మన అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో పెళ్లి అయిన ఏడాదిలోపు బిడ్డ కడుపున పడాలని కోరుకునేవారు. సాధారణంగా అలా జరిగేది కూడా. కానీ మారిన పరిస్థితులు, ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలామందిలో సంతానోత్పత్తి పెద్ద సమస్యగా మారింది. లైఫ్‌స్టయిల్, చేస్తున్న ఉద్యోగాలు తదితర కారణాల రీత్యా పిల్లలు పుట్టడం ఆలస్యమవుతోంది. అయితే చక్కటి లైంగిక జీవితంతోపాటు, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టడం అవసరం.
కొన్ని ఆహారాలు సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..
తల్లి కావాలనుకునే మహిళలకు పోషకాలు, ఫోలిక్‌యాసిడ్,ఫోలేట్, కాల్షియం ఐరన్ పుష్కలంగా కావాలి. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
ఆకు కూరలు తినడం వల్ల పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలకూర, తోటకూర, బచ్చలికూర, బ్రోకలీ, బోక్ చోయ్, కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలి. వీటిని ఆలివ్ నూనెలో వేయించుకుని, సైడ్ డిష్‌గా తినండి లేదా సూప్‌లు, సలాడ్‌లు, క్యాస్రోల్స్ మరియు ఆమ్‌లెట్‌లలో యాడ్ చేసుకోవాలి.
కాల్షియం పునరుత్పత్తి వ్యవస్థ సజావుగా పని చేసేలా చేస్తుంది. వేగంగా గర్భం దాల్చడానికి కూడా సహాయపడుతుంది. అలాగే పుట్టబోయే బిడ్డకు అవసరమైన కాల్షియం నిల్వలు పెరుగుతాయి.
సంతానోత్పత్తి స్థాయిని పెంచడానికి, మహిళలు తమ ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ "బి", ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది స్త్రీల సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, విటమిన్ "సి" సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
బీన్స్‌లో లీన్ ప్రొటీన్ అండ్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మహిళల సంతానోత్పత్తిని పెంచుతుంది. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ బీ6 ఇందులో తగినంత పరిమాణంల ఉంటాయి.సంతానోత్పత్తి హార్మోన్లను పెంచడంలో అరటిపండు కీలక పాత్ర పోషిస్తుంది.
డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ త్వరగా గర్భం దాల్చడానికి తోడ్పడతాయి. విటమిన్ "సి" పుష్కలంగా ఉండే పండ్లను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి.
నోట్: పిల్లలు పుట్టాలంటే దంపతుల ఆరోగ్యం చాలా ముఖ్యం. పీరియడ్ సైకిల్‌ను, ఓవులేషన్ పీరియడ్‌ను సరిగ్గా అర్థం చేసుకోని ఆ సమయానికి శారీరక కలయిక చాలా కీలకం. ఒక వేళపిల్లలు పుట్టడం లేట్ అయితే.. నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. మహిళలైతే గర్భసంచిలో, ఫాలోపియన్ ట్యూబ్స్‌లో అడ్డంకులను గైనకాలజిస్ట్ అంచనా వేస్తారు. పురుషుల్లో అయితే వీర్య కణాలు, వాటి కదలికలు, సామర్థ్య పరీక్షలుంటాయి. అలాగే సహజంగా పిల్లలు కలగరు అని తెలిసినా ఆందోళన అనవసరం. ఇపుడు అనేక ఆధునిక సాంకేతికలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు మనం పెద్ద మనసు చేసుకోవాలేగానీ ఆదరించే ఆమ్మానాన్నల కోసం అనాథ పసి బిడ్డలు చాలామంది వేచి ఉన్నారనేది గుర్తుంచుకోవాలి!
Comments
Please login to add a commentAdd a comment