బాలికపై గ్యాంగ్‌రేప్.. వీడియో షూట్! | Tribal girl gangraped, video trending in social media | Sakshi
Sakshi News home page

బాలికపై గ్యాంగ్‌రేప్.. వీడియో షూట్!

Published Sat, Jul 9 2016 10:41 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

బాలికపై గ్యాంగ్‌రేప్.. వీడియో షూట్! - Sakshi

బాలికపై గ్యాంగ్‌రేప్.. వీడియో షూట్!

ఆసిఫాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు యువకులు ఓ బాలికను చెరబట్టారు. లైంగికదాడికి పాల్పడి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి.. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఈ వీడియో రెండ్రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. శనివారం ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. కాగజ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ మల్లేశ్ తిర్యాణి మండలం టేకం లొద్దికి చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మూడు నెలల క్రితం మల్లేశ్ తన మిత్రుడితో కలిసి ఆసిఫాబాద్ వచ్చాడు. అదే సమయంలో ఆసిఫాబాద్‌లో ఉన్న బాలికకు ఫోన్ చేయడంతో బస్టాండ్ వద్ద కలుసుకున్నారు. అక్కడి నుంచి ఆమెను చిన్నరాజూర రోడ్‌కు తీసుకవెళ్లారు. వీరిని గమనించిన ఆసిఫాబాద్‌కు చెందిన మాచెర్ల రాజు, రౌతు రంజిత్, సయ్యద్ మతీన్ అక్కడికి వచ్చారు.

ఆ ముగ్గురూ కలసి మల్లేశ్‌ను, అతడి స్నేహితుడు బాలికను బెదిరించి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. అనంతరం బాలికను పక్కకు తీసుకెళ్లి రాజు(27), రంజిత్(25), మతీన్(23)లు వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో తీశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి వదిలిపెట్టారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో హల్‌చల్ కావడంతో బాలిక తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీశ్‌కుమార్ తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, సామూహిక అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement