rajivgandhi international airport
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అరుదైన గుర్తింపు
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయ మండలి నుంచి ‘వాయిస్ ఆఫ్ కస్టమర్’ గుర్తింపు లభించింది. 2020లో ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందించినందుకుగాను ఈ గుర్తింపు దక్కిందని ఎయిర్‌పోర్టు వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. కోవిడ్–19 పరిస్థితుల్లో కాంటాక్ట్‌లెస్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు దేశంలోనే ఈ–బోర్డింగ్ సదుపాయం కలి్పంచిన తొలి విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఘనత సాధించింది. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడం అభినందనీయమని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(గెయిల్) సీఈఓ ప్రదీప్ ఫణీకర్ పేర్కొన్నారు. -
ఎయిర్పోర్ట్.. అలర్ట్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. కోవిడ్ మహమ్మారి కారణంగా డొమెస్టిక్ విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్‌లో భాగంగా పరిమిత సంఖ్యలో మాత్రమే అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణ వర్షమైనా సరే విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారుతుంది. అదే సమయంలో ప్రయాణికులు సైతం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎయిర్‌పోర్టుకు చేరుకొనేవిధంగా రహదారులు ఉండాలి.దీనిని దష్టిలో ఉంచుకొని ఎయిర్‌పోర్టు రన్వేలు, రహదారులు, తదితర అన్ని ప్రాంతాల్లో అవసరమైన మరమ్మతులను చేపట్టింది. ‘వర్షాకాలం నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. కానీ ఏ క్షణంలోనైనా అంతర్జాతీయ విమానాల రాకపోకలు మొదలు కావచ్చు. ఇందుకనుగుణంగా ఎయిర్‌పోర్టును పూర్తిస్థాయి సన్నద్ధం చేస్తున్నట్లు జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సాధారణ రోజుల్లో కొనసాగే విమానాల రాకపోకలు, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎయిర్‌పోర్టులో రోడ్డు, రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కోజికోడ్ దుర్ఘటన దష్ట్యా కూడా జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. డీజీసీఐ నిబంధనల మేరకు చర్యలు.. ప్రతి ఏడాది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నియమాలకు అనుగుణంగా వర్షాకాలానికి ముందే ఎయిర్‌పోర్టులో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. వరదలు, డ్రైనేజీ బ్లాకేజ్, నీరు నిల్వ వంటివి చోటుచేసుకోకుండా నిరంతరం పర్యవేక్షిస్తారు. అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. అలాగే విమానాశ్రయం మొత్తం రూఫ్ లీకేజీలు, నీరు నిలిచే అవకాశం లేకుండా తనిఖీలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా వర్షాకాలం ప్రారంభం నుంచే తగిన చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఎయిర్‌పోర్టులో ఎయిర్ సైడ్, ల్యాండ్ సైడ్, టెర్మినల్ బిల్డింగ్ మూడు విభాగాలలో వర్షపు నీటి నిర్వహణ, అవసరమైన మరమ్మతుల కోసం ప్రత్యేక యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పాడైన రోడ్లను బాగు చేయడంతో పాటు ఎయిర్‌పోర్టులో వర్షపు నీరు నిలవకుండా ఈ ప్రత్యేక బృందాలు నిరంతరం విధులు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు టెక్నికల్, ఇంజనీరింగ్ విభాగాలతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. సురక్షితమైన రన్‌వే.. ఎయిర్‌పోర్టులో రన్‌వేల నిర్వహణ ఎంతో కీలకమైంది. ప్రస్తుతం పరిమితంగానే విమానాలు నడుస్తున్నాయి. కానీ సాధారణంగా రోజుకు 550 విమానాలు, 60 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. వర్షకాలంలో విమానాలు సురక్షితంగా దిగడానికి, గాలిలోకి ఎగరడానికి రన్ వే మీద ఉండే టార్మాక్ ఎంతో ముఖ్యమైంది. దీని నాణ్యత ఏ మాత్రం దెబ్బతిన్నా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎయిర్ సైడ్ ఆపరేషన్స్ టీం, సేప్టీ, తదితర విభాగాలతో తనిఖీలను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ సైడ్ ప్రాంతంలోని గడ్డిని కత్తిరించడం వర్షాకాలం ముందస్తు ఏర్పాట్లలో ఒక ముఖ్య భాగం. ఈ గడ్డి 1525 సెంటీమీటర్ల మధ్యలో ఉండేట్లు కత్తిరించడమే కాకుండా, గడ్డి మీద తగిన పురుగు మందులను కూడా స్ప్రే చేశారు. వర్షపు నీటి నిర్వహణ.. వాన నీటి పరిరక్షణ కోసం హైదరాబాద్ విమానాశ్రయంలో ఒక సమగ్ర నీటి సంరక్షణ విధానాన్ని పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని చోట్ల కురిసిన వాన నీరు వెంటనే ప్రవహించడానికి వీలుగా డ్రెయిన్లు, ఛానెల్ డక్ట్‌లను నిర్మించారు. దీనివల్ల నేలపై ఎక్కడా నీరు నిలిచే అవకాశం ఉండదు. వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవడానికి విమానాశ్రయపు తూర్పు భాగంలో ఆర్టిఫిషియల్ రీచార్జ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టులో వివిధ చర్యల ద్వారా ఏడాదికి సుమారు 1.729 మిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షపు నీటిని భూమిలోకి రీచార్జ్ చేస్తున్నారు. -
వారికి క్వారంటైన్ లేదు: సోమేశ్ కుమార్
సాక్షి, తెలంగాణ: కేంద్ర పౌరవిమానయాన మార్గదర్శకాల ప్రకారం ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాజీవ్‌గాంధీ ఎయిర్ పోర్ట్ నుంచి కూడా డొమెస్టిక్ ఫ్లైట్స్ ప్రారంభమైనట్లు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. సోమవారం రోజున ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల ఆరోగ్యంపై పలు జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రయాణికుల్ని టచ్ చేయకుండా సెన్సార్లు కూడా ఏర్పాటు చేశాం. ప్రతి అంశంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రయాణాల్ని సాగించే ప్రతి ప్రయాణికుడి దగ్గర ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. ఆరోగ్య సేతు యాప్ ఉన్న వాళ్లనే లోపలికి అనుమతిస్తున్నాం. చదవండి: రెడ్ అలర్ట్: ఆ సమయంలో బయటకు రావొద్దు ఇవాళ రాజీవ్‌గాంధీ ఎయిర్ పోర్ట్ నుంచి 19 ఫ్లైట్స్ రావడం మరో 19 ఫ్లైట్స్ వెళ్లడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సెక్యూరిటీ పరంగా, ఆరోగ్య పరంగా ఎయిర్ పోర్ట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పరీక్షల అనంతరమే అనుమతిస్తున్నాం. ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల క్వారంటైన్ లేదు. 1600 మంది ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కి వస్తున్నట్లు' సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: ఏపీలో మరో 44 కరోనా కేసులు -
10శాతమే ఆక్యుపెన్సీ..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైరస్ విశ్వరూపంతో విమానయానం డోలాయమానంలో పడింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ వైరస్ విమాన రంగాన్ని ఓ రకంగా కుదేలు చేసింది. ఈ ప్రభావం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా పడింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలతో నిత్యం సందడిగా కనిపించే ఎయిర్‌పోర్టు ప్రస్తుతం వెలవెలబోతుంది. విమానయాన సంస్థలు సేవలను నిలిపివేయడంతో వివిధ దేశాలకు రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమానాల్లో సగానికి పైగా రద్దయ్యాయి. ప్రతిరోజూ ఇక్కడి నుంచి 38 అంతర్జాతీయ విమానాలు.. దుబాయ్, మలేసియా, కువైట్, మస్కట్, ఖతర్, యూఏఈ, ఒమన్, బ్యాంకాక్, హాంకాంగ్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. అయితే కోవిడ్ ప్రభావంతో దుబాయ్, బ్యాంకాక్ మినహా ఇతర దేశాలకు ప్రస్తుతం విమాన సర్వీసులు నిలిపివేశారు. తాజాగా లండన్ సహా యూరప్ దేశాలకు కూడా విమాన సేవలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయా దేశాలకు ఇక్కడి నుంచి వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి పలు దేశాలకు రాకపోకలు సాగించే విమానాల్లో ప్రస్తుతం 15 మాత్రమే నడుస్తున్నాయి. ఖాళీగా.. డీలాగా.. కోవిడ్ ప్రభావంతో రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే వారి విమాన ప్రయాణాలు గణనీయంగా తగ్గాయి. అలాగే వివిధ దేశాల నుంచి విమాన సర్వీసులు నిలిపివేయడంతో అక్కడే చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ విమానాల్లో దాదాపు 90 శాతం టికెట్లు రద్దు చేసుకుంటుండటంతో విమానాలు ఖాళీగా తిరుగుముఖం పడుతున్నాయి. పది రోజుల క్రితం వరకు ఆగ్నేయాసియా దేశాలు, గల్ఫ్ దేశాలకే పరిమితమైన కోవిడ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో ఆయా దేశాలకు వెళ్లాలనుకుంటున్న తెలుగు ప్రజలు ప్రయాణాలను నిరవధికంగా వాయిదా వేసుకుంటున్నారు. ఎప్పుడు వెళ్లాలనే షెడ్యూల్ కూడా ఖరారు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో టికెట్ల రద్దుకే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఆయా దేశాల నుంచి వస్తున్న విమానాల్లో కేవలం 10 శాతం సీట్లు మాత్రమే నిండుతున్నట్లు విమానయాన వర్గాలు తెలిపాయి. పోలాండ్‌లో తెలు‘గోడు’.. పోలాండ్ రాజధాని వార్సా ఎయిర్‌పోర్టులో 50 మంది భారతీయులు చిక్కుకుపోయారు. భారత్ రావడానికి ‘లాట్’ఎయిర్‌లైన్స్‌లో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు నిరాశే మిగిలింది. యూరోప్ దేశాల నుంచి విమాన రాకపోకలను నిలిపివేస్తూ మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విమాన సర్వీసును నిలిపివేస్తున్నట్లు లాట్ సంస్థ ప్రకటించింది. దీంతో స్వదేశానికి రావాలకున్న భారతీయులు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు. వీరిలో ఆరుగురు తెలుగువారు ఉన్నట్టు వార్సా ఎయిర్‌పోర్టులో ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన నగేశ్ ‘సాక్షి’కి తెలిపారు. వార్సా దాదాపుగా షట్‌డౌన్ కావడం, యూనివర్సిటీలు మూసివేయడంతో భయానక వాతావరణం నెలకొందని, విమాన సర్వీసులను కూడా నిలిపివేయడంతో తమ పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలాండ్లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడామని, భారత ప్రభుత్వం అనుమతిస్తే వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని వారు హామీ ఇచ్చారని నగేశ్ చెప్పారు. దేశీయ ప్రయాణం కూడా అంతంతే.. సాధ్యమైనంత వరకు విమాన ప్రయాణాలను తగ్గించుకోవాలని ప్రభుత్వం హెచ్చరించడంతో దేశీయ విమానయాన ప్రయాణికుల సంఖ్య పడిపోయింది. శంషాబాద్ నుంచి ప్రతిరోజూ 389 దేశీయ విమానాలు దేశంలోని ప్రదేశాలకు రాకపోకలు సాగిస్తాయి. కోవిడ్ నేపథ్యంలో వీటిలో 60 సర్వీసులను ఆయా సంస్థలు నిలిపివేయగా, షెడ్యూల్ ప్రకటించినప్పటికీ, ప్రయాణికుల సంఖ్య సరిపడా లేదనే కారణంతో బుధవారం ఒక్క రోజే 27 విమానాలను రద్దు చేశారు. చదవండి: ఆ బ్లడ్ గ్రూపు వాళ్లు తస్మాత్ జాగ్రత్త! ప్లీజ్ .. పెళ్లికి అనుమతించండి.. రాష్ట్రంలో హై అలర్ట్ -
ఐరన్ బాక్సుల్లో 9 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి 9.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 3.46 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నాలుగు ఇస్త్రీ పెట్టెల్లో బంగారాన్ని తరలిస్తుండగా అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు నిర్వహించగా వీ-ఆకారంలో ఉన్న బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
విమానంలో ఊపిరాడక 11 నెలల శిశువు మృతి
సాక్షి, హైదరాబాద్: విమానంలో ఊపిరాడక 11 నెలల శిశువు మృతిచెందడం అందరిని కలిచివేసింది. ప్రయాణికులు అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో 11 నెలల శిశువు ఊపిరాడక తెగ ఇబ్బందిపడింది. అయితే విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి సఫలం కాలేదు. అయితే ముందస్తుగా హైదరాబాద్ విమానాశ్రయంలో డాక్టర్‌ను, అంబులెన్స్‌ను సిద్దం చేశారు. లాండింగ్ అయిన వెంటనే హుటాహుటినా స్థానిక అపోలో మెడికల్ సెంటర్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు నిర్దారించిన వైద్యులు.. శ్వాస ఆడకనే చనిపోయినట్లు తెలిపారు. శిశువు మృతి పట్ల విమాన సంస్థ, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. -
4.8 కిలోల బంగారం దొంగతనం... నిందితుని అరెస్ట్
శంషాబాద్(రంగారెడ్డి) : శంషాబాద్ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ నుంచి సుమారు ఐదు కిలోల బంగారం ఉన్న పార్శిల్‌ను దొంగిలించిన ఇద్దరిని ఆర్జీఐఏ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌చేసి, రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం శంషాబాద్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌కు చెందిన వడ్త్యా మనోజ్‌కుమార్ (25), అల్వాల్‌కు చెందిన ఆలూరి సత్యనారాయణరాజు (34)లు బేగంపేట్‌లోని రాయల్ ఎక్స్‌ప్రెస్ కార్గో సంస్థలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ శంషాబాద్ విమానాశ్రయంలోని కార్గో నుంచి ప్రతిరోజు పార్శిళ్లను నగరానికి తరలిస్తుంటారు. కార్గోలో వచ్చే బంగారం, ఇతర వస్తువుల గురించి పట్టుఉన్న వీరిద్దరు గత ఫిబ్రవరి 7న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఈ0348 విమానంలో కోల్కత్తా నుంచి వచ్చిన 132 పార్శిళ్లలో ఒక పార్శిల్‌ను దొంగిలించారు. అయితే రిజిస్టర్లో మాత్రం 131 పార్శిళ్లను మాత్రమే తీసుకున్నట్లు సంతకాలు చేశారు. అక్కడి నుంచి నగరంలోని తమ నివాసాలకు వెళ్లిన తర్వాత పార్శిల్లో ఉన్న రూ.1.20 కోట్ల విలువైన 4.8 కిలోల బంగారు అభరణాలను సమానంగా పంచుకున్నారు. పార్శిళ్లను స్వీకరించిన నగరానికి చెందిన సుశీల్‌కుమార్ పచేరియా ఒక పార్శిల్ తక్కువగా ఉండడంతో ఆర్జీఐఏ పోలీసులకు అదే రోజు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. కార్గో నుంచి పార్శిళ్లను తీసుకెళ్లిన ఇద్దరిపై అనుమానం రావడంతో వారిని విచారించారు. నిందితులిద్దరి నుంచి 4.8 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఆర్జీఐఏ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్‌రెడ్డి బందం సమర్థవంతంగా పనిచేసిందని డీసీపీ కితాబునిచ్చారు.