
సాక్షి, గుంటూరు: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య సంఘటన జరగగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించారని బాధితురాలి తల్లి జ్యోతి తెలిపారు. తమ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందించారని వెల్లడించారు. మరో రూ.4.5 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించారని తెలిపారు. తమ కుటుంబానికి ముఖ్యమంత్రి పూర్తి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు. తన కూతురిని హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ను కోరారు.
చదవండి: రమ్య హత్యకు ముందు రెక్కీ
చదవండి:‘ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దళితుడికి అన్యాయం జరగదు’
నా చెల్లి లేదని నేను మర్చిపోకముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నానని అండగా నిలిచారని రమ్య సోదరి మౌనిక తెలిపారు. బహుశా తనను కూడా ముఖ్యమంత్రి చెల్లిగా భావించి ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల్లో ప్రభుత్వం ముందుకొచ్చి సాయం చేసిందన్నారు. అధికారులు కూడా వెంట వెంటనే స్పందించారని తెలిపారు. తమ కుటుంబానికి అండగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మౌనిక ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment