జగత్‌పల్లి(భూదాన్‌పోచంపల్లి) : ప్రమాదవశాత్తు వరికోత యంత్రం కిందపడి బీటెక్ విద్యార్థి దుర్మణం పాల య్యాడు. నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జగత్‌పల్లి గ్రామానికి చెందిన గుండ్ల లచ్చిరెడ్డి శనివారం తన వ్యవసాయ భూమిలో సాగుచేసిన వరిపంటను మిషన్‌తో కోయిం చా డు. మధ్యాహ్నం వరకు వరికోత పూర్తయ్యిం ది. అనంతరం పొలం నుంచి వరికోత యం త్రం బయటికి వెళ్తోంది. అయితే అక్కడే ఉన్న లచ్చిరెడ్డి చిన్న కుమారుడు గుండ్ల సాయికిరణ్‌రెడ్డి(19) క రెంట్ తీగలు వరికోత యంత్రానికి తాకే ప్రమాదం ఉందని గమనించి, వెం టనే యంత్రం వెనుకాలే బైక్‌పై వెళ్లి డ్రైవర్‌కు చెప్పబోయాడు. కాని డ్రైవర్ టేప్‌రికార్డు పాట లు వింటుండటంతో సాయికిరణ్‌రెడ్డి వెనుకాలే ఉన్న విషయం గాని, ఇతని అరుపులు గాని వినలేదు. డ్రైవర్ ముందున్న కరెంటు తీగలను చూసి ఒక్కసారిగా వరికోత యం త్రా న్ని ఆపి, వెనుకకు వేగంగా తీయడంతో సాయికిరణ్‌రెడ్డి ఆ యంత్రం కింద పడిపోయా డు. ఈ ప్రమాదంలో తలకు, కడుపులో తీవ్ర గాయాలై రక్తస్రావం అయ్యింది.
వెంటనే చికి త్స నిమిత్తం పోచంపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే సాయికిరణ్‌రెడ్డి మృతిచెందాడని చెప్పారు. మృతుడు హైదరాబాద్‌లోని ఓప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశాడు. ఉన్నత చదువులు చదువుకుని ప్రయోజకుడవుతాడని భావించిన తల్లిదండ్రులకు కొడుకు అకాల దుర్మరణం పాల వ్వడంతో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంట తడిపెట్టించింది. మృ తుడి తండ్రి లచ్చిరెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జగన్మోహన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
బీటెక్ విద్యార్థి దుర్మరణం
Published Sun, Oct 19 2014 2:08 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement