అరణ్యం: చీమ ప్రాణాలు తీయగలదా! | Ants to fight themselves for relief | Sakshi
Sakshi News home page

అరణ్యం: చీమ ప్రాణాలు తీయగలదా!

Published Sun, Dec 8 2013 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

అరణ్యం: చీమ ప్రాణాలు తీయగలదా!

అరణ్యం: చీమ ప్రాణాలు తీయగలదా!

భూమి మీద మొత్తం పన్నెండు వేల రకాల చీమలున్నాయి!
కీటకాలన్నింటిలోకీ చీమలే ఎక్కువ కాలం బతుకుతాయి. వాటి జీవిత వ్యవధి... 30 సంవత్సరాలు!
చీమల్లో బానిసత్వం ఉంది. కొన్ని రకాల జాతుల చీమల వద్ద ఇతర జాతి చీమలు బానిసలుగా మెలుగుతాయి!
నీటిలో పడితే చీమలు ఈదుకుంటూ వచ్చేస్తాయి చూశారా! ఇరవై నాలుగ్గంటలూ నీటిలోనే ఉన్నా, చీమలకు ఏమీ కాదు!
కొన్ని రకాల చీమలకు అసలు కళ్లే ఉండవు!
చీమలకు ఊపిరి తిత్తులు ఉండవు. ఒళ్లంతా ఉండే రంధ్రాల ద్వారా శ్వాసను పీల్చుకుంటాయి. అదే రంధ్రాల ద్వారా బొగ్గు పులుసు వాయువుని వదిలేస్తాయి!
చీమలను చూసి కష్టపడటం నేర్చుకోవాలంటారు పెద్దలు. కానీ నిజానికి చీమలకు చాలా బద్దకం తెలుసా? ఆహారం సేకరించేటప్పుడు తప్ప... మిగతా సమయాల్లో నిద్రపోతూనే ఉంటాయవి!
ఇవి తాము నివసించే ప్రదేశాన్ని విభజించుకుంటాయి. ఒక్కో చీమల దండు ఒక్కో ప్రదేశాన్ని ఎంచుకుంటుంది. ప్రతి దండులోనూ బోలెడు చీమలుంటాయి. వాటన్నిటి మీదా రాణి చీమ అజమాయిషీ చేస్తుంటుంది. మిగతావన్నీ దాని ఆజ్ఞలను పాటిస్తాయి.
చీమల దండ్లు ఆహారాన్ని గోతుల్లో కానీ, చిన్ని చిన్ని తొర్రల్లో కానీ దాచుకుంటాయి. అదేం విచిత్రమో తెలీదు కానీ, ఒక్కో గొయ్యి/తొర్ర ఒక్కో రకమైన వాసన వస్తుంది. ఆ వాసనను బట్టే అవి తమ దాన్ని గుర్తిస్తాయి!
చీమలు పనిని పంచుకుంటాయి. శత్రువులు దాడి చేయకుండా కొన్ని కాపలా కాస్తాయి. కొన్ని ఆహారాన్ని సేకరిస్తాయి. కొన్ని సేకరించిన ఆహారాన్ని పదిల పరుస్తుంటాయి. ఇలా వేటి పనిని అవి చక్కగా చేసుకుపోతాయి!
సాధారణంగా కీటకాలన్నీ ఆకులను తింటాయి. కానీ చీమలు మాత్రం వాటిని ముట్టుకోవు!
ఇవి తమ శరీర బరువుకంటే ఇరవై రెట్ల అధిక బరువును మోయగలవు!
 చీమల వల్ల మనకొచ్చిన నష్టమేమీ లేదు కానీ... వాటిలో అవి విపరీతంగా పోట్లాడుకుంటాయి. ప్రాణాలు తీసేసుకుంటాయి. రెండు చీమలు కొట్టుకున్నాయి అంటే వాటిలో ఒకటి చావాల్సిందే!
 
బుష్ సామ్రాజ్యంలో ఇది సూపర్‌స్టార్!...
 పెంపుడు జంతువులను స్టేటస్ సింబల్‌గా భావించేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే జార్జ్ డబ్ల్యు బుష్ మాత్రం వాటిని ప్రాణంగా భావిస్తారు. ఆయన దగ్గర చాలా పెంపుడు జంతువులు ఉన్నాయి. పలు రకాల కుక్కలు, కొన్ని రకాల పక్షులు, ఒక మేక... ఇంకా చాలా ఉన్నాయి. అయితే అన్నింట్లోకీ బార్నీ అంటే చాలా ప్రేమ ఆయనకు.
 
 ఈ ఫొటోలో బుష్ చేతిలో ఉందే బుజ్జి కుక్క... అదే బార్నీ. దీన్ని ఆయన భార్య లారా ఆయనకు ప్రేమ కానుకగా ఇచ్చారు. అందుకే అది బుష్‌కి చాలా ప్రత్యేకం. ఎన్ని పనులున్నా దానితో ఆడుకోవడానికి కొంత సమయం కేటాయించేంత ఇష్టం అదంటే ఆయనకు. ఒక్కోసారి విదేశాలకు కూడా బార్నీని తనతో పాటు తీసుకెళ్తారు బుష్.
 
 బార్నీ మహా చురుకైనది. బుష్‌తో కలిసి వాలీబాల్, గోల్ఫ్ బాల్ ఆడేస్తుంది. బుష్ అమెరికా అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇది పెద్ద సెలెబ్రిటీనే. ఎప్పుడూ ఆయనతోనే ఉండేదేమో... పేపర్లలోనూ, చానెళ్లలోనూ కనిపిస్తూనే ఉండేది. చాలామంది దీన్ని ‘వైట్‌హౌస్ స్టార్’ అనేవారు సరదాగా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement