
ప్రతీకాత్మక చిత్రం
గంగావతి: ప్రసవం కోసం మహిళను ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆశా కార్యకర్తపై గర్భిణి తండ్రి అత్యాచారానికి యత్నించాడు. ఈఘటన గంగావతిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కనకగిరి తాలూకాలోని బసిరిహళ్ గ్రామానికి చెందిన ఒక మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో ఈనెల 16న ఆశా కార్యకర్త ఆమెను గంగావతి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చింది. కాన్పు కష్టంగా మారడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి పొద్దుపోవడంతో ఆశా కార్యకర్త ఓ గదిలో నిద్రించింది. ఇదే అదునుగా గర్భిణి తండ్రి బాలప్ప(59) ఆశాకార్యకర్తపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఆస్పత్రికి చేరుకొని బాలప్పను అరెస్ట్ చేశారు.
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
మైసూరు: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు గిరి దర్శిని లేఔట్‌లో ఆదివారం చోటుచేసుకుంది. విద్యా వికాస్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సుచిత్ ఓబులేసు రై (19) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నేషనల్ డిఫెన్స్ అకాడెమి (ఎన్‌డీఏ) పరీక్ష రాయాల్సి ఉంది. ఇందుకు శిక్షణ కూడా తీసుకున్నాడు.∙సుచిత్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తీవ్రంగా కుంగిపోయినట్లు తెలిసింది. తల్లిదండ్రులు విధులకు వెళ్లిన సమయంలో ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment