bhudanpocampalli
-
చేనేతకు వీడియో ‘కాల్’
నిన్నటి వరకు.. గుట్టలుగా పట్టుచీరలు.. ఎలా అమ్ముకోవాలో తెలియదు.. బేరం వస్తే వచ్చినట్టు లేదంటే లేదు.. కొత్తగా ఏదైనా ఆలోచన చేయాలన్నా బయటి పరిస్థితులు, మార్కెట్‌పై అంతంతగానే అవగాహన.. ప్రత్యేకించి ఆన్‌లైన్‌పై అవగాహన లేక అమ్మకాల్లో వెనుకబాటు.. ఈ క్రమంలోనే నష్టాలు.. ఆపై బతుకు కష్టాలు.. ప్రస్తుతం.. అవసరం అన్నిటినీ నేర్పిస్తుంది. ఇప్పుడు భూదాన్‌పోచంపల్లి పట్టు చీరల వ్యాపారులు ‘ఆన్లైన్’ బాటపట్టారు. వీడియో కాల్లో డిజైన్ చూపించి అమ్మడం నేర్చుకున్నారు. మంచి డిజైన్లను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసి ఆర్డర్లు రాబట్టుకుంటున్నారు. కరోనా కాలంలో అన్ని రంగాలు కుదేలైపోతే ఇక్కడి వ్యాపారులు మాత్రం ఆన్లైన్, సామాజిక మాధ్యమాల ద్వారా లక్షల విలువైన చేనేత వస్త్రాలను విక్రయించారు. సాక్షి, యాదాద్రి: ఆన్లైన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో భూదాన్ పోచంపల్లి పట్టుచీరల అమ్మకాలు ఊపం దుకున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌ల ద్వారా వందలాది మంది యువ చేనేత కళాకారులు ఇక్కత్, టైఅండ్‌డై పట్టుచీరలు, పెళ్లిచీరలు, కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్ అమ్మకాలను పెంచుకుని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా సుమారు రూ.4 కోట్ల మేరకు ఆన్లైన్ వ్యాపారం సాగుతోందని అంచనా. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లితో పాటు చౌటుప్పల్, రామన్నపేట, హైదరాబాద్ కేంద్రాలుగా ఆన్లైన్లో వస్త్రాల అమ్మకాలు సాగుతున్నాయి. చేనేత కుటుం బాల్లో ఉన్నత చదువులు చదువుకున్న యువత.. తమకున్న అవగాహనతో ఈ రంగంలో రాణిస్తున్నారు. జిల్లాలో సుమారు 700 మంది వరకు ఆన్లైన్ వ్యాపారంలో కొనసాగుతున్నారు. కరోనా సమయంలోనూ తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకుని కొత్త డిజైన్లతో కొనుగోలుదారులకు చేరువయ్యారు. ధర తక్కువ.. మంచి డిజైన్ కరోనా నేపథ్యంలో అందరి ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. జనం అనవసర ఖర్చులు తగ్గించుకున్నారు. దీంతో వస్త్రాల కొనుగోళ్లూ పడిపోయా యి. మరోపక్క రవాణా వసతి లేక, శుభకార్యాలు నిలిచిపోవడంతో చేనేత పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ఎగుమతులు నిలిచిపోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఉత్పుత్తులు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో ఈ రంగంలోని యువత చేనేత వస్త్రాలను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూ బ్ వంటి మాధ్యమాల్లో పెడుతూ వాటి గురించి ప్రచారం చేశారు. చివరకు వీడియో కాల్ ద్వారా డిజైన్లను చూపించి ఆకర్షించే యత్నం చేశారు. త క్కువ ధరకే మంచి రంగులు, అందమైన చీరల డిజైన్లను ఆన్లైన్లో ఉంచి కొనుగోలుదారులను ఆకట్టుకోగలిగారు. దీంతో వస్త్రాల కొనుగోళ్లు పెరిగాయి. ఆన్లైన్లో అమ్మకాలు ఇలా.. భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, సిరిపురం, వెల్లం కి, బోగారం, రామన్నపేట, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు ఆన్లైన్ అమ్మకాల్లో ముందున్నారు. పోచంపల్లి ఇక్కత్ (టై అండ్ డై) పట్టుచీరలు, డ్రెస్మెటీరియల్స్తోపాటు, మస్రస్ (మెర్స్రైజ్డ్), సిల్కు, పట్టు, కాటన్ వస్త్రాలలో తమకు అందుబాటులో ఉన్న డిజైన్లను, వాటి ధరలను వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తారు. డిజైన్లు, ధర నచ్చి డబ్బులు చెల్లించిన వారికి కొరియర్ ద్వారా పంపిస్తారు. నమ్మకం కుదిరిన వారికి, సంస్థలకు క్రెడిట్ కూడా ఇస్తున్నారు. దీంతో లాక్డౌన్ సమయంలోనూ ఆన్లైన్ అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్కొక్కరు నెలకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైన సరుకు విక్రయించారని అంచనా. లాక్డౌన్ అనంతరం దుకాణాలు తెరుచుకోవడంతో ఆన్లైన్ వ్యాపారం కాస్త తగ్గింది. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 30 వేల చేనేత కుటుంబాలు ఉండగా, ప్రతి నెలా సగటున లక్ష పట్టుచీరలు ఉత్పత్తవుతున్నాయి. ఆన్లైన్లో విక్రయించే వారికి సొంతంగా వెబ్సైట్లు, కొందరికి యూట్యూబ్ చానల్స్ ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేసేవారు కొందరు అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. విదేశాల నుంచి ఆర్డర్లు.. ఆన్లైన్లో పట్టుచీరల కోసం ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. కరోనాతో తగ్గిన సేల్స్‌ను ఆన్లైన్ ద్వారా పెంచుకున్నాం. ఆర్థిక ఇబ్బందులను గుర్తించి కొనుగోలుదారుల కోసం తక్కువ ధర చీరలను కొత్త డిజైన్లతో ఎక్కువగా తయారుచేసి అమ్మకానికి పెట్టాం. వీడియో కాల్ ద్వారా చీరల రంగులు, డిజైన్లు చూపించి.. నచ్చితే ఆన్లైన్ చెల్లింపులతో విక్రయిస్తున్నాం. వీరికి ఇండియా పోస్ట్, కొరియర్ల ద్వారా పార్శిళ్లను పంపిస్తున్నాం. – అంబటి సాయినాథ్, ఆన్లైన్ వస్త్రవ్యాపారి, భూదాన్‌పోచంపల్లి మార్జిన్ తగ్గించుకున్నాం లాక్డౌన్ వేళ ఆన్లైన్ వస్త్రవ్యాపారం బాగా జరిగింది. షాపింగ్‌కు బయటకు వెళ్లే వీల్లేకపోవడంతో చాలామంది ఆన్లైన్ ద్వారా చీరల్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చారు. కరోనా సమయంలో మేం కూడా మార్జిన్ (లాభం) తగ్గించుకున్నాం. ఒక్క పోచంపల్లిలోనే సుమారు 300పైగా యువకులు, దుకాణదారులు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్‌సీజన్‌తో గిరాకీ కొంచెం తగ్గింది. – భారత హరిశంకర్, ఆన్లైన్ వస్త్రవ్యాపారి, భూదాన్‌పోచంపల్లి -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
భూదాన్‌పోచంపల్లి : ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి రైలు పట్టాలపైపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రంలోని మహామ్మాయి కాలనీకి చెందిన గంజి గణేశ్(35) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఈయన కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. దాంతో ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భార్యభర్తలు గొడవపడి గణేశ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చాలా సేపటి వరకు ఇంటికి రాకపోవడంతో భార్య మహాలక్ష్మి తన అత్త, మరిదితో కలిసి వెతికారు. అయినా ఆచూకీ తెలియరాలేదు. దాంతో ఆదివారం కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అక్కడ బీబీనగర్ వద్ద రైలు పట్టాల వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక పోలీసులు మృతుడి ఆనవాళ్లు తెలిపారు. మృతుడి కుడిచేయి మధ్యవేలు విరిగి ఉందని పేర్కొన్నారు. గంజి గణేశ్ చేతివేలు కూడా సగానికి విరిగి ఉండటంతో అనుమానంతో భువనగిరి ఏరియా ఆసుపత్రిలోని మార్చురీలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. అది గణేశేనని కుటుంబసభ్యులు నిర్థారించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి మూడేళ్ల కూతురు ఉంది. ఒకప్పుడు చేనేత కార్మికుడే... ఐదారు ఏళ్ల క్రితం గణేశ్ చేనేత కార్మికుడిగా మగ్గం నేసేవాడు. కానీ చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉండి గిట్టుబాటు కాక, చేనేత వృత్తిని వీడి లారీ డ్రైవర్‌గా చేరాడు. నిరుపేద గణేశ్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని చేనేత నాయకులు కోరారు. -
ప్రేమ పేరుతో వేధింపులు..
రేవనపల్లి(భూదాన్‌పోచంపల్లి) : ప్రేమ పేరుతో ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. విష యం తెలుసుకున్న ఆ యువకుడు కూడా కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. మృతురాలి కుటుంబసభ్యులు, ఎస్ఐ రాఘవేంద్రగౌడ్ కథనం ప్రకారం.. మండల కేంద్రం పరిధిలోని బస్వలింగేశ్వరకాలనీకి చెందిన వలందాసు రమేశ్‌కు నలుగురు కుమార్తెలు. వీరిలో మూడవ కుమార్తె వలందాసు శ్వేత(18) టెన్త్ వరకు చదివింది. ఆ తరువాత ఇంట్లో మగ్గం నేస్తూ, ఇటు ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్ చేస్తుంది. కాగా మండలంలోని రేవనపల్లికి చెం దిన నారి బాలకృష్ణ అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్. ఇ తను శ్వేతను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. దాంతో రెండేళ్ల క్రితం గ్రామంలో పంచాయతీ పెట్టి పెద్ద మనుషులు నచ్చజెప్పారు. దాంతో కొద్దిరోజులు దూరంగా ఉన్నాడు. ఇటీవల తిరిగి శ్వేతతో మాట్లాడం, పెళ్లి చేసుకుందామని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17న అర్థరాత్రి శ్వేత ఇంటికి వచ్చిన బాలకృష్ణ కిటికీలోంచి రాయి విసరడంతో శ్వేత తండ్రి రమేశ్ నిద్రలేచి, అతనిని పట్టుకునేందుకు వెంబడించా డు. దీంతో బాలకృష్ణ బైక్‌ను వదిలి పారిపోయాడు. మాత్రలు మింగి... యువకుడి వేధింపులు ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు శ్వేతను బంధువుల ఇంటికి పంపించాలని నిశ్చ యించారు. ఈ నెల 25న బీబీనగర్ మం డలం చిల్కగూడెంలో ఉంటున్న మేనమామలు వచ్చి శ్వేతను బైక్‌పై ఇంటికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో శ్వేత అస్వస్థతకు గురైంది. ఏమైందని మేనమామలు ప్రశ్నించడంతో ఇంటి వద్ద మా త్రలు మింగానని చెప్పడంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్ల సలహామేరకు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ శ్వేత మంగళవారం మృతి చెందింది. యువకుడి వేధింపుల వల్లే శ్వేత ఆత్మహత్యకు పాల్పడిం దని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం రాత్రి బాలకృష్ణ ఇంటి ముందు వేసి ఆందోళనకు దిగారు. శ్వేత మృతి చెందిందని విషయం తెలుసుకున్న బాలకృష్ణ భయంతో సాయంత్రం ఇంట్లో కలుపుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కు టుంబసభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
భూదాన్‌పోచంపల్లి వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి, కట్టంగూరు మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్పురం గ్రామానికి చెందిన చెర్కు కాశీనాథ్, చంద్రకళ దంపతుల రెండో కుమారుడు గౌతంగౌడ్(24) లండన్‌లో ఎంఎస్ చేసి నాలుగు నెలల క్రితమే ఇంటికి వచ్చాడు. ఉద్యోగ అన్వేషణలో భాగం గా కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఉంటున్నాడు. కాగా బుధవారం మండల శివారులోని కొత్తగూడెంలో జరిగిన మేనమామ కొడుకు వివాహానికి వచ్చాడు. వివాహం అనంతరం అక్కడ నుంచి స్నేహితుడి కారులో స్వస్థలమైన జలాల్పురం వస్తున్నాడు. నేతాజీ కళాశాల దాటిన తరువాత మూలమలుపు వద్ద అతివేగంగా వస్తూ కారు అదుపుతప్పి బోల్తా కొట్టి రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌతం తల పగిలి అక్కడకక్కడే మృతి చెందా డు. కారు నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పంచనామా అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సంఘటనా స్థలంలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. కట్టంగూర్ : సూర్యాపేట మండలం కొత్తిరెడ్డిగూడేనికి చెందిన తండ్రీకొడుకులైన దుబ్బాక వెంకట్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డిలు మంగళవారం రాత్రి సూర్యాపేట నుంచి హైదరాబాదుకు డీసీఎం వాహనంలో కోళ్ల ధానా తీసుకెళుతున్నారు. మార్గమధ్యలో అయిటిపాముల గ్రామశివారులోకి రాగానే డీసీఎం వెనక టైరు పంక్చర్ అయ్యింది. దీంతో డ్రైవర్ బెల్లి యాదయ్య టైరు మారుస్తుండగా తండ్రీకొడకులు సహాయం చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో హైదరాబాదు వైపు వెళ్లే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తండ్రీకొడుకులకు గాయాలయ్యాయి. హైదరాబాదు కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సత్యనారాయణరెడ్డి (18) బుధవారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
బ్యాంకులో చోరీకి విఫలయత్నం
భూదాన్‌పోచంపల్లి : మండల కేంద్రంలోని పోచంపల్లి కో ఆపరేటి వ్ అర్బన్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బుధవా రం రాత్రి ఓ దుండగుడు చోరీకి విఫలయత్నం చేశా డు. బ్యాంకు సీఈఓ సీత శ్రీనివాస్, పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం..భవనం మొదటి అంతస్తులో ఉన్న బ్యాంకు ప్రధానకార్యాలయం వెనుక భాగంలో ఏసీ, కరెంట్ వైర్లు లోపలి నుంచి బయటికి వెళ్లే విధంగా అడుగు మేర రంధ్రం ఉంది. ఆ రంధ్రాన్ని కాట్బోర్డుతో మూసి ఉంచారు. గుర్తుతెలియని వ్యక్తి రాత్రి 11.50 గంటల సమయంలో కాట్బోర్డును తొలగించి ఆ రంధ్రం గుండా కార్యాలయం లోపలికి ప్రవేశించాడు. తన వెంట తెచ్చుకున్న సెల్‌ఫోన్ టా ర్చిలైట్ వెలుగులో లోపలంతా అరగంట పాటు కలి య తిరిగాడు. డ్రాలు అన్ని వెతికాడు. డబ్బులు లేకపోవడంతో సీఈఓ గదిలో ఉన్న డెల్ కంపనీకి చెంది న రూ.25వేల విలువైన లాప్‌ట్యాప్‌ను ఎత్తుకెళ్లాడు. సీసీ పుటేజీలో నమోదు.. దొంగ రాత్రి 11. 50 నిమిషాలకు బ్యాంకులో ప్రవేశించి 12.25 వరకు కార్యాలయంలోనే గడిపాడు. ఈ విషయం బ్యాంకులో అమర్చిన సీసీ కెమెరా పుటేజీలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. అయితే దొంగకు గడ్డం ఉంది, పైన జర్కిన్ వేసుకుని 25 ఏళ్ల లోపు వయస్సు ఉంటుంది. కాగా బ్యాంకు కింది భాగంలో లాకర్లు ఉంటాయి. అయితే దొంగపై నుంచి కింది రావడానికి విఫలయత్నం చేశాడు. పైనుంచి కిందికి రావాలంటే మధ్యన ప్రధాన డోర్ ఉంటుంది. అయి తే దొంగ ఆఫీస్‌లోని డ్రాలో దొరికిన కొన్ని తాళం చెవిలతో తాళాలు తెరిచే ప్రయత్నం చేశాడు. అదీకాక డోర్‌కు బయటి నుంచి గ్రిల్స్ ఉండటంతో రాలేకపోయాడు. చివరకు వెనుదిరిగి వెళ్లిపోయాడు. బ్యాంకు కింద మెయిన్‌రోడ్డున ఇదే బ్యాంకు చెందిన ఏటీఎం కూడా ఉంది.బుధవారం రాత్రి ఏటీఎంలో సెక్యురిటీ గార్డ్ ఉన్న చోరీ జరగడం గమనార్హం. వారం రోజుల క్రితం.... వారం రోజుల క్రితం కూడా దొంగలు మండల కేం ద్రంలోని ఎస్బీహెచ్ బ్యాంకు వెనుక భాగంలో ఉన్న వెంటిలేటర్స్‌ను ధ్వంసం చేసి చోరీకి విఫలయత్నం చేశారని సమాచారం. అదే రోజు రాత్రి స్థానిక ఓ కిరాణం షాపు షట్టర్లేపి లోనికి ప్రవేశించి కొంత నగదును అపహరించుకుపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వెలుగులోకి రాలేదు. వెలుగు చూసింది ఇలా... రోజు మాదిరిగానే ఉదయం బ్యాంకు సీఈఓ సీతాశ్రీనివాస్ లోనికి వెళ్లి చూడగా థర్మాకోల్‌తో ఏర్పాటు చేసిన సీలింగ్ విరిగి, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగిందని గ్రహిం చిన అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చౌటుప్పల్ రూరల్ సీఐ శివరామిరెడ్డి, స్థానిక ఎస్ఐ జగన్మోహన్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. సీసీ కెమెరాలో నమోదైన పుటేజీలను పరిశీలించారు. క్లూస్ టీమ్ సభ్యులు సందర్శించి వేలిముద్రలు నమోదు చేసుకున్నారు. బ్యాంకు అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
బీటెక్ విద్యార్థి దుర్మరణం
జగత్పల్లి(భూదాన్‌పోచంపల్లి) : ప్రమాదవశాత్తు వరికోత యంత్రం కిందపడి బీటెక్ విద్యార్థి దుర్మణం పాల య్యాడు. నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జగత్పల్లి గ్రామానికి చెందిన గుండ్ల లచ్చిరెడ్డి శనివారం తన వ్యవసాయ భూమిలో సాగుచేసిన వరిపంటను మిషన్‌తో కోయిం చా డు. మధ్యాహ్నం వరకు వరికోత పూర్తయ్యిం ది. అనంతరం పొలం నుంచి వరికోత యం త్రం బయటికి వెళ్తోంది. అయితే అక్కడే ఉన్న లచ్చిరెడ్డి చిన్న కుమారుడు గుండ్ల సాయికిరణ్‌రెడ్డి(19) క రెంట్ తీగలు వరికోత యంత్రానికి తాకే ప్రమాదం ఉందని గమనించి, వెం టనే యంత్రం వెనుకాలే బైక్‌పై వెళ్లి డ్రైవర్‌కు చెప్పబోయాడు. కాని డ్రైవర్ టేప్రికార్డు పాట లు వింటుండటంతో సాయికిరణ్‌రెడ్డి వెనుకాలే ఉన్న విషయం గాని, ఇతని అరుపులు గాని వినలేదు. డ్రైవర్ ముందున్న కరెంటు తీగలను చూసి ఒక్కసారిగా వరికోత యం త్రా న్ని ఆపి, వెనుకకు వేగంగా తీయడంతో సాయికిరణ్‌రెడ్డి ఆ యంత్రం కింద పడిపోయా డు. ఈ ప్రమాదంలో తలకు, కడుపులో తీవ్ర గాయాలై రక్తస్రావం అయ్యింది. వెంటనే చికి త్స నిమిత్తం పోచంపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే సాయికిరణ్‌రెడ్డి మృతిచెందాడని చెప్పారు. మృతుడు హైదరాబాద్‌లోని ఓప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశాడు. ఉన్నత చదువులు చదువుకుని ప్రయోజకుడవుతాడని భావించిన తల్లిదండ్రులకు కొడుకు అకాల దుర్మరణం పాల వ్వడంతో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంట తడిపెట్టించింది. మృ తుడి తండ్రి లచ్చిరెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జగన్మోహన్రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
10వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాం
భూదాన్‌పోచంపల్లి : అన్యాక్రాంతమైన 10వేల ఎకరాల భూదాన భూములను కబ్జాదారుల చెరనుంచి విడిపించి ప్రభుత్వానికి అప్పగించామని ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞబోర్డు చైర్మన్ గున్నా రాజేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం భూదానోద్యమ పిత ఆచార్య వినోబాభావే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినోబాభావే కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య వినోబాభావే దేశవ్యాప్తంగా పర్యటించి ప్రేమ, అహింసా పద్ధతుల ద్వారా 44లక్షల ఎకరాల భూమిని సేకరించి పేదలకు పంచిపెట్టారని గుర్తు చేశారు. ఇలాంటి ఉద్యమం ప్రపంచంలో మరెక్కడా జరగలేదని పేర్కొన్నారు. భూదాన భూములను బడాబాబులు కబ్జా చేస్తే కోర్టుల ద్వారా వాటికి విముక్తి కల్పించామన్నారు. భూదాన యజ్ఞ బోర్డు ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. భూదాన భూముల అన్యాక్రాంతంపై తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 1. 66లక్షల ఎకరాల భూదాన భూముల వివరాలన్నింటినీ కంప్యూటరీకరించామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తడక లత, వినోబాభావే సేవా సమితి నాయకులు ఏలే భిక్షపతి, కొయ్యడ నర్సింహ, వేశాల మురళి, కర్నాటి అంజమ్మ, ఎస్. సత్యనారాయణ, వార్డు సభ్యులు మెర్గు పాండు, గుండు శ్రీరాములు, బోడ రమాదేవి, సంగెం లలిత, పెద్దల జయమాల, నాయకులు కుక్క బిక్షపతి, భాగ్యమ్మ, ఇ. అంజమ్మ, జగతయ్య తదితరులు పాల్గొన్నారు.