two women dead
-
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మహిళా కూలీల దుర్మరణం
తాడేపల్లిగూడెం రూరల్: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు.. మరో పది మంది కూలీలు, డ్రైవర్ గాయపడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని అప్పారావుపేట గ్రామానికి చెందిన మాచర్ల రామారావు మాధవరం కోతిగుంట సమీపంలోని బాడవా పొలాల్లో కలుపు తీత కోసం అదే గ్రామానికి చెందిన 12 మంది కూలీలను తన ట్రాక్టర్‌పై తీసుకెళ్లాడు. మధ్యాహ్నం పనులు ముగించుకుని తిరిగి వారిని అప్పారావుపేట తీసుకెళ్తుండగా కోతిగుంట చెరువు గట్టు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళా కూలీలు ఆకుమర్తి సుజాత (46), పాకా భారతి (35) మృతి చెందారు. డ్రైవర్ మాచర్ల రామారావు, కూలీలు కోట సింహాచలం, షేక్ మస్తాన్ బీబీ, జొన్నాడ శివపార్వతి, పెరుమళ్ల నాగలక్ష్మి, పెరుమళ్ల కోట సత్తెమ్మ, కోయిల నాగజ్యోతి, పెరుమళ్ల రామలక్ష్మి, తానేటి వరలక్ష్మి, మడిపల్లి సుబ్రహ్మణ్యం, మిద్దే పద్మ గాయపడ్డారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ వైకేవీ అప్పారావు, తాడేపల్లిగూడెం పట్టణ సీఐ నాగరాజు, పెంటపాడు సీఐ జి.సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మాధవరం పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తాడేపల్లిగూడెంలోని ట్రినిటీ ఆస్పత్రికి పంపించారు. ట్రాక్టర్ డ్రైవర్ రామారావును సాయిసంజీవని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. ప్రమాద ఘటనతో మాధవరం, అప్పారావుపేట గ్రామాల్లో విషాదం నెలకొంది. క్షతగాత్రులకు ఉప ముఖ్యమంత్రి పరామర్శ ట్రినిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. మృతులు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున బీమా రూపేణా పరిహారం అందిస్తామని ప్రకటించారు. -
పొట్టకూటికి వెళ్లి.. అనంత లోకాలకు
అంతేలే పేదల బతుకులు. అశ్రువులే నిండిన కుండలు. ఉన్న ఊరిలో ఉపాధి లేదు. ఖాళీగా కూర్చుంటే కుటుంబం గడవదు. ఇంకేం చేయాలి. ఎక్కడ పనిదొరికితే అక్కడికి వెళ్లి పని చేసుకుంటూ పొట్ట పోసుకోవాలి. ఈ కోవకే చెందిన ఒడిశా రాష్ట్రవాసులు కొంతమంది పొట్ట చేతబట్టుకుని పనికోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లారు. రోజూ లాగానే పని పూర్తి చేసుకుని ఇంటికి తిరుగు ముఖం పట్టిన సమయంలో బస్సు బోల్తా కొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అంతా నిరుపేదలే బాధితులంతా నిరుపేదలే. కష్టాన్ని నమ్ముకుని ఎక్కడో ఒడిశా, విశాఖ ప్రాంతాల నుంచి ఇక్కడ పనిచేసేందుకు వచ్చారు. మృతులిద్దరూ ఆదివాసీలు. మిగిలిన చాలామంది కూడా ఆదివాసిలే. గాయపడిన 17 మందిలో పిక్కి సత్యవేణి, పిక్కోలు కాసులమ్మ, పిక్కి రాము అనే ముగ్గురు మహిళలు మాత్రం విశాఖ జిల్లాకు చెందిన వారు. ప్రమాదం ఇలా.. అశ్వినీ రొయ్యల ఫ్యాక్టరీలో గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకూ మహిళా కార్మికులు నైట్ షిఫ్ట్ చేశారు. డ్యూటీ దిగిన తర్వాత 30 మంది కార్మికులు ఫ్యాక్టరీకి చెందిన మినీబస్సులో సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద ఉన్న తమ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌కు బయల్దేరారు. బస్సును డ్రైవర్ జయరాజు అతివేగంగా నడపడంతో అదుపు తప్పి బోల్తా పడిందని విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామానికి చెందిన బాధితురాలు పిక్కి సత్యవేణి శుక్రవారం తెల్లవారుజామున 2.45 గంటలకు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనలో ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా ముకుందాపురం మండలం చిటికపొంగ గ్రామానికి చెందిన ఉర్లక కళావతి (23) అలియాస్ లిజా, ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గైబ మండలం సరికా గ్రామం కాశీనగర్‌కు చెందిన సబర సుందరి (19) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 17 మంది గాయపడగా ప్రభుత్వాస్పత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి పంపారు. ఒడిశాకు చెందిన గురుబారి నాయక్, నాయక్ సీమా అనే మహిళలకు తీవ్రగాయాలు కావడంతో ఐసీయూలో ఉంచారు. ఒడిశాకు చెందిన బిరుసువా గొమాంగో, విశాఖ జిల్లాకు చెందిన పిక్కి రాము అనే ఇద్దరు మహిళలు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి స్వల్పగాయాలు కావడంతో వారికి చికిత్స చేసి పంపించారు. భీమవరం టౌన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణంలో అశ్వినీ రొయ్యల ఫ్యాక్టరీకి చెందిన మినీ బస్సు గురువారం అర్ధరాత్రి యనమదుర్రు రోడ్డు పీడబ్ల్యూడీ లాకుల సమీపంలో నీరులేని పంటబోదెలోకి తిరగబడటంతో ఒడిశాకు చెందిన ఇద్దరు యువతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ప్రమాదంలో 17 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు మహిళలు అదే ఆస్పత్రిలో సాధారణ వార్డులో చికిత్స పొందుతుండగా 13 మంది మహిళలకు స్వల్పగాయాలు కావడంతో చికిత్స చేసి పంపారు. ఫ్యాక్టరీకి చెందిన డ్రైవర్ జయరాజు అతివేగంగా, అజాగ్రత్తగా మినీ బస్సును నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు పిక్కి సత్యవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు భీమవరం వన్‌టౌన్ ఎస్సై ఎస్.సత్యసాయి తెలిపారు. డ్రైవర్ జయరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసాపురం డీఎస్పీ టి.ప్రభాకరబాబు, సీఐ డి.వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను చూసి వివరాలు తెలుసుకున్నారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ రమణ ఘటనా స్థలానికి వెళ్లి బస్సును పరిశీలించారు. ఫిట్నెస్, పత్రాలు సరిగా ఉన్నాయో లేదో విచారిస్తున్నట్టు ఆయన తెలిపారు. గందరగోళంగా వివరాలు మృతులు, బాధితులంతా ఒడిశా, విశాఖకు చెందిన వారు కావడంతో వివరాలు తెలియక గందరగోళం నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు పేర్లు సేకరించగలిగినా మృతుల పేర్లు ఎవరెవరివో తెలియలేదు. ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బాధితుల ఆధార్ కార్డులు తీసుకురమ్మని పోలీసులు కోరినా సాయంత్రం వరకూ అందజేయలేదు. మృతదేహాలు అనాథలుగా ప్రభుత్వాస్పత్రి మార్చురీలోనే సాయంత్రం వరకూ ఉన్నాయి. అక్కడ కనీసం ఎవరూ లేరు. సాయంత్రం 4 గంటల సమయంలో మృతురాలు సుందరి కుటుంబ సభ్యులు ఒడిశా నుంచి రావడంతో ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాన్ని గుర్తించడంతో ఆచూకీ తెలిసింది. -
చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి
-
షిరిడీలో రోడ్డు ప్రమాదం
-
షిరిడీలో రోడ్డు ప్రమాదం
ఇద్దరు నల్లగొండ జిల్లా వాసుల మృతి మర్రిగూడ: షిరిడీలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు.మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రైల్వేస్టేషన్ నుంచి వారు ఆటోలో ఆలయానికి వెళుతుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నల్లగొం డ, మర్రిగూడ, నిడమనూరులకు చెందిన మూడు కుటుంబాలు (14మంది) శనివారం షిరిడీకి వెళ్లారు. అక్కడ రైలు దిగి షేరింగ్ ఆటో లో ఆలయానికి బయలు దేరారు. ఎదురుగా వచ్చిన లారీ.. ఆటోను ఢీకొనడంతో మర్రిగూ డ లెంకలపల్లికి చెందిన మంగమ్మ(55), నల్లగొండ వెలుగుపల్లికి చెందిన వెంకటమ్మ (35)లు అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలి నవారికి గాయాలయ్యాయి. -
మొక్కు చెల్లించేందుకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
హనుమంతునిపాడు, న్యూస్‌లైన్ : ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మహ్మదాపురం సమీపంలోని నంద్యాల, ఒంగోలు హైవేపై ఆదివారం తెల్లవారు జామున జరిగింది. మృతి చెందిన వారిలో కడప జిల్లా వేములవాడ మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన జెల్ల రామాంజనేయమ్మ(55), అనంతపురం జిల్లా గంగంపెంట మండలం ఎగువపల్లి గ్రామానికి చెందిన పెడబల్లి నిర్మలమ్మ(45) ఉన్నారు. గాయపడిన వారిలో చంద్రహాసన్‌రెడ్డి, లక్ష్మీ దీప్తి, చిట్టెం రామాంజనేయమ్మ, బెరైడ్డి, జి.సుశీలమ్మ, డి.బయమ్మ ఉన్నారు. క్షతగాత్రులను పొదిలి, ఒంగోలు వైద్యశాలలకు తరలించారు. వివరాలు.. జెల్లె రామాంజనేయమ్మ పెద్ద కుమారుడు జెల్ల చంద్రహాసన్‌రెడ్డి కుమార్తె జాహ్నిరెడ్డి పుట్టు వెంట్రుకలు తీసేందుకు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు దొనకొండ మండలం గంగ దొనకొండ గంగమ్మ దేవస్థానానికి ఓ లారీ, రెండు తుఫాన్ వాహనాల్లో శనివారం రాత్రి బయల్దేరారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగింది. సమాచరం అందుకున్న కనిగిరి సీఐ సుధాకర్‌రావు, హనుమంతునిపాడు ఎస్సై ఎంఎస్ బేగ్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మిన్నంటిన రోదనలు రామాంజనేయమ్మ సమీప బంధువు నిర్మలమ్మ. ఈమె అనంతపురం జిల్లా నుంచి బంధువుల ఇంటికి వచ్చి ప్రాణాలు కోల్పోయింది. చంద్రహాసన్‌రెడ్డి రామాంజనేయమ్మ పెద్ద కుమారుడు. ఈయన అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె పుట్టు వెంట్రుకలు దేవుని వద్ద తీసేందుకు మొక్కుబడి ఉండటంతో భార్య లక్ష్మీదీప్తి, కుమార్తె జాహ్నిరెడ్డితో కలిసి ఇటీవల స్వదేశానికి వచ్చారు. స్వగ్రామం కడప జిల్లా గుండ్లపల్లికి బంధువులను ఆహ్వానించారు. అందరూ కలిసి గంగదొనకొండ వె ళ్తుండగా ప్రమాదం జరిగింది. తల్లి, బంధువు మృతి చెందడంతో చంద్రహాసన్‌రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. తుఫాన్ వాహనం నడుపుతున్న డ్రైవర్ పరారయ్యాడు. సంఘన స్థలం వద్ద దేవుని వద్దకు తీసుకెళ్తున్న పూజ సామగ్రి చెల్లాచదరయ్యాయి.