![Actress Sameera Reddy Post A Video In Instagram - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/11/post.jpg.webp?itok=ScCreNSE)
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. గతంలో కంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న సమీర ఫోటోషూట్‌లతో హల్‌చల్ చేస్తున్నారు. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు సమీరా. ఈ వీడియోలో సమీరా మేకప్ లేకుండా అల్లరి చేస్తూ కనిపించారు. వీడియోతో పాటు ‘ఇదే నిజమైన నేను..’ అనే కామెంట్‌ను పోస్ట్ చేశారు.
ఈ వీడియోను పోస్ట్ చేయడం వెనుక తన ఆలోచనను ఏంటో కూడా చెప్పుకొచ్చారు సమీరా. ‘ఈ వీడియో పోస్ట్ చేయడం వల్ల నాపై వివర్శలు వస్తాయని నాకు తెలుసు, వాటికి నేను బయపడను. కేవలం నేను మేకప్ లేకుండా ఎలా కన్పిస్తున్నానో చూపించడానికే ఈ పోస్టు చేస్తున్నా’ అని స్పష్టం చేశారు. గతంలో మొదటి గర్భధారణ సమయంలో శరీరాకృతికి సంబధించి సమస్యలు ఎదుర్కొన్న సమీరా అప్పటి ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.
ప్రస్తుతం తాను ఎంతో ధృడంగా ఉన్నానని, ప్రతీ ఒక్కరూ తమలోని లోపాలను తెలుసుకొని సరిదిద్దుకోవాలని, నిరంతరం మనల్ని మనం గౌరవించుకోవాలని సూచించారు. సమీరా రెడ్డి 2014లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్నారు. వీరికి 2015లోనే కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పిన సమీరా చివరగా 2013లో కన్నడ చిత్రం ‘వరదనాయక’లో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment