
తిమ్మాజిపేట: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని కోడుపర్తి గ్రామంలో వివాహం రోజు జరిగిన చోరీ ఘటనలో మరొకరు బలయ్యారు. ఈ నెల 19న శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు రాందేవ్‌రెడ్డి వివాహ వేడుక తర్వాత వారి బంధువులకు చెందిన సుమారు 24 తులాల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, శ్రీనివాస్‌రెడ్డిని వారి బంధువులను విచారించారు. దీంతో అవమానానికి గురైన శ్రీనివాస్‌రెడ్డి తన వ్యవసాయ పొలంలో ఈ నెల 20న రాత్రి ఉరేసుకున్నాడు.
తెల్లవారుజామున చోరీకి గురైన నగలు స్థానిక స్కూల్ సమీపంలో రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఇదే ఘటనకు సంబంధించి అనూహ్యంగా హైదరాబాద్ లోని రాజేందర్‌నగర్‌లో నివాసముంటున్న మృతుడు శ్రీనివాస్‌రెడ్డి అన్న మన్యపురెడ్డి కుమారుడు సురేశ్‌రెడ్డి (26) ఈ నెల 21న రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చోరీకి గురైన బంగారు ఆభరణాలు సురేశ్‌రెడ్డి సోదరి కల్పనవి కావడం, అతడు ఆత్మహత్యకు పాల్పడటం మిస్టరీగా మారింది. మృతుడికి తల్లి యాదమ్మ, సోదరుడు ఉన్నారు.
కొడుకు పెళ్లికి వచ్చిన బంధువుల నగలు చోరీ
Comments
Please login to add a commentAdd a comment