
కొచ్చి: కేరళలోని త్రిసూర్ జిల్లాలో రూ.50 కోట్ల విలువ చేసే దాదాపు 123 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. రాష్ట్రంలో స్మగ్లింగ్ సిండికేట్‌పై జరిగిన ఆపరేషన్‌లో భాగంగా జిల్లాలో 23 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఈ బంగారాన్ని సీజ్ చేసినట్లు కస్టమ్స్ కమిషనర్ (ప్రివెంటివ్) సుమిత్ కుమార్ తెలిపారు. స్మగ్లర్లు తమిళనాడులోని వివిధ నగరాల నుంచి బంగారాన్ని సేకరించి, రోడ్డు మార్గం ద్వారా త్రిసూర్‌కు అక్రమంగా రవాణా చేశారని పేర్కొన్నారు. అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న మొత్తం 17 మందిని పట్టుకున్నామని, ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని తెలిపారు. బంగారంతోపాటు రూ.2 కోట్ల నగదు, రూ.6.40 లక్షల విలువ చేసే అమెరికా డాలర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment