ప్రేమజంట ఆత్యహత్యాయత్నం
Published Thu, Mar 3 2016 11:53 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM
- యువకుడు మృతి, యువతి పరిస్థితి విషమం
కాకినాడ సిటీ: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన అనిత పెద్దాపురంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో ఉంటూ స్థానిక ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనలియర్ చదువుతోంది. అదే కళాశాలలో సామర్లకోటకు చెందిన ఆకుల మణికంఠ సురేంద్రకుమార్(22) చదువుకుంటున్నాడు. అనిత, సురేంద్రకుమార్ మధ్య కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే, వారి ప్రేమను పెద్దలు అంగీకరించ లేదని సమాచారం.
ఈ నేపథ్యంలోనే వారు చనిపోయేందుకు నిర్ణయించుకుని గురువారం వేకువజామున ఈ మేరకు పరస్పరం మెసేజ్‌లు పంపుకున్నారు. కొద్దిసేపటికే సురేంద్రకుమార్ మండలంలోని పెద్దబ్రహ్మదేవం గ్రామం వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనిత కూడా హాస్టల్‌లోని తన గదిలో పురుగు మందుతాగింది. కొద్దిసేపటికి గమనించిన తోటి వారు నిర్వాహకుల సాయంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం కోమాలో ఉందని సమాచారం. ఈ మేరకు పోలీసులు ఇద్దరి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement