ఒంట్లో నలతగా ఉన్నా... జ్వరంతో బాధ పడుతున్నా అంజీరను తినమని చాలా మంది సలహా ఇస్తారు. ఒత్తిడిని తగ్గించే అంజీర పండ్లకు వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఐదు వేల సంవత్సరాల కిందటే అంజీర సాగు చేయడం మొదలైందని ప్రతీతి. ప్రస్తుతం ప్రపంచమంతటా అంజూర్‌ను పండిస్తున్నారు.
ముఖ్యంగా ఈజిప్టు, టర్కీ, స్పెయిన్, మొరాకో, గ్రీస్, ఇటలీ, బ్రెజిల్ తదితర దేశాల్లో అంజీర ఎక్కువగా సాగవుతోంది. వగరు, తీపి, పులుపు కలగలిసే ఉండే ఈ పండ్లను ఎండబెట్టగా తయారయ్యే అంజీర డ్రై ఫ్రూట్ ఏడాది పొడుగునా మార్కెట్‌లలో దొరుకుతూనే ఉంటుంది.
అంజీరలో ఉండే పోషకాలు...
►అంజీరలో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ.
►విటమిన్ సి, ఎ, బి6, కె విటమిన్లు దీనిని తినడం ద్వారా లభిస్తాయి.
►పొటాషియం, క్యాల్షియం అంజీరలో పుష్కలం.
►సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి ఇతర ఖనిజ లవణాలు కూడా అంజీరలో తగు మోతాదుల్లో ఉన్నాయి.
100 గ్రాముల తాజా అంజీరలో ఉండే న్యూట్రియెంట్స్
కార్బోహైడ్రేట్లు- 6 శాతం
ప్రొటిన్- 2 శాతం
ఫ్యాట్- 0 శాతం
మొత్తం కాలరీలు- 74
పీచు పదార్థం 12 శాతం
మెగ్రీషియం- 4 శాతం
కాల్షియం- 3 శాతం
ఐరన్- 2 శాతం
పొటాషియం- 7 శాతం
షుగర్స్- 33 శాతం
అంజీర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
►అంజీరలో ఫైబర్ ఎక్కువ. జీర్ణక్రియను వేగవంతం చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.
►ఇందులోని కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకలు, కండరాలు బలంగా తయారవడంలో తోడ్పడతాయి.
►బరువు తగ్గడానికి, మానసిక ఒత్తిడుల నుంచి బయటపడడానికి అంజీర తినడం ఉపయోగకరం.
►గుండె జబ్బులు, క్యాన్సర్‌లకు అంజీర మంచి ఔషధం.
►ఎమైనో ఆమ్లాలు ఎక్కువ. ఎండిన అంజీర తినడం వల్ల లైంగిక సామర్థ్యం మెరుగవుతుంది. పురుషులు 2 లేదా 3 అంజీర పళ్లను రాత్రంతా పాలలో నానబెట్టి... మరుసటి రోజు ఉదయాన్నే తింటే మంచి ఫలితాలు ఉంటాయి.
►అంజీర జ్యూస్‌లో తేనె కలుపుకొని తరచుగా తాగితే బ్లీడింగ్ డిజార్డర్ తగ్గుతుంది.
►అంజీర పేస్ట్ ముఖానికి రాసుకోవడం వల్ల మెలనిన్ తగ్గుతుంది.
►వాపులపై అంజీర పేస్ట్‌ను రాస్తే ఉపశమనం కలుగుతుంది.
►మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడంలో అంజీర ఉపయోగపడుతుంది.
చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల..
Comments
Please login to add a commentAdd a comment