సిగ్గు పడేదేముంది? ఐవీఎఫ్‌ ద్వారానే పిల్లల్ని కన్నా: ఇషా అంబానీ | Isha Ambani Says She Conceived Twins Via IVF | Sakshi
Sakshi News home page

సిగ్గు పడేదేముంది? ఐవీఎఫ్‌ ద్వారానే పిల్లల్ని కన్నా: ఇషా అంబానీ

Published Sat, Jun 29 2024 4:09 PM | Last Updated on Sat, Jun 29 2024 4:55 PM

Isha Ambani Says She Conceived Twins Via IVF

ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' (Isha Ambani) ఇటీవల వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు. తన తల్లి నీతా అంబానీ కూడా ఆకాష్‌కి గర్భం దాల్చినప్పుడు ఈ ప్రక్రియనే ఎంచుకున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

నేను ఐవీఎఫ్‌తో పిల్లలకు జన్మనిచ్చిన విషయాన్ని తొందరగానే వెల్లడించాను. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది ఈ ప్రక్రియనే ఎంచుకుంటున్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ వేగంగా డెవలప్ అవుతున్న తరుణంలో ఐవీఎఫ్ ఎందుకు ఎంచుకోకూడదు? అని ఇషా అంబానీ అన్నారు.

ఇషా అంబానీ 2018లో ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత 2022లో ఆదిత్య, కృష్ణ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం చాలా జంటలు ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు.

ఐవీఎఫ్ అంటే ఏమిటి?
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అనేది ఒక వైద్య ప్రక్రియ. ఈ ప్రక్రియలో అండాన్ని, శుక్రకణాలను ఫలదీకరణం చేస్తారు. ఆ తరువాత ఫలదీకరణం చేసిందిం రెండు లేదా మూడు పిండాలను స్త్రీల గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఆ పిండాలు గర్బాశయంలోనే పెరుగుతాయి. ఈ పద్దతిలో చాలామందికి ట్విన్స్ జన్మించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement