
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
నాచారం (హైదరాబాద్) : బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాచారం రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉండే శిరీష(20) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కాగా సోమవారం సాయంత్రం ఇంట్లో అందరూ ఉండగానే పడకగదిలోకి వెళ్లింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూసేసరికి శిరీష సీలింగ్ ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. కిందికి దించి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే శిరీష మృతికి గల కారణాలు తెలియరాలేదు.