భార్యభర్తల్లో ఒకరు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతే ఈ విషాదాన్ని తట్టుకోవడం, దాన్నుంచి బయటపడటం రెండో వారికి చాలా కష్టం. తమ దాంపత్యానికి గుర్తుగా పుట్టిన పిల్లల్ని చూసుకుంటూ, వారికోసం జీవితాన్ని గడిపేసే వారు ఎక్కువగా ఉంటారు కదా. కానీ ఒక ఆస్ట్రేలియన్ మహిళ తన జీవిత భాగస్వామి చనిపోయిన 15 నెలలకు బిడ్డకు జన్మనిచ్చింది. ఏంటీ అర్థం కాలేదా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.
ఆస్ట్రేలియన్ మోడల్ ఎల్లిడీ పుల్లిన్ స్పెర్మ్ రిట్రీవల్ ద్వారా బిడ్డను కన్నది. తన పోడ్‌కాస్ట్‌లో తన ప్రయాణాన్ని పంచుకుంది. మరణానంతరం భర్త వీర్యం ద్వారా గర్భం దాల్చడం, బిడ్డను కనడం గురించి పోడ్‌కాస్ట్‌లో వివరించింది. ఈ స్టోరీ ఇపుడు వైరల్‌గా మారింది. 2022లోనే ఇన్‌స్టాలో ఈ వివరాలను షేర్ చేసింది కూడా.
2020 జూలైలో ఎల్లిడీ పుల్లిన్ భర్త అలెక్స్ చుంప్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. స్పియర్ ఫిషింగ్‌లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు విడిచిన తన భర్తకు గుర్తుగా బిడ్డను కనాలని ఆశపడింది. ఇందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, పద్ధతుల గురించి స్డడీ చేసింది. భర్త నుంచి పోస్ట్‌మార్టం స్పెర్మ్ రిట్రీవల్ చేయాలని వైద్య నిపుణులను కోరింది. డాక్టర్లు మరణించిన భర్త నుంచి స్మెర్మ్ కలెక్ట్ చేశారు. తర్వాత ఐవీఎఫ్ విధానంలో ఎల్లిడీ గర్బం దాల్చింది.
అలా భర్తను కోల్పోయిన 15 నెలలకు ఎల్లిడీ ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అక్టోబర్ 2021లో మిన్నీ అలెక్స్ పుల్లిన్‌కు జన్మనిచ్చింది. తన పాప అచ్చం తన భర్తలానే ఉంది అంటూ మురిసిపోయింది.
ఎల్లిడీ షేర్ చేసుకున్న వివరాల ప్రకారం. 2020 ఉదయం మాజీ వింటర్ ఒలింపియన్ అలెక్స్ స్పియర్ ఫిషింగ్‌కు వెళ్లాడు. ఎల్లిడీ అప్పుడు తమ కుక్కను బయటకు వాకింగ్‌కి తీసుకెళ్లింది. కానీ ఆమె భర్తను చూడటం అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు. చివరికి ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తన భర్త చనిపోయినట్టు గుర్తించింది. ఇంతలోనే పోస్ట్‌మార్టం స్పెర్మ్ రిట్రీవల్ గురించి తన స్నేహితులు చర్చించు కోవడం ఆమెను ఆకర్షించింది. ఎందుకంటే వారు ఒక బిడ్డను కనేందుకు అప్పటికే చాలా ఆశపడడ్డారు. చివరికి ఆరు నెలల తర్వాత ఐవీఎఫ్ ద్వారా తన కలను సాకారం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment