ట్రాఫిక్ నిబంధనలు పాటించండి
Published Sat, Aug 24 2013 1:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
గుమ్మడిపూండి, న్యూస్‌లైన్: ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని పొన్నేరి డీఎస్పీ ఉషారాణి సూచించారు. పొన్నేరి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ట్రాఫిక్ నిబంధనలపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత మోటార్ వాహనాల వాడకం పెరిగిందని, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు.
అందుకే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. చిన్న వయస్సు పిల్లలు సైతం మోటార్ సైకిల్స్ నడుపుతూ ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకొంటే ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు.
అనంతరం పొన్నేరి అంబేద్కర్ సెంటర్, బస్టాండ్ సెంటర్, పళవేర్కాడు, బస్టాండ్, అన్నా విగ్రహం సెంటర్, రైల్వేస్టేషన్ రోడ్డుల్లో పోలీసులు కరపత్రాలను పంచారు. అలాగే షాపులు, హోటల్స్, అంగళ్లవద్ద కరపత్రాలు ప్రజలకు ఇచ్చి ట్రాఫిక్ నిబంధనలను వివరించారు. ఈకార్యక్రమంలో పొన్నేరి సిఐ రమేష్‌కుమార్, ఎస్‌ఐ రాజేంద్రన్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement