పణజీ: సముద్రజలాల్లో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి(సీఎస్‌ఐఆర్)– నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్‌ఐవో) డైరెక్టర్ సుశీల్ కుమార్ తెలిపారు. ఇందుకోసం ఉపగ్రహ ఛాయాచిత్రాలతోపాటు నీటి అడుగున పరికరాలను అమర్చి పరిశోధన చేస్తున్నామన్నారు.
హైదరాబాద్‌లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం(ఇన్‌కాయిస్) అందించే సమాచారంపైనే ఇప్పటి వరకు మత్స్యకారులు ఆధారపడుతున్నారని, ఇది కొన్ని ప్రాంతాల్లోనే సాయపడుతోంది చెప్పారు. సముద్ర నీటిలో ఒక నెల కంటే ముందుగానే మత్స్య సంపద రాకను అంచనా వేయటంతోపాటు ఏ ప్రాంతంలో ఎలాంటి మత్స్య సంపద ఉంటుందో తెలియజెప్పే విధానాన్నీ రూపొందిస్తున్నామన్నారు. దీంతో ప్రభుత్వం మత్స్యకారులకు సాయపడే విధానాన్ని రూపొందించే వీలంటుంది.
Comments
Please login to add a commentAdd a comment