మరో నటుడి ఆత్మహత్య.. డ్రగ్స్‌ కేసులో నిందితుడు | Action Hero Biju Actor ND Prasad Found Dead At His Residence | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని నటుడి ఆత్మహత్య.. కారణం ఏంటంటే ?

Published Mon, Jun 27 2022 1:05 PM | Last Updated on Mon, Jun 27 2022 2:00 PM

Action Hero Biju Actor ND Prasad Found Dead At His Residence - Sakshi

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో తరచుగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్య సమస్యలతో ప్రముఖులు కన్నుమూస్తే.. ఎంతో భవిష్యత్తు ఉన్న సెలబ్రిటీలు ఆత్మహత్యలతో తనువు చాలిస్తున్నారు.

Action Hero Biju Actor ND Prasad Found Dead At His Residence: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో తరచుగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్య సమస్యలతో ప్రముఖులు కన్నుమూస్తే.. ఎంతో భవిష్యత్తు ఉన్న సెలబ్రిటీలు ఆత్మహత్యలతో తనువు చాలిస్తున్నారు. ఇటీవల ఒడియా చిత్ర పరిశ్రమకు సంబంధించిన 58 ఏళ్ల నటుడు రాయ్‌మోహన్‌ పరిదా, 23 సంవత్సరాల బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా బలవన్మరణంతో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

మలయాళ నటుడు ఎన్‌డి ప్రసాద్‌ కొచ్చిలోని కలస్సేరి ప్రాంతంలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ప్రసాద్‌ బలవన్మరణానికి మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలే కారణమని పోలీసులు చెప్తున్నారు. ఇదివరకు ప్రసాద్‌ పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. గతంలో డ్రగ్స్‌తో పట్టుబడటంతోపాటు పలు కేసుల్లో అభియోగాలు ఉన్నాయి. గతేడాది ఎర్నాకుళం ఎక్సైజ్‌ సర్కిల్‌ అధికారులు నిర్వహించిన దాడిలో 15 గ్రాముల గంజాయి, 2.5 గ్రాముల హాష్‌ ఆయిల్, 0.1 గ్రాముల బుప్రెనార్‌ఫిన్‌, కొడవలితో పట్టుబడినట్లు సమాచారం. అలాగే నటుడు ప్రసాద్‌పై అనేక పోలీసు స్టేషన్లలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 

(చదవండి: తల్లి కాబోతున్న స్టార్‌ హీరోయిన్)

కాగా 2016లో వచ్చిన నివిన్‌ పౌలీ చిత్రం 'యాక్షన్ హీరో బిజు'లో ఎన్‌డి ప్రసాద్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఇబా, కిర్మాణి చిత్రాల్లో నటించాడు. ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

(చదవండి: హార్ట్‌ సింబల్స్‌తో సమంత ట్వీట్‌.. నెట్టింట వీడియో వైరల్‌..
మరోసారి జంటలుగా రానున్న హీరో-హీరోయిన్లు..
చై-సామ్‌ బాటలో మరో టాలీవుడ్‌ జంట?)

(మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి..
రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement