నిమ్స్ క్యాంటీన్ దోశలో బొద్దింక | Dead Cockroach in dosa | Sakshi
Sakshi News home page

నిమ్స్ క్యాంటీన్ దోశలో బొద్దింక

Published Fri, May 30 2014 10:36 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM

నిమ్స్ క్యాంటీన్ దోశలో బొద్దింక

నిమ్స్ క్యాంటీన్ దోశలో బొద్దింక

హైదరాబాద్ : ఫోటోలో కనిపిస్తున్న దోశ పేరు ప్రతిష్టలున్న నిమ్స్ ఆస్పత్రిలోని బెల్సన్ తాజ్ క్యాంటీన్లో తయారైంది. బుధవారం రాత్రి నిమ్స్ సెమీస్కిల్డ్ ఎంప్లాయిస్ ఉద్యోగి ఈశ్వర్ సింగ్ కోసం తయారు చేసిన ఈ దోశలో బొద్దింక దర్శనమిచ్చింది. తాజ్ హోటల్ను తలదన్నేలా రేట్లున్నా శుబ్రత లేకపోవడం వల్లే ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని బాధితుడు ఆవేదన వ్య్తక్తం చేశాడు.

ఈ ఘటనపై నిమ్స్లో యూనియన్లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం నిమ్స్ ఔట్ పోలీసులు ఈ క్యాంటీన్లో భోజనం తెచ్చుకొని తింటుండగా అందులో రెండు పురుగులు కనిపించాయి. దాంతో నిమ్స్ ఆస్పత్రి క్యాంటీన్లో భోజనం చేయాలంటేనే రోగులు, వారి బంధువులు, వైద్యులు, సిబ్బంది హడలిపోతున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement