపాల్లో విరుచుకుపడుతూ దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఊపిరాడనివ్వకుండా ముప్పేట దాడి చేస్తోంది. ఒక్కోచోట ఒక్కోలా వ్యాపిస్తూ మానవాళిని గుక్కతిప్పుకోనివ్వడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉంటే, మరికొన్ని రాష్ట్రాల్లో కాస్త తక్కువగా ఉంది. కొన్నిచోట్ల వైరస్‌తో చనిపోయేవారి శాతం అధికంగా ఉంటే, కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో దీని బారినపడిన వారు వేగంగా కోలుకుంటుంటే, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఆలస్యంగా కోలుకుంటున్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలో కరోనా కేసుల్లో మరణాల రేటు 4.23 శాతంగా ఉంది. పైగా అక్కడ అత్యధికంగా 7,628 కేసులు నమోదయ్యాయి. కేరళలో మరణాల రేటు 0.88 శాతమే. తెలంగాణలో 2.62%గా ఉంది. మేఘాలయలో తక్కువ కేసులున్నా మరణాల రేటు దేశంలోనే అత్యధికంగా 8.33 శాతం ఉంది. ఆ తర్వాత పంజాబ్‌లో 5.70 శాతం ఉంది. (బయట తిరిగితే క్వారంటైన్కే ! ) 21 శాంపిళ్ల జన్యు నమూనాలు.. చైనాలోని వూహాన్లో కరోనా పురుడుపోసుకుంది. ఆ తర్వాత ప్రపంచదేశాలకు పాకి వణికిస్తోంది. ఇటలీ, ఇరాన్, స్పెయిన్, అమెరికాలో ఈ మహమ్మారి వేలాది మందిని బలితీసుకుంది. కొన్ని దేశాల్లో కొన్ని రకాలుగా, మరికొన్ని దేశాల్లో ఇంకో విధంగా కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని శాస్త్రవేత్తలు 1,563 శాంపిళ్ల నుంచి కరోనా వైరస్ జీనోమ్ (జన్యు నిర్మాణం)లను రూపొందించారు. వాటి ఆధారంగా మన దేశంలో 21 శాంపిళ్ల నుంచి వైరస్ జీనోమ్లను తయారు చేశారు. వాస్తవంగా మన దేశంలో 303 కేసులను 41కు కుదించి, వాటి నుండి 21 శాంపిళ్ల జన్యు నమూనాలు రూపొందించారు. అందులో వూహాన్‌కు చెందినవి రెండు ఉండగా, ఇటలీ, ఇరాన్ దేశాలకు చెందినవి 19 ఉన్నాయి. ఈ 21 శాంపిళ్లలో కామన్ లక్షణాలను గుర్తించారు. వాటి మధ్య సారూప్యత 99.97 శాతంగా ఉంది. ఇలా కరోనా వైరస్ జీనోమ్‌లపై పరిశోధనలు జరిగాయి. నెక్టŠస్ జనరేషన్ సీక్వెన్సింగ్ పద్ధతిలో ఈ పరిశోధనలు జరిగాయి. చదవండి: వందేళ్ల క్రితం ఏం జరిగింది..? 5 రకాలు.. 3 గ్రూపులు పరిశోధనలో భాగంగా 21 శాంపిళ్లను శాస్త్రవేత్తలు ఐదుగా విభజించారు. – ఉహాన్ నుంచి వచ్చిన భారతీయులు.. వీరిలో కేరళకు చెందిన వారున్నారు. – ఇరాన్లో ఉండే భారతీయులు.. వీరి శాంపిళ్లను సేకరించారు. – ఇటలీ వెళ్లొచ్చిన భారతీయులు. వీరు ఇటలీ వాళ్లను కలవడం వల్ల వచ్చిన పాజిటివ్ కేసులు. – ఇటలీ నుంచి భారతదేశానికి వచ్చిన పర్యాటకులు. వారు రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో తిరిగారు. – ఆగ్రాలో నమోదైన కేసులు. వీరు ఇటలీ వెళ్లొచ్చారు. వారి కుటుంబసభ్యుల శాంపిళ్లను సేకరించారు. పై ఐదు రకాలను ‘ఇటలీ, వూహాన్ (చైనా), ఇరాన్’అనే మూడు గ్రూపులుగా విభజించారు. ఈ మూడు దేశాలకు చెందిన 21 జీనోమ్‌లకు కోడ్ కేటాయించారు. వూహాన్‌కు ‘వీ’, ఇటలీకి ‘జీ’, ఇరాన్‌కు ‘ఎస్’అనే కోడ్ ఇచ్చారు. ఇక జీ (ఇటలీ) గ్రూపులోనూ రెండు ఉప గ్రూపులను గుర్తించారు. వాటిలో ఒక గ్రూపు.. భారతదేశానికి వచ్చిన ఇటాలియన్ టూరిస్టులు. వీరిలో వూహాన్ వైరస్ ఉండటంతో పాటు స్కాట్లాండ్, ఫిన్లాండ్, ఇంగ్లండ్‌కు దగ్గరగా వీళ్ల జీనోమ్‌లు ఉన్నట్లు గుర్తించారు. మరో ఉప గ్రూపు.. ఆగ్రాతో కాంటాక్ట్ అయినవారు. వీరి జీనోమ్‌ను పరిశీలించగా బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్ జీనోమ్‌లకు దగ్గరగా ఉన్నాయి. ఇరాన్‌కు చెందిన ‘ఎస్’కోడ్‌లో కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా సహా ఆగ్నేయాసియా దేశాల జీనోమ్‌లకు దగ్గరగా ఉన్నాయి. ఇటలీ, వూహాన్ జీనోమ్ల్లో దగ్గరి పోలికలు ఉన్నాయి. వాటి మధ్య తేడా 0.01 శాతంగా ఉంది. ఇరాన్ జీనోమ్‌కు, వూహాన్‌కు 0.024 శాతం తేడా ఉంది. ఈ తేడా ఎక్కువ ఉండటం వల్ల ఇరాన్ జీనోమ్ వల్ల వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచం మొత్తమ్మీద ఎక్కువ దేశాల్లోని కేసులు ఇటలీ జీనోమ్‌కు దగ్గరగా ఉన్నాయి. మన దేశంలో మాత్రం ఇరాన్ జీనోమ్‌తో ఎక్కువగా ప్రభావితమైంది. అమెరికా కూడా అదే జీనోమ్‌తో ప్రభావితమైంది. ఇరాన్‌తోనే మర్కజ్ కేసులు వచ్చాయని, దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇరాన్లో మొదట్లో అధికంగా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనాలో మొత్తం 9,860 ఎమినోయాసిడ్స్ ప్రపంచంలో 30 రకాల కోవిడ్–19 వైరస్‌లున్నాయి. అందులో మన దేశంలో మూడు రకాలున్నాయి. అయితే వాటి మధ్య కొద్దిపాటి తేడాలున్నాయి. అందుకే వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా వైరస్ వ్యాప్తి, మరణాలు, రికవరీ రేట్లు ఉన్నాయి. జీనోమ్‌లో జీన్స్ ఉంటాయి. జీన్స్‌లో ప్రొటీన్ ఉంటుంది. కరోనా వైరస్‌లో 27 రకాల ప్రొటీన్లు ఉన్నాయి. ప్రొటీన్‌లో ఎమినోయాసిడ్స్ ఉంటాయి. కరోనా వైరస్‌లో మొత్తం 9,860 ఎమినోయాసిడ్స్ ఉన్నాయి. ఎమినోయాసిడ్స్ వల్లనే శరీరంలో మార్పులు వస్తాయి. ఎమినోయాసిడ్స్ జీన్స్‌లో ఉండే స్థితినిబట్టి వాటిని మూడు రకాల వైరస్‌లుగా ఇండియాలో గుర్తించారు. ఈ పరిశోధనలను ఇంకా కొనసాగించాల్సి ఉంటుందని, ఈ మూడు రకాల వైరస్ల కారణంగానే దేశంలో వివిధ రాష్ట్రాల్లో వైరస్ వ్యాపి, మరణాలు, రికవరీ రేటులో తేడా కనిపిస్తోందని నిజామాబాద్ మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల విశ్లేషించారు. దేశంలో 3 రకాల వైరస్ల దాడి కరోనా వైరస్ ఒక్కోచోట ఒక్కోవిధంగా వ్యాపించడానికి గల కారణాలను భారతీయ శాస్త్రవేత్తలు పరిశోధించారు. ప్రపంచవ్యాప్తంగా 30 రకాల విభిన్న లక్షణాలున్న కరోనా వైరస్‌లుంటే, భారతదేశంలో మూడు రకాల వైరస్లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఒక వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుందని గుర్తించారు. అందుకు సంబంధించి ఎన్ఐవీ, ఐసీఎంఆర్, ఎయిమ్స్‌లు ఇటీవల కరోనా వైరస్‌పై సంయుక్తంగా పరిశోధన నిర్వహించాయి. పరిశోధన వివరాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐజేఎంఆర్) రెండ్రోజుల క్రితం ప్రచురించింది. చదవండి: సంపన్నులపై ‘కరోనా’ పన్ను! -
రోగ నివారిణి గోధుమ గడ్డి రసం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మారిన జీవన శైలివల్ల ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎన్నో వ్యాధులబారిన పడుతున్నాం. నానాటికీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం వల్ల మనలోని రోగనిరోధక శక్తి క్రమేపీ క్షీణిస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ప్రకృతి ప్రసాదించిన వివిధ రకాల వైద్య విధానాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గోధుమ గడ్డి రసంతో పలు రకాల వ్యాధులను నివారించవచ్చునని వాడకందారులు చెబుతున్నారు. ఈ గోధుమ గడ్డిలో 13 రకాల విటమిన్లు, 111 రకాల పోషకాలున్నాయని శాస్త్ర పరిశోధనలో తేలిందని ఈ ఔషధం తయారీదారుడు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా విటమిన్లు, ఎంజైమ్‌లు, అమినో ఆసిడ్లు, ప్రోటీన్లు ఉన్నాయి. గోధుమ గడ్డి రసాన్ని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా 100 గ్రాముల గోధుమ గడ్డిలో కిలో ఆకు కూరల సత్తువ ఇమిడి ఉంటుందని అనుభవజ్ఞులు చెపుతున్నారు. ప్రాముఖ్యత... గోధుమ గడ్డి మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరం. కొన్ని వేల ఏళ్ల నుంచి మానవుడు ఆరోగ్య సమస్యలకు నివారిణిగి ఉపయోగపడుతోంది. దీన్ని మహా భారతంలో సంజీవనిగా వర్ణించారు. ఈ గోధుమ గడ్డిలో ఆరోగ్య విలువల్ని గుర్తించింది అమెరికాకు చెందిన డాక్టర్ విగ్మొర్. ఐతే ఎల్బీ నగర్‌కు చెందిన డి.సిరియాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ రసాన్ని ప్రతి రోజు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వద్ద విక్ర యిస్తుంటారు. దీని ఖరీదు సుమారు 100 గ్రాములకు రూ.20. మంచి ఫలితాలను ఇస్తుందని వాడకందారులు చెబుతున్నారు. రసంతో కలిగే లాభాలు... కాన్సర్, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, బహిష్టు సమస్యల నివారణకు ఉపకరిస్తుంది. మధుమేహం, పైల్స్, గ్యాస్, కడుపులో పుండు తదితర సమస్యలకు పనిచేస్తుంది. రక్తంలో చెక్కర శాతం, కొలెస్ట్రాల్, మల బద్దకాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత, శ్వాస, చెమట సమస్యల నివారణ గోధుమ గడ్డి గుజ్జును పసుపు, పాలతో కలిపి ముఖానికి రాస్తే మచ్చలు, మొటిమలు, పగలటం, నల్లబడటాన్ని నివారించవచ్చు. గోధుమ గడ్డిలో పీచు ఉన్నందున జీర్ణం ఎక్కువ అవుతుంది. శరీరం బరువు పెరగటాన్ని తగ్గిస్తుంది శరీరంలో సహజమైన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. తయారీ విధానం... గోధుమలను 12 గంటలు నానబెట్టాలి. ట్రేలల్లో ఒక ఇంచు వరకు మట్టి పోసి విత్తనం వేయాలి. దానిపై సన్నటి మట్టిని చల్లి నీళ్లు చిలుకరించాలి. 4వ రోజుకు మొలకలు వస్తాయి. 8వ రోజు గడ్డి పెరిగాక వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సిలో వేసి సరిపడ నీళ్లు పోసి రసం తీయాలి. ఆ రసాన్ని పాలిస్టర్ గుడ్డలో వంపి గట్టిగా పిండాలి. వచ్చిన రసాన్ని పరగడుపున తాగితే మంచి ఫలితాల్ని ఇస్తుంది. 20 నిమిషాల తర్వాత ఏమైనా తినవచ్చును. ఈ మందును ప్రజల్లోకి తీసుకెళ్లాలనుంది..ఈ మందును ప్రజల్లోకి తీసుకుపోవాలనుంది. ఆబిడ్స్‌లోని ఓ పాత పుస్తకాల షాపులో 5 ఏళ్ల క్రితం గోధుమ గడ్డి వల్ల వచ్చే ప్రయోజనాల గూర్చి చదివాను. ప్రయోగించి వాడాను. మంచి ఫలితాలను ఇచ్చింది. నేను ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. మజిల్స్ పెయిన్స్, మొకాళ్ల నొప్పులు రెండు రోజుల్లో తగ్గాయి. ముఖ్యంగా ఇది క్యాన్సర్ రోగులకు, పైల్స్, మధుమేహం ఉన్నవారికి బాగాపనిచేస్తుంది. -డి.సిరియాల్ రెడ్డి, గోధుమ గడ్డి రసం విక్రయదారుడు మంచి ఫలితాలను ఇస్తుంది గోధుమ గడ్డి రసం మంచి ఫలితాలను ఇస్తుంది. ముందుగా ఏదో చూద్దాంలే అని తాగాను. తర్వాత వరుసగా రెండు రోజులు తాగి చూశాను. నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. 3 నెలలుగా తాగుతున్నాను. నేను ఉల్లాసంగా ఉంటున్నాను. నేను తాగటంతో పాటు మా ఇంటికి కూడ తీసుకొని పోతున్నాను. నాకు షుగర్ కంట్రోల్లో ఉంది. -శ్రీహరి, చిక్కడపలి నాకు నరాల బలహీనత తగ్గింది.... నేను 1959 మొదటి బ్యాచ్‌కు చెందిన డాక్టర్‌ను. నరాల బలహీనతతో పూర్తిగా నడవలేక పోయేవాడిని. నారాయణగూడలో న్యూరో సర్జన్‌కు చూపించినా ప్రయోజనం కలగలేదు. ప్రస్తుతం 45 రోజు లుగా గోధుమగడ్డి రసాన్ని వాడడంతో నేను ఇప్పుడు మంచిగా నడువగల్గుతున్నాను. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. -డాక్టర్ దొరస్వామి రెడ్డి, బీడీఎస్, రిటైర్డ్ డెంటల్ సర్జన్