భూదాన్‌పోచంపల్లి : మండల కేంద్రంలోని పోచంపల్లి కో ఆపరేటి వ్ అర్బన్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బుధవా రం రాత్రి ఓ దుండగుడు చోరీకి విఫలయత్నం చేశా డు. బ్యాంకు సీఈఓ సీత శ్రీనివాస్, పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం..భవనం మొదటి అంతస్తులో ఉన్న బ్యాంకు ప్రధానకార్యాలయం వెనుక భాగంలో ఏసీ, కరెంట్ వైర్లు లోపలి నుంచి బయటికి వెళ్లే విధంగా అడుగు మేర రంధ్రం ఉంది. ఆ రంధ్రాన్ని కాట్‌బోర్డుతో మూసి ఉంచారు. గుర్తుతెలియని వ్యక్తి రాత్రి 11.50 గంటల సమయంలో కాట్‌బోర్డును తొలగించి ఆ రంధ్రం గుండా కార్యాలయం లోపలికి ప్రవేశించాడు. తన వెంట తెచ్చుకున్న సెల్‌ఫోన్ టా ర్చిలైట్ వెలుగులో లోపలంతా అరగంట పాటు కలి య తిరిగాడు. డ్రాలు అన్ని వెతికాడు. డబ్బులు లేకపోవడంతో సీఈఓ గదిలో ఉన్న డెల్ కంపనీకి చెంది న రూ.25వేల విలువైన లాప్‌ట్యాప్‌ను ఎత్తుకెళ్లాడు.
సీసీ పుటేజీలో నమోదు..
దొంగ రాత్రి 11. 50 నిమిషాలకు బ్యాంకులో ప్రవేశించి 12.25 వరకు కార్యాలయంలోనే గడిపాడు. ఈ విషయం బ్యాంకులో అమర్చిన సీసీ కెమెరా పుటేజీలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. అయితే దొంగకు గడ్డం ఉంది, పైన జర్కిన్ వేసుకుని 25 ఏళ్ల లోపు వయస్సు ఉంటుంది. కాగా బ్యాంకు కింది భాగంలో లాకర్లు ఉంటాయి. అయితే దొంగపై నుంచి కింది రావడానికి విఫలయత్నం చేశాడు. పైనుంచి కిందికి రావాలంటే మధ్యన ప్రధాన డోర్ ఉంటుంది. అయి తే దొంగ ఆఫీస్‌లోని డ్రాలో దొరికిన కొన్ని తాళం చెవిలతో తాళాలు తెరిచే ప్రయత్నం చేశాడు. అదీకాక డోర్‌కు బయటి నుంచి గ్రిల్స్ ఉండటంతో రాలేకపోయాడు. చివరకు వెనుదిరిగి వెళ్లిపోయాడు. బ్యాంకు కింద మెయిన్‌రోడ్డున ఇదే బ్యాంకు చెందిన ఏటీఎం కూడా ఉంది.బుధవారం రాత్రి ఏటీఎంలో సెక్యురిటీ గార్డ్ ఉన్న చోరీ జరగడం గమనార్హం.
వారం రోజుల క్రితం....
వారం రోజుల క్రితం కూడా దొంగలు మండల కేం ద్రంలోని ఎస్‌బీహెచ్ బ్యాంకు వెనుక భాగంలో ఉన్న వెంటిలేటర్స్‌ను ధ్వంసం చేసి చోరీకి విఫలయత్నం చేశారని సమాచారం. అదే రోజు రాత్రి స్థానిక ఓ కిరాణం షాపు షట్టర్‌లేపి లోనికి ప్రవేశించి కొంత నగదును అపహరించుకుపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వెలుగులోకి రాలేదు.
వెలుగు చూసింది ఇలా...
రోజు మాదిరిగానే ఉదయం బ్యాంకు సీఈఓ సీతాశ్రీనివాస్ లోనికి వెళ్లి చూడగా థర్మాకోల్‌తో ఏర్పాటు చేసిన సీలింగ్ విరిగి, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగిందని గ్రహిం చిన అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చౌటుప్పల్ రూరల్ సీఐ శివరామిరెడ్డి, స్థానిక ఎస్‌ఐ జగన్మోహన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. సీసీ కెమెరాలో నమోదైన పుటేజీలను పరిశీలించారు. క్లూస్ టీమ్ సభ్యులు సందర్శించి వేలిముద్రలు నమోదు చేసుకున్నారు. బ్యాంకు అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
బ్యాంకులో చోరీకి విఫలయత్నం
Published Fri, Dec 19 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement
Advertisement