వేసవికాలం వచ్చిందంటే చీమలు, బొద్దింకల బెడద ఎక్కువవుతుంది. వేసవిలోనే ఈ సమస్య ఎందుకుపెరుగుతుందో తెలుసా? మరి వీటిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి?
అనేక ఇతర జంతువుల వలె, చీమలు కూడా గడ్డకట్టే శీతల ఉష్ణోగ్రతల నుంచి బయటికొస్తాయి. శీతాకాలంలో నిద్రాణస్థితిలో ఉంటాయి. కొద్దిగా వాతావరణం మారగానే బొద్దింకలు, చీమలు, ఇతర కీటకాలకు ఆహారం కోసం బయటికి రావడం మొదలు పెడతాయి. ఉష్ణోగ్రత వేడెక్కడం ప్రారంభించిన తర్వాత, చీమలు కొత్త గూళ్ళు నిర్మించడం ప్రారంభిస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగిన చీమలు మరింత చురుకుగా జతకడతాయి. సంతానం ఉత్పత్తి చేస్తాయి. ఇది సహజ జీవన చక్రంలో భాగం మాత్రమే. నీరు, వేడి లేదా ఆహారం కోసం వెతుకులాటలో చీమలు, బొద్దింకలు ఈ విషయంలో 'మాస్టర్స్’ అని చెప్పొచ్చు. చీమలు, బొద్దింకల నివారణకు రసాయనాలు, పాయిజన్‌తో నిండిన హిట్, బోరాక్స్ పౌడర్, ఇతర స్ప్రేలతో పోలిస్తే కొన్ని సహజ నివారణ పద్ధతులు పాటించడం ఉత్తమం.
వంటగది షెల్ఫుల్లో కొన్ని లవంగాలు లేదా బిర్యానీ ఆకులు ఉంచండి. ఈ ఆకుల నుండి వచ్చే బలమైన వాసన బొద్దింకలు, చీమలకు పడదు అందుకే అవి ఉన్నచోటికి సాధారణంగా రావు. దోసకాయ ముక్కలుగానీ, దోసకాయ తొక్కలుగానీ చీమల రంధ్రాల దగ్గర ఉంచండి. అలాగే బత్తాయిలు, నిమ్మకాయలు, నారింజ పండ్ల తొక్కలు కూడా బాగా పనిచేస్తాయి. బొద్దింకలు, ఇతర కీటకాలకు ఈ వాసన పడదట. వైట్ వెనిగర్ ను కూడా స్ప్రే చేయవచ్చు.
ఇంకా ఈగలు, బొద్దింకలు వంటి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే దాల్చిన చెక్క పొడి , పుదీనా ఆకులను ఒక గిన్నెలో వేసి ఉంచాలి. చీమల సమస్యకు కాఫీ పొడి చల్లినా కూడా ఫలితం ఉంటుంది. చెత్త డబ్బాలు తరచుగా క్లీన్ చేయంగా, ఓపెన్‌గా గాకుండా బిగుతుగా ఉండేలా మూతలు పెట్టాలి.
నోట్: ఈగలు, చీమలు, బొద్దింకలు, బల్లులు ఇలాంటివి మన వంట ఇంటి ముఖం చూడకుండా ఉండాలంటే. పరిశుభ్రత చాలా ముఖ్యం. ఆహార పదార్థాలు, పండ్లపై మూతలు కచ్చితంగా పెట్టాలి. వంట ఇంటి సింక్‌లో గంటల తరబడి అంట్ల గిన్నెలను వదిలేయ కూడదు. రాత్రి పూట అసలు వదిలేయ కూడదు. సాధ్యమైనంతవరకు ఎప్పటికపుడు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment